Suryaa.co.in

Andhra Pradesh

సర్పంచులకు సమాంతరంగా పోటీగా పెట్టిన గృహ సారధులు, కన్వీనర్లను రద్దు చేయాలి

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్
– విజయవాడలోని, బందర్ రోడ్, బాలోత్సవ భవన్లో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా సర్పంచుల సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై ప్రసంగించి, సర్పంచ్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన వై.వి.బి. రాజేంద్రప్రసాద్ , వానపల్లి లక్ష్మీ ముత్యాలరావులు

ఈ సదస్సులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావులు మాట్లాడుతూ…… గ్రామపంచాయతీల సర్పంచుల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను వాలంటీర్లను తీసుకురావాలి. గృహసారుదులను, సచివాలయ కన్వీనర్ల రాజకీయ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రస్తుతం వారు గ్రామపంచాయతీలకు, సర్పంచులకు సమాంతర పోటీ వ్యవస్థగా పనిచేస్తున్నారు. సర్పంచులు, వార్డు నెంబర్లు చేయవలసిన పనులను సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు మాకు సమాంతరంగా పోటీగా చేస్తున్నారు.ఇది రాజ్యాంగ విరుద్ధం.

73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ 243 జి, 11 వ షెడ్యూల్లో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 29 అంశాలు – శాఖల ప్రకారం గ్రామ సచివాలయాలు, సచివాలయ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు సర్పంచ్ల ఆధీనంలోనే పనిచేయాలి. ఇది సర్పంచుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, గౌరవ మర్యాదలను కాలరాసినట్లే. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచుల కంటే తాత్కాలిక ఉద్యోగులైన వాలంటీర్లకి ఎక్కువ అధికారం ఉండటం, గృహసారథులు, కన్వీనర్ల పేరిట రాజకీయ పార్టీల నాయకులు పెత్తనం చేయడం సిగ్గుచేటు అయిన విషయం. సర్పంచుల అధికారాలను గృహ సారుదులు, కన్వీనర్లు, వాలంటీర్లు హైజాక్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు అని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 2020 కోట్ల రూపాయలు ఆర్థిక సంవత్సరము ముగిసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం…

గ్రామపంచాయతీలకు ఎందుకు జమ చేయలేదు?
కేంద్ర ప్రభుత్వం అసలు ఆ నిధులను విడుదల చేసిందా లేదా?
విడుదల చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే దొంగిలించి వేసిందా?
విడుదల కాకపోతే అందుకు గల కారణములు ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.
2020 కోట్లు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వ స్పష్టంగా కారణాలను బహిరంగంగా ప్రకటించాలని రాజేంద్రప్రసాద్, లక్ష్మీ లు డిమాండ్ చేసినారు.

కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాతీయ బ్యాంకులలో మా సర్పంచ్ల పేరిట, తెరిచిన పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే వేయాలని, అలాకాకుండా పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ సి.ఎఫ్.ఎం.ఎస్. – పిడి అకౌంట్లలో జమ చేసుకొని ఆ సి.ఎఫ్.ఎం.ఎస్- పిడి అకౌంట్స్ ల నుంచి సర్పంచులకు కూడా చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి నిధులను దొంగిలించివేసి, తన సొంత పథకాలకు, అవసరాలకు వాడేసుకుంటుంది. కనుక జాతీయ బ్యాంక్ పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులు జమ చేయాలని రాజేంద్రప్రసాద్,లక్ష్మీ jhముత్యాలరావు లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

గ్రామ సచివాలయాల పేరుతో ఎమ్మెల్యేలకు ఇస్తున్న 20 లక్షల రూపాయల నిధులను గ్రామపంచాయతీలోకి ఇచ్చి సర్పంచ్ల ద్వారానే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని గ్రామపంచాయతీ ల విద్యుత్ బిల్లులు మరియు క్లాప్ మిత్రుల జీతాలు, సర్పంచులు ఎవరు కట్టవద్దని రాజేంద్రప్రసాద్ మరియు లక్ష్మీ ముత్యాలరావుల పిలుపు నిచ్చారు. పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు మరియు క్లాసు మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ చెల్లించాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపాధి హమీ చట్టం ప్రకారం గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు 15 వేలు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఇలా మా సర్పంచ్ న్యాయబద్ధమైన 13 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రంలోని సర్పంచులు అందరూ రాజకీయాలకు అతీతంగా వారి నిధులను,విధులను, అధికారాలను కాపాడుకోవడం కోసం వారందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజేంద్రప్రసాద్ , లక్ష్మీ ముత్యాలరావులు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ,గౌరవ సలహాదారులు ముల్లంగి రామకృష్ణా రెడ్డి, ఆచారి , సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ ,చిత్తూర్ జిల్లా అధ్యక్షులు చుక్క ధనుంజయ యాదవ్, చాంబర్ ఉపాధ్యక్షుడు కొత్తపు మునిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొండబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గల్లా తిమోతి, కాగితా గోపాల్ రావు జాయింట్ సెక్రెటరీ, ముప్పనేని రవి ప్రసాద్, మారుతి మరియు పంచాయతీ రాజ్ చాంబర్ ,సర్పంచుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE