Suryaa.co.in

Andhra Pradesh

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు కోర్టు నిర్వహించిన హెచ్ఆర్‌సీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) ఛైర్మ‌న్ జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పుగోదావరిజిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు కోర్టు నిర్వహించారు.

మొదటి రోజు బుధవారం 27 కేసులకు గాను 14 కేసులు పరిష్కరించడం జరిగింది. మిగిలిన 13 కేసులు తదుపరి విచారణ నిమిత్తం వాయిదా వేయడం3 జరిగింది.రెండవ రోజు గురువారం 23 కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుధారులు తమ వాదనలు వినిపించగా 14 కేసులు తుది ఉత్తర్వులు వెలువరించగా, 9 కేసులు తదుపరివిచారణ నిమిత్తం వాయిదా వేయడం జరిగిందన్నారు.

మూడవ రోజు 14 కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుధారులు తమ వాదనలు వినిపించగా 11 కేసులలో తుది ఉత్తర్వులు వెలువరించగా, 3 కేసులు తదుపరివిచారణ నిమిత్తం వాయిదా2 వేయడం జరిగిందన్నారు. ఈ మూడు రోజుల్లో రెవెన్యూ, పోలీసు, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బీ, విద్యుత్ , విద్య తదితర శాఖలకు చెందిన మొత్తం 64 కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుదారులు తమ వాదనలు వినిపించారు.

జిల్లాలో ప్రజల వద్దకే వచ్చి ఎంతో సానుకూలంగా వారి సమస్యలు విని, అధికారులలో అవగాహన పెంచడం లో కమిషన్ వారు సహృ దయంతో సూచనలు చేసినందున జిల్లా కలెక్టర్ తరపున ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి
4 ధన్యవాదాలు తెలియ చేశారు. కమిషన్ కూడా జిల్లా యంత్రాంగం కోర్టు క్యాంపు నిర్వహించడం మంచి తోడ్పాటు అందించడం జరిగిందని పేర్కొన్నారు. క్యాంపు కోర్టుకు హాజరైన వారిలో కమిషన్ కార్యదర్శి/సిఈఓ సంపర వెంకట రమణ మూర్తి, క్యాంపు కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్, పీఆర్వో కె. రవి కుమార్, కమీషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE