హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండిపోవడంతో మూసీ
లోకి నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు. అయితే పూర్తి స్థాయిలో వరద నీరు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా మూడు రోజులు తెలంగాణలో వర్షాలు ఉన్నందున హుస్సేన్ సాగర్ కు వరద వచ్చే అవకాశం ఉందని భావించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నాళాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది.