Suryaa.co.in

Andhra Pradesh

డీఎన్ఏ టెస్ట్ కు నేను సిద్ధం.. విజయసాయిరెడ్డి సిద్ధమా?

-డీఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో నిరూపించాలి
-విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే
-విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు.. ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది
-శాంతితో నేను విడాకులు తీసుకోలేదు
-ప్రతినెలా పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నా
-శాంతికి పుట్టిన మగబిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడు
– ఎండోమెంట్ ఏసి శాంతి భర్త మదన్

హైద‌రాబాద్‌: 2013లో శాంతిని నేను పెళ్లి చేసుకున్నా. 2020లో దేవాదాయశాఖలో శాంతికి ఉద్యోగం వచ్చింది. శాంతికి ఉద్యోగం వచ్చాక.. పీహెచ్‌డీ కోసం నేను అమెరికా వెళ్లా. నా భార్య శాంతి ప్రవర్తన విచిత్రంగా ఉండేది. తీరు మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చరించా.

విజయసాయిరెడ్డిని శాంతి నాకు పరిచయం చేసింది. విజయసాయిరెడ్డికి ల్యాండ్ విషయంలో హెల్ప్ చేశానని శాంతి చెప్పింది. రూ.4 కోట్లతో విజయవాడలో విల్లా కొనాలని శాంతి అన్నది.విల్లా కొనేందుకు విజయసాయిరెడ్డి డబ్బులు ఇచ్చారు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. విజయసాయిరెడ్డిని నేను చాలా నమ్మాను.

నేను అమెరికా వెళ్లాక.. శాంతి గర్భం దాల్చింది. ఎలా అయ్యావు అని అడిగితే చెప్పుతో కొడతా అని తిట్టింది. గట్టిగా అడిగితే విజయసాయిరెడ్డి పేరు చెప్పింది. విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు.. అందుకే ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది. ఐవీఎఫ్.. ఫిజికల్ గా కలిసి బేబిని కన్నారో తెలియదు. ఈ విషయం తెలిశాక గుండెలు పగిలేలా ఏడ్చాను. విజయసాయిరెడ్డితో బిడ్డను కన్నానని శాంతి చెప్పింది.

3 నెలల నుంచి నన్ను శాంతి టార్చర్ చేస్తోంది. శాంతితో నేను విడాకులు తీసుకోలేదు. 2016లో శాంతికి నేను విడాకులు ఇవ్వలేదు. 2024 జూన్ 11న విడాకులు డాక్యుమెంట్ పై సంతకం పెట్టా. 2020 వరకు శాంతితో నేను కలిసే ఉన్నా. ప్రతినెలా పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నా.

సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని శాంతి పెళ్లి చేసుకోలేదు. శాంతికి పుట్టిన మగబిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడు. పుట్టిన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయాలి. డీఎన్ఏ టెస్ట్ కు నేను సిద్ధం.. విజయసాయిరెడ్డి సిద్ధమా? డీఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో నిరూపించాలి. విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే. ఆయన కాదని తేలితే మీడియా సాక్షిగా క్షమాపణ చెబుతా.

LEAVE A RESPONSE