Suryaa.co.in

Telangana

పెద్దాయన బాగున్నావా?

అవ్వా ఆరోగ్యం ఏలా ఉంది
మంత్రి జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు…
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామీ
వారితో కలసి చాయ్ తాగిన జగదీష్ రెడ్డి
కేసారం శివారు టీ స్టాల్ వద్ద సన్నివేశం
గతంలో ఏ ఎమ్మెల్యే మా ఊరికి రాలేదు
మా ఒక్క ఊరికే 19 సార్లు వచ్చింది జగదీష్ రెడ్డే
జగదీష్ రెడ్డి వచ్చినంకనే రోడ్లు బాగయినయి
వరుసగా 18 పంటలకు మూసి నీళ్లు ఇచ్చిండు జగదీష్ రెడ్డి
నీకు మేమున్నాం మాకు నువ్వు ఉండు
మళ్లీ వచ్చేది జగదీశ్ రెడ్డే
విజయీభవ అంటూ ఆశీర్వాదం

అప్యాయతలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. తాతా బాగున్నావా… అవ్వా నీ పానం ఎట్లుంది అంటూ మంత్రి ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన సన్నివేశం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సూర్యాపేట నియోజకవర్గం కేసారం గ్రామంలో పలుకుల సంఘం భవనాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డికి తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులో టీ స్టాల్ వద్ద గుడికి ఉన్న వయోవృద్ధులు గ్రామస్తులను గమనించాడు. వారిని చూసిన వెంటనే కాన్వాయ్ దిగి వారి వద్దకు వచ్చిన మంత్రి ఓ వృద్ధులను ఎంతో ప్రేమగా పలకరించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా బాగున్నామని మంత్రికి తెలిపిన గ్రామస్తులు , గతంలో ఏ ఎమ్మెల్యే కూడా మా గ్రామానికి రాలేదు అన్నారు. నువ్వు ఎమ్మెల్యే అయిన తరువాత 19సార్లు గ్రామానికి వచ్చినట్లు తెలిపారు.

ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లతో కొడుకు కోడలు మంచిగా చూసుకుంటున్నారని సంతోషంగా తెలిపారు. అప్పటికి ఇప్పటికీ ఎంతో అభివృద్ధి జరిగిందని, అప్పట్లో ఎప్పుడో ఒకసారి మూసి కాలువ వస్తే, వరుసగా 18 పంటలకు నీళ్లు ఇచ్చిన నిన్ను ఆయకట్టు ప్రజలు మర్చిపోరని తెలిపారు. రోడ్లు బాగా అయినాయి అనీ, మాకు బాగు చేస్తున్న నీకు మేము అండగా ఉంటాం నువ్వు మాకు అండ గా ఉండమని కోరారు. సూర్యాపేట లో మళ్లీ గెలిచేది నువ్వే విజయీభవ అంటూ దీవెనలు అందించారు.

కేసారం శివారులో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు రాళ్లూరప్పలతో నిండి ఉన్నాయని వాటిని చదును చేయాలని కోరగా, ప్రభుత్వం ఇచ్చిన మూలన అమ్ముకోడానికి వీలుండదని, భూమిని క్లీన్ చేసిన మీకు ఉపయోగం ఏమీ ఉండదన్నారు. అన్ని హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూములను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనుకోని అతిథి లా వచ్చి తమతో గడిపిన మంచిని చూసి పెద్దవాళ్లు మురిసిపోయారు.

 

LEAVE A RESPONSE