అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత

-మ్యానిఫెస్టో, ఆరు గ్యాంటీలతో బిర్లామందిర్, నాంపల్లి దర్గాలలో పూజలు, ప్రార్థనలు చేసిన కాంగ్రెస్ నాయకులు
-ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేస్తామని ప్రమాణం చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మానిక్ రావ్ ఠాక్రే, ముఖ్య నాయకులు

బిర్లామందిర్ లో, నాంపల్లి లలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, వి.హనుమంతరావు, తదితరులు దేవాలయం లోను, దర్గా లో పూజలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు సెప్టెంబర్ 17న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుక్కుగుడా లో జరిగిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.

మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 రూపాయలకే వంట గ్యాస్, ఆర్టీసీ బస్ లలో ఉచిత ప్రయాణం లాంటి హామీలు సోనియాగాంధీ ఇచ్చారు.

రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు 15000 రూపాయలు ఎకరాకు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ.ఇచ్చారు.

గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయూత పథకం కింద నెలకు 4000 పెన్షన్ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య భీమా లాంటి పథకాలను అమలు చేస్తామని సోనియా గాంధీ విజయ సంకల్ప సభలో ప్రకటించారు.

ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఈ ఆరు గారెంటీలను విస్తృతంగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఈ ఆరు గంటల పై చట్టం చేస్తామని ప్రకటించారు.

ఈ రోజు రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇంచార్జ్ ఠాక్రే తదితరులు బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాంపల్లి దర్గాలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసి ఆరు గారంటీలను, కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తామని ప్రమాణం చేశారు. అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గంలోనే ఈ ఆరు గ్యారెంటీ లపై చట్టం చేస్తామని ప్రమాణం చేశారు

Leave a Reply