Suryaa.co.in

Andhra Pradesh

జనాలందరూ జగన్ ను ఆడేసుకుంటున్నారనే నా బాధ

-వికసిత్ భారత్ కార్యక్రమంతో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి పోలికా??
-ఒక హిందువే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా
-భగవద్గీత చేతపట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా
-అన్ని మతాల సారాంశం ఒక్కటేనని మత గ్రంధాలు చదివి నమ్మిన వ్యక్తిగా చెబుతున్న
-నేనేమీ క్రైస్తవానికి వ్యతిరేకుడిని కాను
-కానీ అనధికారికంగా 20 శాతం మంది ఉన్న క్రైస్తవులే ముఖ్యమంత్రి కావాలని నినదించినప్పుడు … అధికారికంగా 90 శాతం అనధికారికంగా 73 శాతం ఉన్న హిందువు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు?
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఆటాడుదాం రా ఆంధ్ర కార్యక్రమం కాస్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు . ఆటాడుకుందాం రా కార్యక్రమాన్ని చేపడుతున్న జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేయడం చూసి నాకు బాధనిపించిందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కబడ్డీ క్రీడలో కబడ్డీ… కబడ్డీ అంటూ కూత పలుకుతారు. వేరే పదం కూడా పలకవచ్చునని నిబంధన ఉన్నది. దాన్ని సాకుగా తీసుకొని జగన్… జగన్, జై జగన్.. జై జై జగన్ అని కూత మారుస్తారేమోనంటూ ఎద్దేవా చేశారు.

జగన్… జగన్ అని కూతకు వెళితే, అవతలి టీం సభ్యులు భరించలేక
కసిగా పట్టేసుకుంటారేమోనని అన్నారు. మహారాష్ట్రలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఖో ఖో ఆటను కూడా ఆడిస్తున్నారు. ఆటలో భాగంగా క్రీడాకారులు ఖో అని అంటుంటారు. ఇప్పుడు ఖో అనే పదానికి బదులు, వైఎస్ , వైఎస్ అని పదాన్ని మారుస్తారా అంటూ రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు . షటిల్ బ్యాడ్మింటన్ లో భాగంగా షటిల్ కాక్ ఈకలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రిస్తారా?, లేకపోతే కాక్ లోపల చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపించే విధంగా ముద్రిస్తారేమో తెలియదన్నారు.. ఈకల మధ్య ఉండే మా పార్టీ అధ్యక్షుడిని ఆడుకుంటారా అన్న ఆయన, ఇదే విషయమై నెటిజెన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం పట్ల బాధనిపించింది.

ఫుట్బాల్, క్రికెట్ బాల్, షటిల్ కాక్, కబడ్డీ కూతల రూపంలో మా అధ్యక్షుడిని ఆడేసుకుంటారేమోనని తెలిసి అని ఆవేదన కలుగుతోందన్నారు . ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మల పిచ్చి పరాకాష్టకు చేరింది. జనన మరణ ధ్రువీకరణ పత్రాలపై, ఆస్తి పన్ను పత్రాలపై ఆయన చిరునవ్వులు చిందించే ఫోటోలను ముద్రిస్తున్నారు. ఇందులేడు అందులో లేడు అనే సందేహం వలదు అన్నట్టుగా ఏ కాగితంపై వెతికిన అందందే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కలవు అంటూ అపహాస్యం చేశారు.

విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళజోడులను అందజేస్తే ఆ కళ్ళజోళ్ళ బాక్స్ పై నవరంద్రాలతో పాటుగా చిరునవ్వు చిందించే జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం చూస్తే బొమ్మల పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయినట్లు స్పష్టం అవుతోంది . ఒక నెల రోజులపాటు జగనన్న క్రీడా ప్రాంగణాలలో జగనన్న పేరిట కూతలతో కబడ్డీ, ఈ కలపై ముద్రించే జగనన్న బొమ్మలతో షటిల్ క్రీడాకారులు ఆటలు ఆడుకుంటారన్నారు.

ఎక్కడ కూడా వైకాపాకు అభ్యర్థులు దొరకని పరిస్థితి
రాష్ట్రంలో ఎక్కడ కూడా వైకాపాకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెదేపాకు అభ్యర్థులు దొరకక ఆందోళన చెందుతున్నారని జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాయించి సంబుర పడుతున్నారు. కానీ దానికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. నరసాపురం లో నాపై అభ్యర్థిని పోటీ పెట్టడానికి, మా కుటుంబంలోనే చిచ్చు పెట్టాలనుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు .

నాపై అభ్యర్థిని పోటీ పెట్టడానికి సరైన వారి కోసం తీవ్రంగా గాలించండన్న రఘురామ కృష్ణంరాజు, నా దగ్గరే కాదు… రాష్ట్రవ్యాప్తంగా వైకాపా తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా కచ్చితంగా నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటాయి. నువ్వు అనుకున్న నువ్వు కాకపోతే, నువ్వు కాదనుకున్న నేను వస్తే దాని ఫలితం ఆంధ్రప్రదేశ్లో బీభత్సంగా ఉంటుంది.

ఎవరా నువ్వు, ఎవరా నేను అన్నది డిసెంబర్ మూడవ తేదీ తర్వాత మాట్లాడుకుందాం.. సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా మా రైకాపాలు కోలుకున్నట్టు లేదు.. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే జన బహుల్యంలోకి రెట్టించిన ఉత్సాహంతో రానున్నారు. చంద్రబాబు నాయుడుకు లభించనున్న ప్రజాస్పందనకు కవరింగులను ఇప్పటినుంచే వైకాపా పెద్దలు ప్రారంభించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు..

కేంద్ర ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలన్నదే వికసిత్ భారత్ ఉద్దేశం
వై ఏపీ నీడ్స్ జగన్ అని కార్యక్రమంలో అధికారులు బుద్ధి లేకుండా పాల్గొనడాన్ని సిటిజన్స్ ఫోరం డెమోక్రసీ ప్రశ్నిస్తే, వారిని తిరిగి నిందించే విధంగా వికసిత్ భారత్ అనే కార్యక్రమం తో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడం లేదని, ప్రజల్లో అవగాహన కల్పించి కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలన్నదే వికసిత్ భారత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏనాడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పేరు పెట్టుకున్నారా? అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా తన పేరు, లేకపోతే తన తండ్రి పేరు పెట్టుకున్నారన్నారు.

ప్రధానమంత్రిగా కొనసాగుతూ, మాతృమూర్తికి పాదాభివందనం చేసే నరేంద్ర మోడీ ఏనాడైనా కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన తల్లి పేరు పెట్టుకున్నారా ?? అని నిలదీశారు. కానీ రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి పేరు లేదంటే ఆయన తండ్రి పేరుతోనే రాష్ట్రంలోని సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాలకు తన పేరు, లేదంటే తండ్రి పేరు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి, తన కంపెనీలకు మాత్రం భార్య పేరు పెట్టుకుంటారన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో పనికిమాలిన, దిక్కుమాలిన అధికారులు బుద్ధి లేకుండా, భయపడి పాల్గొంటే, దాని జస్టిఫికేషన్ కోసం నరేంద్ర మోడీ చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంతో పోల్చడానికి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయిన రఘురామకృష్ణంరాజు, ఇప్పటికైనా ఆత్మవలోకం చేసుకోవాలని సూచించారు.

అసలు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి, వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి ఏమైనా సంబంధం ఉందా?, వ్యక్తిగత ప్రచారం కోసం అధికారులతో చాకిరీ చేయించుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి, దేశ ప్రజల ప్రయోజనం కోసం ప్రధానమంత్రి చేపడుతున్న వికసిత్ భారత్ మధ్య పోలికా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమైనా వై ఇండియా నీడ్స్ మోడీ అనే కార్యక్రమాన్ని చేపట్టారా అంటూ నిలదీశారు. ప్రతి కార్యక్రమానికి తన పేరు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డికి, ప్రతి ధ్రువీకరణ పత్రంపై ఇకిలించి సకిలించే ఫోటోలను వేసుకుని జగన్మోహన్ రెడ్డికి వికసిత్ భారత్ కార్యక్రమంతో పోల్చుకోవడమే విడ్డూరంగా ఉందన్నారు.

ఇక వికసిత్ భారత్ కార్యక్రమంతో , వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని పోల్చుకోవడాన్ని తప్పుపడుతూ ఈనాడు దినపత్రిక రాసిన కథనానికి, అది రామోజీరావు బావ దారిద్రం అనే విమర్శలు చేయడం వారి అవివేకాన్ని తెలియజేస్తుంది . అద్భుతమైన నటనతో రక్తి కట్టించి ఒక్క ఛాన్స్ అని ప్రజలను బ్రతిమాలితే, వారు జగన్మోహన్ రెడ్డి నటనకు పడిపోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వికసిత్ భారత్ అనే కార్యక్రమం మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం దరిద్రపు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాల మధ్య సారూప్యతను చూపెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల బావ దారిద్ర్యాన్ని తెలియజేస్తోంది. ఇటువంటి పనికిమాలిన చెత్త ఐడియాలను సాక్షి దినపత్రిక సలహాదారుడు ఇచ్చి ఉంటే, అతని ఆలోచన దారిద్రాన్ని, ఆలోచనలేమిని తెలియజేస్తుంది .

ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని ముకులిత హస్తాలతో విన్నవించుకుంటున్నట్లుగా రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవిత్ర ఉద్దేశంతో వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని చేపడితే, మనం అపవిత్ర ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని పోల్చుకోవడం సరి కాదు. అలా చేస్తే ఇతరుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. మీ మనోభావాలు దెబ్బతింటే, సిఐడి చీఫ్ సంజయ్ ఆస్తులను అటాచ్మెంట్ చేస్తానని చెబుతున్నారు. ఇప్పుడదే సంజయ్ ఢిల్లీకి వెళ్తానని అంటున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం లభిస్తే, కచ్చితంగా ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాను. మీరు చేపడుతున్న కార్యక్రమాలతో, జగన్మోహన్ రెడ్డి చేపట్టే స్వార్థపూరిత కార్యక్రమాలను పోల్చుకుంటున్నారని చెబుతానన్నారు.

12 మంది డిప్యూటేషన్ అధికారులను పదిమంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే
రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర ద్వారా బడుగు బలహీన దళిత వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ, మరొకవైపు సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులకు ఈ ప్రభుత్వ పెద్దలు ఎలా పెద్దపీట వేశారో డిప్యూటేషన్ పై బదిలీ అయి వచ్చిన 12 మంది అధికారులలో పదిమంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం దానికి ఉదాహరణ అని రఘురామకృష్ణంరాజు తెలిపారు.. డిప్యూటేషన్ పై ఇతర సర్వీసుల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అధికారులను కీలక పోస్టుల్లో నియమించారు. ఇదే విషయాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చె నాయుడు మీడియాకు తెలియజేశారు..

ఈ సందర్భంగా వివిధ సర్వీసుల నుంచి వచ్చిన అధికారులకు ఎటువంటి కీలక బాధ్యతలు అప్పగించారో రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారుల కే పెద్దపీట వేయడమే సామాజిక న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఒకవైపు బస్సు ఎక్కి తిరుగుతూ, మరొకవైపు చిన్నచిన్న సర్వీసులకు చెందిన అధికారులను డిప్యూటేషన్ పై తీసుకువచ్చి ఐఏఎస్ అధికారులకు అప్పగించాల్సిన పోస్టులలో నియమించారన్నారు. ఐఏఎస్ అధికారులైతే తాము చేయమన్నట్లుగా తప్పు చేయరని భావించే, సొంత సామాజిక వర్గానికి చెందిన చిన్న చిన్న సర్వీసుల అధికారులను డిప్యూటేషన్ పై తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడ్డారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

టీటీడీ ఇన్చార్జ్ ఈవో గా వ్యవహరిస్తున్న ధర్మారెడ్డి, ప్రభుత్వ పెద్దల తరఫున ఢిల్లీలో లాబీయింగ్ చేయడంతో పాటు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, నాపై మోపిన తప్పుడు కేసులలో సాక్షాలను తారుమారు చేసే కుట్రలో భాగస్వామి అయ్యారని తెలిపారు . వాసుదేవ రెడ్డి అనే మరో అధికారికి లక్ష కోట్ల మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు . వై కాపా నాయకులు నాసిరకం మద్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. ఒకవైపు తన సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక బాధ్యతలను అప్పగిస్తూ మరొకవైపు సామాజిక న్యాయమే తన ధ్యేయమని చెప్పుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమల కు వచ్చినపుడు ఆయనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. నువ్వు పని చూసుకో… నాతో దైవదర్శనానికి రావద్దని జగన్మోహన్ రెడ్డితో నరేంద్ర మోడీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ వచ్చి రఘురామకృష్ణం రాజు చెవిలో చెప్పారా? అని అడిగేవారికి, నాకు తెలిసిన బిజెపి నాయకులు చెప్పారన్నారు .. ప్రధానమంత్రి కి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఇన్చార్జ్ ఈవో ధర్మారెడ్డి వీడ్కోలు పలికారు.

దీనితో ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ పదవులలో వారు ఉన్నారు కాబట్టే, వాళ్లే ప్రధానమంత్రి కి వీడ్కోలు పలకాలి. సామాజిక సాధికార యాత్రలో మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు అంటూ సోది కబుర్లు చెబుతున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు శిక్ష పడింది. కేవలం వెయ్యి రూపాయల జరిమానాలతో ఇకపై సరి పెట్టేది లేదు. పెద్ద శిక్ష లే పడుతాయని ఆయన అన్నారు.

క్రైస్తవుడైన వ్యక్తి సీఎం కావాలట… అది జగన్మోహన్ రెడ్డే నట
క్రైస్తవుడైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అది జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొనడం బాధనిపించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. క్రైస్తవుడే ముఖ్యమంత్రి కావాలని నినాదంతో వైకాపా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నికల ప్రచార సభలలో విజయమ్మ కూడా బైబిల్ చేతిలో పట్టుకొని పాల్గొన్న విషయం తెలిసింది.

ఇక రాష్ట్రంలో రానున్న 27 రోజులపాటు రాష్ట్రంలో క్రైస్తవ సభలో జరుగుతాయి. నేనేమీ క్రైస్తవ మతానికి వ్యతిరేకిని కాను. అన్ని మతాలను గౌరవించే వ్యక్తిని. సర్వమత సారాంశం ఒక్కటేనని, అన్ని మత గ్రంథాలను చదివిన వ్యక్తిగా చెబుతున్నాను. అయితే నేను కూడా హిందువే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అధికారికంగా రెండు శాతం, అనధికారికంగా 20% ఉన్న క్రైస్తవులే ముఖ్యమంత్రి కావాలని వైకాపా నాయకులు నినదించినప్పుడు, అధికారికంగా 90% అనధికారికంగా 70% ఉన్న హిందువులలోని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పుందా అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. రానున్న ఎన్నికల్లో భగవద్గీతను చేత పట్టి ప్రచార సభలలో పాల్గొంటాను. ఇష్టం ఉన్నవారు ఓటు వేస్తారు, లేనివారు ఓటు వేయరన్నారు.

LEAVE A RESPONSE