14 మంది శిశువులు చనిపోతే మీరు హ్యాపీగా ఎలా తినగలుగుతున్నారు జగన్ రెడ్డి గారూ? ?

– ట్విట్టర్ లో టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు…

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వారంలో 14 మంది శిశువులు చనిపోతే మీరు హ్యాపీగా ఎలా తినగలుగుతున్నారు? ఎలా నిద్రపోతున్నారు జగన్ రెడ్డి గారూ? వైసిపి చెత్త పాలనలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసారు. కేటాయింపులు, పర్యవేక్షణ లేక ప్రభుత్వాసుపత్రుల్లో మరణఘోష కొనసాగుతూనే ఉంది.

పురిట్లోనే బిడ్డను కోల్పోయిన చెల్లెమ్మలకు ఎం సమాధానం చెబుతారు. ఎప్పటి లాగే మూర్ఖత్వంతో అవన్నీ సహజ మరణాలే అని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తే ఈ పాపం ఊరికే పోదు. రుయాలో శిశు మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. మందులు, డాక్టర్లు కూడా అందుబాటులో లేరంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతుంది. ఈ ఘటన పై విచారణ జరిపి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.