– నాకు ఎవరి గుర్తింపు అవసరం లేదు
– బడుగులకు రాజకీయ ప్రాధాన్యత దక్కొద్దా?
– బిసి సబ్ ప్లాన్ మీ చేతుల్లోనే ఉంది.
– బడ్జెట్ లో 20 వేల కోట్ల కేటాయింపు మీ పరిధిలోనే ఉంది కదా?
– పార్లమెంట్ లో ప్రయివేట్ బిల్లు ను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు?
– బిసి పద్దుపై చర్చలో బీ ఆర్ ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: బిసి బిల్లు కు చట్టబద్దత కోసం ఆల్ పార్టీ ప్రతినిధులను ఢిల్లీ తీసుకెళ్తాము అన్నారు. జనాభాలో BC, SC, ST వర్గాలు 85 శాతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తామన్న హామీ ఏమైంది?
కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లలో 45 వేల కోట్లు ఖర్చు చేశాము. రాజ్యసభ కు ఇద్దరు బిసి బిడ్డలను ఎంపిక చేశారు. రెండు రాష్ట్రాలకు నేనే ఒక బ్రాండ్. నాకు ఎవరి గుర్తింపు అవసరం లేదు. గురుకుల స్కూల్స్, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు..కామారెడ్డి డిక్లరేషన్ లో బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు.
జనరల్ స్థానాలలో బిసి లు అత్యధికంగా గెలిచారు. జనాభాలో బిసి ల జనాభా 56 శాతం. నమ్మించి మోసం చేయకండి. ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 42 శాతం రిజర్వేషన్ హామీ బిజెపి ఇవ్వలేదు…ఇచ్చిన హామీ అమలు బాధ్యత కాంగ్రెస్ పై ఉంది.
ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేస్తే అగ్రనాయకత్వం హాజరు కాలేదు. అమలుకు సాధ్యం కాని హామీలను ఓట్ల కోసం, ప్రజలను మోసం చేయడం కోసమేనా? 42 శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే…
బిసి సబ్ ప్లాన్ మీ చేతుల్లోనే ఉంది. బడ్జెట్ లో 20 వేల కోట్ల కేటాయింపు మీ పరిధిలోనే ఉంది కదా
అంబేద్కర్ కల్పించిన హక్కుల కోసం పోరాడతాం. బడుగులకు రాజకీయ ప్రాధాన్యత దక్కొద్దా? కులగణన పారదర్శకంగా జరపలేదు. భూసాని కమిషన్ రిపోర్ట్ నేటి వరకు పబ్లిక్ డొమెన్ లో పెట్టలేదు. బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చులకు పొంతనలేదు. ఇది అంకెల గారడీ కాదా? కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి.
విదేశాలలో ఉన్నత విద్యకు ఒకొక్కరికి 20 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం ఇచ్చాము.. ఫీజు రీఅంబర్స్ మెంట్ చెల్లించలేదు.ఓవర్ సీస్ ఆర్ధిక సహాయం ఇవ్వలేదు. ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయించాం. పార్లమెంట్ లో ప్రయివేట్ బిల్లు ను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు?
మమ్మల్ని రిజర్వేషన్లు అడిగే రోజు వస్తుంది.చరిత్రలో అనేక అనుభవాలు చూసినం. బడుగుల పిల్లలు విద్యా వంతులు అయ్యారు. అన్ని గమనిస్తున్నారు. ప్రధాన వ్యవస్థలలో బిసి ఉద్యోగులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఎంతో చారిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా యాదవ్ ను కేసీఆర్ నియమించారు..