Suryaa.co.in

Telangana

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతరు?

-బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను లూఠీ చేసింది
-కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే
-అంబాసిడర్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది
-భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు

రజాకార్ల హెడ్ క్వార్టర్ దారుస్సలాంను ఓవైసీకి కట్టబెట్టింది కాంగ్రెస్ కాదా?రూ. 22 వేలు ప్రతి రైతుకు ఎకరానికి బోనస్ బిజెపి గ్యారంటీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం..తెలంగాణ బీఆర్ఎస్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది. ప్రజాతీర్పును దొంగిలించేలా… కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.రైతులకు అనేక రకాలుగా మేలు చేసేలా బిజెపి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసింది.

రైతు ఆత్మహత్యలు జరకుండా కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.ఎరువుల సబ్సిడీ విషయంలో ఒక పంటకు.. ఎకరాకు సుమారుగా రూ. 9 వేలు అందిస్తోంది.ఎరువుల విషయంలో పెరిగిన రేట్లకు అనుగుణంగా సబ్సిడీని పెంచి రైతులను ఆదుకుంటోంది.వరి ధాన్యంపై రైతాంగానికి ఎంఎస్ పి తో పాటు క్వింటాలుకు వెయ్యి రూపాయలు అదనంగా బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం.ఒక ఎకరాకు సరాసరి 22 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది.

ఒక ఎకరానికి సుమారుగా 22 వేల రూపాయలు రైతులకు లబ్ధి జరుగనుంది. రెండు పంటలకు 44 వేల రూపాయలు బోనస్ లభిస్తుంది.తెలంగాణలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 లక్షల ఎకరాల వరి సాగు అవుతోంది.కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరాకు రూ. 22 వేలు కేంద్ర సబ్సిడీ లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాగాణ రైతాంగం కోసం ఇచ్చిన ప్రకటనలు, వాగ్ధానాల కంటే బిజెపి ఇచ్చిన హామీ అనేక రెట్లు మేలైంది.ప్రతి రైతుకు.. ప్రతి ఎకరాకు రూ. 2500 విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు సాయం ఇవ్వబోతున్నాం.

ఒక ఎకరానికి 22 వేలు బోనస్ అయితే… 2500 కలిపితే 24 వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తాం. రైతులకు అత్యధిక లాభం చేసే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చింది.ఉత్పత్తికి బోనస్ జోడించడం ద్వారా, దిగుబడికి లింక్ చేయడం ద్వారా కౌలు రైతును ఇందులోకి తీసుకొస్తున్నాం. కేవలం భూస్వామికే కాకుండా కౌలు రైతుకు కూడా సాయం అందించే వ్యవస్థను బిజెపి తీసుకొస్తోంది. స్వామినాథన్ రిపోర్టుకు అనుగుణంగా ఎంఎస్ పి ద్వారా లబ్ధి చేకూర్చేలా దేశ వ్యాప్తంగా పథకాన్ని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే.

తెలంగాణలో సరికొత్త హరిత విప్లవానికి పునాదులు వేసే మేనిఫఎస్టోను బిజెపి తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేనిఫెస్టోను అమలు చేసే పార్టీ.. నాయకత్వం… మోదీ ప్రభుత్వానిదే.ఇది తెలంగాణ రైతులకు మోదీ గారు ఇచ్చిన గ్యారంటీ.తెలంగాణ రైతాంగానికి మోదీ భద్రతా కవచం ఇది.పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారి విదేశీ మారక ద్రావ్యాన్ని కోల్పోతున్నాం.కాబట్టి… వ్యసాయధారిత దేశమైన భారత్ నూనెగింజలు, పప్పు ధాన్యాల విషయంలో ఆత్మనిర్భరత సాధించేలా మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.పప్పు ధాన్యాలు పండించే రాష్ట్రాల్లో కర్ణాటకతో పాటు తెలంగాణ అగ్రగామిగా ఉంది. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఇయర్ గా ప్రకటించింది.

రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే రైతాంగానికి అండగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.తెలంగాణలో మార్క్ ఫెడ్ పూర్తిగా నిర్వీర్యం అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంతో మార్క్ ఫెడ్ బలహీనపడింది.మార్క్ ఫెడ్, నాఫెడ్ కలిసి రైతులకు ఇబ్బందులు లేకుండా పంట ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.వరి ధాన్యంతో పాటు నూనెగింజల సేద్యం, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల సాగులో రైతాంగానికి 360 డిగ్రీల్లో భద్రతను విస్తరింపజేసేలా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది.

క్రమేణా గ్రామాల్లో ఆవుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో రసాయనిక ఎరువల వాడకం పెరిగి.. రైతాంగానికి నష్టం వాటిల్లుతోంది. ఆవులను కావాలని కోరిన ప్రతి రైతుకు ఒక ఆవును ఇచ్చేలా వాగ్ధానాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చింది. దేశీ ఆవుల సంఖ్య తగ్గిపోవడంతో కాలుష్యం పెరిగిపోయి క్యాన్సర్ వంటి రోగాలు పెరిగిపోతున్నాయి. ఆవుల సంఖ్య తగ్గిపోవడం వ్యవసాయ సంక్షోభానికి కారణమవుతోంది.సేంద్రియ ఎరువులు లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయి.దేవాలయాల భూములు, గోచర భూములను కబ్జా చేసిన భూబకాసురులు బీఆర్ఎస్ లో జమయ్యారు.

గ్రామీణ వ్యవసాయ వ్యవస్థలో దేశీ ఆవుల వినియోగించుకునేలా వ్యవసాయాన్ని పునరుద్ధరించేలా బిజెపి మేనిఫెస్టో రూపొందించింది. గ్రామీణ వ్యవసాయ వ్యవస్థను పునరుద్ధరింపజేసేందుకు ఆవులను రైతులకు అందించేలా ప్రణాళిక రూపొందించింది భారతీయ జనతా పార్టీ.వ్యవసాయం విషయంలో సమగ్రంగా ఆలోచించి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఇవన్నీ విషయాలను రైతులకు అర్థమయ్యేలా ఇంటింటికి తీసుకెళ్తాం.

రైతుల సాయం కోసం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామంటోంది బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది రూ. 12 వేలు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పథకంతో పాటు రూ. 22 వేలు రైతులకు అదనంగా అందిస్తోంది. తెలంగాణ రైతులకు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది భద్రతా కవచం.ఇతర పార్టీల్లో ఇంత నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఇంతవరకు ఆలోచించలేదు. రైతులకు మోదీ ఇచ్చే గ్యారంటీ ఇది.

నిజాం దోపిడీ కారణంగా, ఫ్యూడలిజం, ఉర్ధూ కారణంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి 1948 ముందువరకు జరగలేదు. 1948 నుంచి 1956 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ప్రజలకు దగా, దోపిడీనే జరిగింది. 1956లో తెలంగాణ సేఫ్ గార్డ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కాని, అగ్రిమెంటును కాంగ్రెస్ మొదటి నుంచి ఉల్లంఘించి కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. ఆదినుంచి తెలంగాణకు ద్రోహం చేసి, తెలంగాణ ఉనికిని మాయమయ్యేలా చేయడానికి కుట్రపూరిత ప్రభుత్వాన్ని నడిపింది కాంగ్రెస్.

1967లో సేఫ్ గార్డును ఉల్లంఘిస్తున్నారని, ఇది ఘోర అపరాధమని, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని తీర్మానం చేసింది భారతీయ జనసంఘ్ పార్టీ. 1969లో తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్శిటీలో జన్మనిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిస్తున్న కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 369 మందిని కాల్చిచంపింది. అనేకమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమైంది.

తెలంగాణ ప్రజాసమితి 1971లో చారిత్రాత్మక విజయం సాధిస్తే.. ఆ నాయకులను కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని తెలంగాణకు ఏమియ్యకుండా ఉద్యమాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిన తర్వాత.. రజాకర్ల హెడ్ క్వార్టర్స్ దారుస్సలాంకు తాళం వేశారు. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నారు. అలాంటి ప్రజల ఆస్తి అయిన దారుస్సలాంను తెలంగాణను మోసం చేయడం కోసం, తెలంగాణ పౌరుషాన్ని, ఆత్మ ఉనికిని అణచివేయడం కోసం తిరిగి ఎంఐఎంకు బహుమతిగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వమే.

తెలంగాణ ప్రజలకు చెందాల్సిన ఆస్తిని మతతత్వ పార్టీకి అప్పజెప్పింది కాంగ్రెస్ కాదా..?. 2009 డిసెంబరు 9న సోనియమ్మ జన్మదినం రోజున చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించి.. వెనక్కి తీసుకోవడం వల్ల తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకున్నారు.1200 మంది యువతీయువకులు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణం. 70 సంవత్సరాలుగా తెలంగాణ భాష, ఉనికి, ఆత్మగౌరవానికి అన్యాయం చేసి, హత్య చేసి తెలంగాణ యువకుల ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.

దేశ విభజన తర్వాత కాసిం రజ్వీకి ఇక్కడ స్థానం ఉండకూడదు. కాని, అధికారం, ఆఫీసు, ప్రభుత్వం అండ, భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. ఇది తెలంగాణ వ్యతిరేక చర్య కాదా…? ప్రజల ఆత్మహత్యలకు కారణమై, చేసిన తప్పులకు గాను సోనియమ్మ ఏనాడైనా తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు సాష్టాంగ నమస్కారం చేశారా?రాహుల్ గాంధీ అమరవీరుల స్థూపం దగ్గర చేసిన తప్పులను క్షమించాలని చెంపలు వేసుకున్నారా..?

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఎలా మర్చిపోతరు.?తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. కాంగ్రెస్,ఎంఐఎం పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తే.. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను లూఠీ చేసింది. తెలంగాణకు నిజాం ఎంత ద్రోహం చేసిండో.. కాంగ్రెస్ నాయకత్వం కూడా అంతే ద్రోహం చేసింది.ఈరోజు బీఆర్ఎస్ పార్టీ.. ప్రజాస్వామ్యాన్ని , ప్రజల తీర్పును దొంగలించేందుకు కుట్ర పన్నుతోంది. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే..

బీఆర్ఎస్ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం ద్వారా ప్రజాతీర్పును దొంగలించవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ లో సుమారుగా 21 మంది అభ్యర్థులకు బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తోంది. 21 నియోజకవర్గాల్లో మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ ఆఫీసులోనే జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం.

అంబాసిడర్ కారు అవుట్ డేటెడ్ అయిపోయింది. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తప్పులను ఎదిరించే సత్తా ఉంది భారతీయ జనతా పార్టీకే. అందుకే,.. బీఆర్ఎస్,కాంగ్రెస్, ఎంఐఎం .. బిజెపి ని ఓడించాలని కుట్ర చేస్తున్నాయి.

LEAVE A RESPONSE