– ఓనం వేడుకల్లో తెలంగాణ మంత్రి సీతక్క
హైదరాబాద్ నగరం ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటుందని, అందుకే వివిధ రాష్ర్టాలకు,ప్రాంతాలకు చెందినవారు ఇక్కడికి రావడానికి ఇష్టపడటమే కాక, వారి సొంత ప్రాంతంగా భావిస్తారని తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
శేరిలింగంపల్లి,నల్లగండ్ల మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 20 గెటెడ్ కమ్యూనిటీలకు చెందిన దాదాపు 800లకుపైగా ఉన్న మళయాలీ కుటుంబాలు నల్లగండ్లలోని ఎపిస్టెమో విధ్యాసంస్ధలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీక్కతోపాటు ప్రత్యేక అతిధిగా అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుత రావు బొప్పన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ నగరం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి సంప్రదాయాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారన్నారు. ప్రభుత్వం సైతం ఎలాంటి తారతమ్యాలకు తావివ్వకుండా, ప్రతి ఒక్కరిని కడుపున పెట్టుకొని చూసుకుటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరానికి భారీ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి,తమ వ్యాపారాలను విస్తరించడానికి ముందుకొస్తున్నాయన్నారు.
బొప్పన అచ్యుతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ వచ్చినా అందరూ కలసి కట్టుగా చేసుకుంటారని, ఒక కుటుంబంలా వ్యవహరిస్తారన్నారు. ఇలాంటి అద్భుతమైన వేడుకలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరి అదరాభిమానాలతో హైదరాబాద్, విశాఖపట్నం, దుబాయ్, అమెరికాలలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని వివరించారు. గత 20 సంవత్శరాలుగా దుబాయ్ ప్రస్థానం నుండి తమ సంస్థతో మలయాళీ కుటుంబాలకు ఉన్న అనుబంధం ప్రత్యేక మైనదన్నారు.
వేడుకలో బాగంగా పుష్పాలంకరణ, గోషయాత్ర, కేరళ క్రీడలతో కూడిన ఓనంకలి,అరిటాకులతో నిర్వహించే సద్య, మళయాలీల సంస్కృతిక నృత్యమైన కథాకళి తదితర కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. కార్యక్రమంలో అన్వితా గ్రూపు డైరెక్టర్ నాగభూషణం బొప్పన తదితరులు పాల్గొన్నారు.