– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్
సర్పంచుల కన్నా గ్రామ వాలంటీర్లకు, అంగన్వాడి టీచర్లకు, ఆయా లకే గౌరవ వేతనాలు ఎక్కువగా ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా, విజయనగరం టౌన్లో జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గౌరవ సలహాదారులకైతే సుమారు 4 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారని, ప్రస్తుతం విపరీతంగా ధరలు,నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సర్పంచులకు, ఎంపీటీసీ లకు 15 వేల రూపాయలు, కార్పొరేటర్ లకు, 30 వేల రూపాయలు, మున్సిపల్ చైర్మన్ లకు లక్ష రూపాయలు, కార్పొరేషన్ చైర్మన్ లకు రెండు లక్షల రూపాయలు, జిల్లా పరిషత్ చైర్మన్ లకు రెండు లక్షల రూపాయలు గౌరవ వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున , మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతి రాజు , సంధ్యారాణి మరియు పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి (కర్నూల్ జిల్లా), ముల్లంగి రామకృష్ణారెడ్డి (ఎన్టీఆర్ జిల్లా),సింగంశెట్టి సుబ్బరామయ్య (చిత్తూరు జిల్లా), అన్నెపు రామకృష్ణ నాయుడు (శ్రీకాకుళం జిల్లా), బొర్రా నాగరాజు (అల్లూరి సీతారామరాజు జిల్లా), మునిరెడ్డి (కడప జిల్లా),చుక్క ధనుంజయ్ యాదవ్, తుంపల్లి రమణ, కరోతు సత్యం, గేదెల రాజారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.