Home » ఇక హైదరాబాద్ మనదే

ఇక హైదరాబాద్ మనదే

( వెంకట్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి ఈ రోజు తెర పడింది.. తెలంగాణ, ఏపీగా ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది..

ఈ గడువు ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది.. విభజన చట్టం లోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు.

ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015 లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు.

2019 లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెర పైకి తెచ్చినప్పటికీ, రాజధాని పలానా అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది.

Leave a Reply