Suryaa.co.in

Telangana

నోవార్టిస్ రెండవ అతిపెద్ద కార్యాలయంగా మారిన హైదరాబాద్ నగరం

హైదరాబాద్ లోని తమ కార్యాలయం తన రెండవ అతిపెద్ద కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ప్రకటించింది. ఈ మేరకు దావోస్లో మంత్రి కే తారకరామారావు తో నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నోవార్టిస్ కంపెనీ విస్తరణ ప్రణాళికలు పైన చర్చించారు. ఇప్పటికే తమ కంపెనీ అనేక దేశాల్లో తయారీ యూనిట్లతో పాటు, ఇతర పరిశోధన కేంద్రాలను కలిగి ఉన్నదని తెలిపిన వాస్ నరసింహన్, హైదరాబాద్లో తమ కార్యాలయం ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని తెలిపారు.

భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీలకెల్లా తన నోవార్టిస్ క్యాపబిలిటీ సెంటర్ అతి పెద్దది అని తెలిపారు. స్విట్జర్లాండ్లోని బాసెల్ లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9000 మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం తన రెండవ అతి పెద్ద కార్యాలయంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మరియు డిజిటల్ కార్యక్రమాలకు ఏషియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు.

నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్తో సమావేశం ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కంపెనీ వృద్ధి పైన అభినందనలు తెలిపారు. నోవార్టిస్ తన కేంద్ర కార్యాలయానికి అవతల అతిపెద్ద కార్యక్షేత్రంగా హైదరాబాద్ మారడం అత్యంత సంతోషదాయకం అన్నారు. హైదరాబాద్ నగరంలో నోవార్టిస్ విస్తరణ వలన తెలంగాణ లైఫ్ సైన్స్ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.

నోవార్టిస్ వలన ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్ర శ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్య స్థానంగా మారిందని, హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీగా విస్తరించిన నోవార్టిస్ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE