– అలా మాట్లాడటానికి వైసీపీఎంపీలకు సిగ్గు, శరం, లజ్జ లేవా?
– ప్రజలు మీకు అధికారమిచ్చింది తెలుగుభాషను అశ్లీలభాషగా, బూతులమయంగా మార్చడానికి, తోటిఎంపీని పార్లమెంట్ లో బూతులు తిట్టించడానికి, శాసనసభను అభినవకౌరవసభగా మార్చడానికి కాదు జగన్మోహన్ రెడ్డి
-జున్నుముక్కకన్నా, చెరకుగడకన్నా, పంచదారకన్నా, పనసతొనలకన్నా తీయనైన తెలుగును ఈ ముఖ్మమంత్రి, మంత్రులు, వైకాపాఎంపీల అశ్లీలభాషగా మార్చారు
– ఆనాటి కౌరవసభలో దుష్టచతుష్టయమైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి, ధృతరాష్ట్రుడికొలువులో మహిళను పరాభవించి పతనమయ్యారు.
– ఈనాటి కౌరవసభలాంటి శాసనసభలో సభలోలేని మహిళను అశ్లీలపదజాలంతో దూషించిన “దుష్టచతుష్టయం” లో దుర్యోధనుడిగా వ్యవహరించిన సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి వెకిలినవ్వులు నవ్వాడు.
– ఆయనకు వంతపాడుతూ దుశ్శాసనుడిగా అంబటి రాంబాబు, కర్ణుడిగా ద్వారంపూడి, శకునిగా వల్లభనేని వంశీ కలిసి శాసనసభను కౌరవసభగా మార్చి, సభా గౌరవాన్ని,ప్రతిష్టను దిగజార్చారు.
– అదేవిధమైన దుష్టసంప్రదాయాన్ని, అసభ్యపదజాలాన్ని పార్లమెంట్ లోకూడా వాడి, తెలుగుభాష ప్రాభవాన్ని వైసీపీఎంపీలు కించపరుస్తారా?
– సాక్షాత్తూ పార్లమెంట్ లో తోటిసభ్యుడినే అసభ్యపదజాలంతో తిట్టిన వైకాపా సభ్యులపై స్పీకర్ కఠినచర్యలు తీసుకోవాలి.
– టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి వర్ల రామయ్య
పద్మశ్రీ అవార్డ్ తీసుకోవడానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారితోకలిసి ఢిల్లీ వెళ్లినప్పుడు, పీవీ.నరసింహారావు గారు వారిద్దరిని తెలుగులో మహానటులమ్మా అంటూ అప్పటి ప్రధాని ఇందిరిగాంధీగారికి పరిచయంచేశారని, ఆ సందర్భంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఎన్టీఆర్ , ఏఎన్నార్ లను ఉద్దేశించి మీరు మద్రాసీయులు నాకుతెలుసన్నప్పుడు, ఎన్టీఆర్ గారు వెంటనే మేం మద్రాసీయులంకాదు.. తెలుగువాళ్లమని, తమది తెలుగుదేశమని (ఆంధ్రప్రదేశ్ అని) ఆమె ముఖంమీదే చెప్పేశారని, ఎన్టీఆర్ గారు అలా అనేసరికి, ఆమె వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారని, ఆనాటినుంచీ మేం మద్రాసీయులంకాదు.. తెలుగువారమని నినదించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“తెలుగువాడి ఖ్యాతి, తెలుగుభాషప్రాభవం దశదిశలా వ్యాపింపచేసిన మహానుభావుడు స్వర్గీయ రామారావు గారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి, అంబటి రాంబాబుకి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, బూతులమంత్రికి, అపరమేథావైన వంశీకి తెలియదని కాదు. అంతటి గొప్ప భాష అయిన తెలుగు, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్రదిష్టపాలవుతోంది. తెలుగుభాష అంటే బూతులమయమని, అశ్లీలభాషతో కూడుకున్నదని, అసభ్యపదజాలంతో నిండినది అని చెప్పుకునే దుర్గతిని వైసీపీనేతలు పట్టించారు. అదే నా బాధంతా?
జున్నుముక్కకన్నా, చెరకుగడకన్నా, పంచదార, పనసతొనలకన్నా తీయనైన భాషగా ఖ్యాతిగాంచిన తెలుగుభాషను ఈ ముఖ్మమంత్రి, మంత్రులు బూతులభాషగా మార్చారు. మొన్నటికి మొన్న రాష్ట్రశాసనసభలో ఏంజరిగింది? ఈనాటి అభినవ కౌరవసభలో మహిళకు అవమానం జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి అనే అపరదుర్యోధనుడు వెకిలినవ్వునవ్వాడు. చివరకు ఈ ముఖ్యమంత్రి చర్యలు, చేష్టలతో రాష్ట్రంలో గౌరవసభలు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.
ఆనాటి కౌరవసభలో దుష్టచతుష్టయంగా పేరుపొందిన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి, ధృతరాష్ట్రుడికొలువులో మహిళను పరాభవించి పతనమయ్యారు. ఈనాటి కౌరవసభలాంటి మనఅభినవశాసనసభలో సభలోలేని మహిళను అశ్లీలపదజాలంతో దూషించిన “దుష్టచతుష్టయం” లో దుర్యోధనుడిగా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి, అభినవ దుశ్శాసనుడిగా అంబటి రాంబాబు, అభినవకర్ణుడిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శకునిగా వల్లభనేని వంశీ కలిసి శాసనసభను కౌరవసభగామార్చి, సభా గౌరవాన్ని,ప్రతిష్టను దిగజార్చారు.
ఈనాటి అభినవకౌరవసభలో ధృతరాష్ట్రుడిలా గౌరవస్పీకర్ ప్రవర్తించారు. మిగిలిన 100మంది ఆనాటి సభలో కళ్లప్పగించి చూసినట్టే, ఈనాటి కౌరవసభలోని మిగిలిన వైకాపాసభ్యులైన 100మందికి పైగా సభ్యులు మహిళకు అవమానంజరుగుతుంటే గుడ్లప్ప గించి చూశారు గానీ, ఏమిటిదని ఎవరూ నోరెత్తలేదు. ఆనాటి సభలో దుర్యోధనుడు వికటాట్ట హాసం చేస్తే, ఈనాటి అభినవ కౌరవసభలో అభినవ దుర్యోధనుడైన జగన్మోహన్ రెడ్డి వెకిలినవ్వులు నవ్వాడు. ఇది ఏస్థాయికి వెళ్లిందంటే, చివరకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంపార్టీ గౌరవసభలు నిర్వహించేవరకు.
అదేవిధమైన దుష్టసంప్రదాయాన్ని, అసభ్యపదజాలాన్ని, అశ్లీలపదప్రయోగాన్నిచివరకు పార్లమెంట్ లోకూడావాడి, తెలుగుభాష ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని కించపరుస్తారా? మీ దుంపలు తెగ..ఏమనాలిమిమ్మల్ని.. మీ పార్టీని? దుష్టసంప్రదాయం, అసభ్యపదజాల ప్రయోగాన్ని పార్లమెంట్ కూడా తీసుకెళ్లారు.. ఈ ప్రబుద్దులు, సిగ్గుమాలిన చర్యలకు వైస్సార్ పార్టీ ప్రతీకగా మారింది.
జగన్మోహన్ రెడ్డిని విబేధించి, ఆయన అవినీతి, ఆయనపై ఉన్నకేసుల గురించి రఘురామ కృష్ణంరాజు దేశానికి తెలిసొచ్చేలా మాట్లాడుతున్నంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గతచరిత్రగురించి, ఇప్పుడచేస్తున్న తప్పులగురించి ఢిల్లీ పురవీధుల్లో నినదిస్తున్నాడని ఆఎంపీని పార్లమెంట్ లో ఇష్టానుసారం బూతులు తిడతారా? రఘురామరాజుని వైసీపీఎంపీలు పార్లమెంట్ లో బూతులు తిడుతుంటే, అన్యభాషల ఎంపీలు లం… క్యాహై… కొడుకు క్యాహై… క్యాబోల్తా హై అంటూ నోరెళ్లబెట్టి అవాక్కయ్యారు. అలా మాట్లాడటానికి వైసీపీఎంపీలకు సిగ్గు, శరం, లజ్జ లేవా? అంత నిర్లజ్జగా మాట్లాడతారా? సిగ్గుంటే వారు తక్షణమే ఎంపీపదవులకు రాజీనామాలుచేయాలి. వారికి ఎంపీలుగా కొనసాగే అర్హతలేదు. వైసీపీ అధ్యక్షులై న జగన్మోహన్ రెడ్డి, తెలుగుభాష పరువుని చంచల్ గూడ జైల్ బ్యాచ్ సాయంతో దేశస్థాయిలో ఈ విధంగా మంటగలపడం సబబేనా? శాసనసభలో ఉపయోగించిన అశ్లీలభాషకంటే ఘోరమైన భాషను వైసీపీఎంపీలు పార్లమెంట్ లో ఉపయోగించారు. పార్లమెంట్ లో తెలుగువారిని, తెలుగుభాషను కించపరచడానికే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 28మందిఎంపీలను ఇచ్చారా?
అసభ్యపదజాలం వాడిన వైసీపీ ఎంపీలపై తక్షణమే పార్లమెంట్ స్పీకర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. ఇంతదగుల్బాజీ భాష మాట్లాడే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. ఆ ఘనకీర్తి జగన్మోహన్ రెడ్డికి, ఆయనపార్టీకే దక్కింది. అధికారం ఏమీ మీ బాబుగారి సొమ్ముకాదు. అదిఒక బాధ్యతని గుర్తుంచుకోండి. దాన్ని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వినియోగించకుండా, ఇష్టానుసారం ప్రవర్తిస్తారా? ఎస్టీ మహిళాధికారిని నోటికొచ్చినట్లు దూషించిన వైసీపీఛోటా నాయకుడిపై ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకుంటారనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.
తూర్పుగోదావరి జిల్లాఅయినవిల్లి మండలంలో వైసీపీ ఛోటానాయకుడు ఒకడు, ఎంపీడీవో అధికారి, ఎస్టీ మహిళ అయన కే.ఆర్.విజయను నోటికొచ్చినట్లు దూషించాడు. ఒకఎస్టీ వర్గానికిచెందిన మహిళాధికారిని చీరేస్తాం అనడమేంటి.. బుద్ధిలేని, సిగ్గులేని వైసీపీ నాయకులారా? మహిళాధికారిని దూషించిన వైసీపీ నేతను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏంచేస్తారు? అతనిపై, ఆయన ఏంచర్యలు తీసుకుంటారో, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నైతిక విలువల గురించి ముఖ్యమంత్రికి చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే. ఒక అధికారిని ఇష్టానుసారం దూషించిన వైసీపీనేతపై డీజీపీ ఏంచర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలి.
సదరు నేతను వెంటనే అరెస్ట్ చేసి, జైలుకి పంపాలి. వైసీపీ ఎంపీలకు సభ్యతాసంస్కారాలు, పెద్దలను ఎలా గౌరవించాలనే దానిపై, వారి కుటుంబసభ్యులు కూడా మెచ్చుకునేలా వారానికోసారి వారికి ‘మోరల్ క్లాస్’ చెప్పడానికి నేను సిద్ధం. ముఖ్యమంత్రి పిలుపుకోసం ఎదురుచూస్తూఉంటాను.