– కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సీస్ కు రాసిన లేఖ గురించి సాక్షి దినపత్రిక ఎందుకు రాయలేదు?
– నన్ను ఎక్కడ చివాట్లు పెట్టింది రా… యూజ్ లెస్ ఫెలో
– సాక్షి దినపత్రిక రాతలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, అందుకే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు గా నరసాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దేశంలో చట్టాలు సక్రమంగా అమలు అవుతున్నాయి లేదో చూడాల్సిన బాధ్యత న్యాయస్థానాలదన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, రాజ్యాంగంలోని అధికరణలు భిన్నంగా అప్పులు చేయడం జరిగిందన్నారు.
శనివారం హస్తినలో రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ… న్యాయస్థానం ఏదో తనని తప్పుబట్టి నట్లుగా. సాక్షి దినపత్రిక తప్పుడు కథనాన్ని రాసిందని, అలా ఎందుకు తప్పు పడుతుందని ప్రశ్నించారు. ఇష్టా రీతిలో వార్తలు రాస్తే కోర్టు ధిక్కారం అవుతుందని సాక్షి దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్ గుర్తించాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. న్యాయస్థానాలలో న్యాయమూర్తి ప్రశ్నిస్తున్నారని, దానికి న్యాయవాదులు సమాధానం చెబుతారన్నారు. అయితే సాక్షి దినపత్రిక మాత్రం న్యాయమూర్తి సహజంగానే అడిగిన ప్రశ్న కటువుగా కనిపించి, వినిపించిందా అని ఎద్దేవా చేశారు.
తాను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అప్పుల పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దాఖలు చేసి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పై న్యాయమూర్తి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే హక్కు లేదా? తన సహజ ధోరణిలో ప్రశ్నించారన్నారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ ఎవరని అని ప్రశ్నించగా… నరసాపురం ఎంపీ కనుమూరి రామకృష్ణ రాజు అని తన న్యాయవాది, న్యాయమూర్తికి నివేదించగా… ఎంపీ అయితే పార్లమెంటులోనే మాట్లాడవచ్చు కదా అని వ్యాఖ్యానించారన్నారు. ప్రజాదనం తో, బటన్ నొక్కుడు ద్వారా డబ్బులు దండుకుంటున్న సాక్షి పత్రిక రాస్తుందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
హైకోర్టు తనకు చివాట్లు పెట్టిందని సాక్షి దినపత్రిక రాతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ని హైకోర్టు ఎక్కడ చివాట్లు పెట్టిందని ప్రశ్నించారు. సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించకుండా, హైకోర్టు కు రావడం ఏమిటంటే తనని ఎక్కడ చివాట్లు పెట్టింది రా… యూజ్ లెస్ ఫెలో అంటూ సాక్షి దినపత్రిక యాజమాన్యాన్ని, ఎడిటర్ ను ప్రశ్నించారు. పార్లమెంటులోనే మాట్లాడవచ్చు కదా అని సూచించారే తప్ప ప్రశ్నించ లేదన్నారు. సాక్షి దినపత్రిక చదివినవారు తాను దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది అనుకుంటారని చెప్పారు. కానీ జూన్ 15కు వాయిదా వేశారన్నారు.
ప్రస్తుత జడ్జి పదవీ విరమణ చేస్తున్న కారణంగా హైకోర్టు సెలవుల అనంతరం నూతన న్యాయమూర్తి ఈ కేసును విచారిస్తారని తెలిపారన్నారు. సాక్షి దినపత్రిక తన రాతలతో కోర్టులను ప్రభావితం చేయాలని చూస్తోందని విమర్శించారు. తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పై ఎదుటి పార్టీ వాదనలు వినకుండానే, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎఫ్ అర్ బి ఎం నిబంధనల ప్రకారం మూడున్నర శాతానికి మించి అప్పులు చేయడానికి వీల్లేదన్న ఆయన, జీ ఎస్ డి పి
రాజ్యాంగ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకైనా అప్పులు చేయడానికి వీలుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సీస్ కు రాసిన లేఖ గురించి సాక్షి దినపత్రిక ఎందుకు రాయలేదు అని ప్రశ్నించారు. అన్ని దినపత్రికలో ఈ వార్త ప్రముఖంగా ప్రచురించబడిందని గుర్తు చేశారు.