Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు మానసిక ఒత్తి‘ఢీ’

-ఓటమితో మానసిక ఒత్తిడిలో జగన్
-అయినా తీరు మారలేదు…ఆతని మాట మారలేదు
-ఒక ప్యాలెస్ నుంచి ..మరో పెద్ద ప్యాలెస్ కు జగన్ పయనం
-ఓటమిని జీర్ణించుకోలేని జగన్….నాయకులను, కార్యకర్తలను కలవడానికి అయిష్టత
-మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్ కు
-నిలిచిపోయిన అక్రమ సంపాదన…బయటపడుతున్న వేల కోట్ల అక్రమాలు
-జగన్ విధ్వంస, దోపిడీ పాలనపై ఎన్నికల అనంతరం కూడా ప్రజల్లో తీవ్ర చర్చ
-దీంతో తీవ్రమైన మానసిన రుగ్మతతో రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీకి దూరంగా వైఎస్ జగన్
-అసెంబ్లీకి ఎగ్గొట్టి బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో నే ఉండే ఆలోచనలో జగన్
-ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసేలా ఎప్పటిలా ఫేక్ పాలిటిక్స్ చేస్తున్న జగన్
( ఏ.బాబు)

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ బెంగుళూరు ప్యాలెస్ కు వెళుతున్నారు. తండ్రి సీఎంగా ఉన్న సమయంలో.. 23 ఎకరాల్లో అత్యంత విలాసవంతంగా బెంగుళూరులోని యలహంకలో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత, జగన్ 15 రోజుల క్రితం యలహంక ప్యాలెస్ కు వెళ్లాడు. అక్కడే కొద్ది రోజులు గడిపాడు.
ఘోర ఓటమిని జీర్ణించుకోలేని జగన్…తాడేపల్లిలో…ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఆయన మళ్లీ బెంగుళూరు పయనం అయ్యారని తెలుస్తోంది.

వాస్తవంగా చూస్తే జగన్ రెండు సార్లు పులివెందుల వెళ్లా రు. అయితే అక్కడ పరిస్థితి తీవ్ర వ్యతిరేకంగా ఉండడంతో అక్కడికి వెళ్లడం వల్ల ప్రశాంతత దొరక్కపోగా…తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, తమను ఆదుకోవాలని పులివెందుల పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

దీంతో పాలుపోని జగన్ వారికి సమాధానం చెప్పలేక పులివెందుల వెళ్లాలి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చూస్తే జగన్ కు పులివెందులలో మెజారిటీ తగ్గింది. పార్టీ క్యాడర్ లో నమ్మకం సడలింది. అయితే దాన్ని సరిద్దుకోవాల్సిన జగన్….దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఆయన మానసిక ఒత్తిడే అని పార్టీ నేతలు చెబుతున్నారు.

జగన్ ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడని…పార్టీ నేతలు, కార్యకర్తలకు మొహం చూపించడానికి ఆయన ఇష్టపడడం లేదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పుడు పరదాలు, బారికేడ్ల మధ్య జనంలోకి వెళ్లే ఆలోచననే ఆయన ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గన్నవరం ఎయిర్ పోర్టులో వచ్చిన కార్యకర్తలు, నేతలను కూడా అయిష్టంగా కలిశారని పార్టీ నేతలు చెపుతున్నారు. తాడేపల్లిలో ఉంటే పార్టీ నేతలను కలవాల్సి ఉంటుందని, వారి సమస్యలు వినాల్సి ఉంటుందని సిఎం ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

ప్రభుత్వం పోయిన తర్వాత జగన్ రోజువారీ, నెలవారీ ఆదాయం పోయింది. మరోవైపు నాడు చేసిన భూ దోపిడీలు, అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రజలు కూడా గత ప్రభుత్వ అక్రమాలపై చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వైట్ పేపర్స్ ప్రజలకు వాస్తవాలను చాటి చెబుతున్నాయి. ఈ కారణాలతో జగన్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తోంది. ఓటమి తరువాత జగన్ పర్యటనలను మనం పరిశీలిస్తే…..పులివెందుల, నెల్లూరు జైలు, బెంగుళూరు ప్యాలెస్ కు మాత్రమే వెళ్లారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలవడానికి ఆయన ఇష్ట పడలేదు. జగన్ జనాన్ని కలవడానికి ఎంత అయిష్టంగా ఉన్నారు.

అంటే…..మాజీ సిఎం ప్రజా దర్బార్ చేపట్టే ఆలోచన అని మీడియాలో వార్త రాస్తేనే, మాజీ మంత్రులు వచ్చి ఖండించారు. ఇదీ ప్రస్తుతం జగన్ మానసిక స్థితి. ఓటమిని జీర్ణించుకోలేక…. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను అంగీకరించలేక, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పటికీ మాజీ మంత్రులు నేతలతో నెల రోజుల ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయిస్తున్నా రు. అయితే ఆ ఫేక్ ప్రచారాలను ప్రజలు పెద్దగా నమ్మడం లేదు.

అయినా జగన్ తన ఫేక్ పాలిటిక్స్ తోనే ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేను హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నాను అని జగన్ అన్నారు. అంటే…ఆయన ఎంత ఒత్తిడికి, అసహనానికి, అంశాంతికి లోనవుతున్నాడో అర్థం అవుతుంది.

ఈ పరిణామాలతో జగన్ ఇక్కడ ఉండడం ఇష్టంలేక బెంగుళూరు వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా జగన్ అక్కడే ఉంటారని….ఈవెంట్లకు, అప్పుడుప్పుడు చేపట్టే పార్టీ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతారని జగన్ కు సన్నిహితంగా ఉన్న వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా ఒక ప్యాలెస్ నుంచి ..మరో పెద్ద ప్యాలెస్ కు జగన్ పయనం అవుతున్నారు. ఇక బైబై ఏపీ అంటున్నారు.

LEAVE A RESPONSE