5 సంవత్సరాల వినాశనం తరవాత కూడానా ?
రాష్ట్ర భవిష్యత్తుపై తమ పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలియని అజ్ఞానమా?
తాము ఓటు వేసి ఎన్నుకొనే వాళ్ళకు మంచి సంస్కారం అవసరం లేదనే అభిప్రాయమా?
అధికారం కోసం ఇంట్లో వాళ్ళను హత్యలు చేసినా తప్పులేదనే ఉద్దేశ్యమా?
తమ స్వంత సంపాదన కోసం రాష్ట్రాన్ని చిందర వందర చేసినా నాకేం నష్టం అనే ఆలోచనా?
విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి వలన భావితరాలు నాశనం అవుతున్నాయంటే, నా పిల్లలు ఇక్కడ లేరుగా అనే నిర్లక్ష్యమా?
జగన్ అభిమానులూ…ఆలోచించండి
గంజాయితో నాశనం అయిన పిల్లల్లో మన పిల్లలు ఉంటే ఆ బాధ మనకు తెలిసేది…
కనబడకుండా పోయిన ఆడపిల్లల్లో మన ఇంటి అమ్మాయి ఉంటే ఆ క్షోభ మనకు అర్ధం అయేది.
ఆక్రమణకు గురి అయిన ఆస్థుల్లో మన ఆస్థి ఉంటే ఆ నిస్సహాయత మనకు అవగాహన అయ్యేది.
రౌడీయిజం వలన చనిపోయిన వ్యక్తుల్లో మన కుటుంబ సభ్యులుంటే ఆ కడుపు మంట మనకు తెలిసి వచ్చేది.
కుసంస్కారంతో జగన్ బృందం చేసిన చెత్త వ్యాఖ్యలు మన అమ్మనో, భార్యనో, చెల్లినో అని ఉంటే ఆ వేదన మనకు అర్ధమయ్యేది…
ఓటు వేసే ముందు కొంచం మనసుతో ఆలోచించండి. మనకున్న రాజకీయ విబేధాల కంటే రాష్ట్రం ప్రగతి, పిల్లల భవిష్యత్తు ముఖ్యమని అర్ధం చేసుకోండి..
కని పెంచిన తల్లి కూడా సమర్ధించని వ్యక్తి
అసలు స్వరూపం అర్ధం చేసుకోటానికి ప్రయత్నించండి
– ఆర్ ఆర్