Suryaa.co.in

National

రాజ్యసభలో ‘పువ్వు’కు ’ఫ్యాను’గాలి కావల్సిందే

( వాసు)

న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101 కి పడిపోయింది. అలానే మరోవైపు సొంతంగా బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఇప్పుడు ఇండియా కూటమి బలం 87కి చేరింది. రాజ్యసభలో మొత్తం 225 సీట్లు ఉండగా ఈ క్రమంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 113 సంఖ్యా బలం ఉండాలి.

దీంతో రాజ్యసభ మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయే ఎంపీల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ క్రమంలో అధికార ఎన్డీయే కూటమి రాజ్యసభలో బిల్లులను ఆమోదం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్న వైసీపీ సహాయం, 4 స్థానాలు అన్నాడీఎంకే పార్టీ సహాయం ఎన్టీఏ కూటమి సర్కార్ కు అవసరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

LEAVE A RESPONSE