Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి నెం.1 నినాదానికి అనూహ్య స్పందన

-అభ్యర్థులను మార్చినా ఆగని వలసలు
-లోకేష్ సమక్షంలో 150 కుటుంబాలు టిడిపిలో చేరిక

అమరావతి: రెండు నెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపినాయకుల వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గంలో భారీస్పందన లభిస్తోంది. వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు కూడా పెద్దఎత్తున టిడిపిలో చేరుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన వైసిపి నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసిపి కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో పార్టీలో కొత్తగా చేరిన వారిని లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లి పట్టణానికి చెందిన నాయకులు ఎస్.రామశంకర్, బి.రవికుమార్ తో సహా 20 మంది, ఉండవల్లి గ్రామానికి చెందిన శింగంశెట్టి తేజోధర్, ఉప్పు సుబ్బారావు(నాని)తో సహా 20 మంది టిడిపిలో చేరారు.

అదేవిధంగా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం నుంచి అనంత్ నెమలికంటితో సహా నలుగురు నాయకులు, శ్రీ
కృష్ణ లెనిన్, గుమ్మడి గోపి, వలపర్ల రామారావు, కనపర్తి హరి , మల్లవరపు మాణిక్యాల రావు, ఆరుమల్ల సుబ్బారావు తో పాటు 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

కుంచనపల్లి గ్రామానికి చెందిన బోయిన బన్ను, గంగోలు పనుష్ బాబు, బిరుడుగడ్డ లక్కీ, కాలే కనకరాజుతో పాటు 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికి యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE