– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులందరితో పాటు ప్రతి నాయకుడు, కార్యకర్తలంతా భగభగమండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఎంతో కష్టపడి ప్రజల ఆశీస్సుల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారు.
అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసిన అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన 8 మంది శాసనసభ సభ్యులు, 8 మంది పార్లమెంటు సభ్యుల తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నాను.
నేడు భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు.. 8 మంది ఎంపీలు ఉన్నాం.వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 శాసనసభ్యులతో తెలంగాణ గడ్డపై బిజెపి జెండా ఎగురవేయడం ఖాయం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ జెండా చేతబూని, గ్రామగ్రామన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.