Suryaa.co.in

Telangana

కేసీఆర్…అసదుద్దీన్ ఓవైసీ ముక్కు నేలకు రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలి

– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ర్యాలీ అనంతరం కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా దేశంలో 50 శాతమున్న మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటిబిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును, నరేంద్ర మోదీ నేతృత్వంలో అమలు చేయడం చరిత్రాత్మకమైన సందర్భం.

60 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్.. పార్లమెంటులో అనేకమార్లు చర్చ జరిగినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుకు నోచుకోకుండా కాలం వెల్లదీసింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు, అంగన్ వాడీల నుంచి మొదలు ఐటీ సెక్టార్, అంతరిక్షం వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత ఆర్మీలో మహిళలు సత్తా చాటుతున్నారు. యుద్ధ విమానాల్లో పైలట్లుగా రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ఆడబిడ్డలు పనిచేస్తున్నారు.

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 75 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఐదేళ్లలో 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడారు.ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన కింద పేద కుటుంబాలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇస్తోంది.

సుమారు 50 శాతం మంది మహిళలున్న తెలంగాణలో.. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. కేసీఆర్.. తొలిసారి గెలిచిన తర్వాత మొదటి క్యాబినెట్ లో ఐదేళ్ల పాటు ఒక్క మహిళ కూడా లేదు.

పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్.కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీతో అంటగాకుతున్న, చేతులు కలిపిన కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. రజాకార్ల వారసత్వ పార్టీ.. హైదరాబాద్ లో మత కలహాలు రెచ్చగొట్టే పార్టీ ఎంఐఎం.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో సభ నుంచి తప్పించుకున్నారు. దేశంలో మౌలికమైన మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీతోనే. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కూడా 70 శాతం మహిళల పేరుమీదే ఇస్తోంది. ముద్ర లోన్స్ తో పాటు స్వనిధి యోజనతో రుణాలు ఇస్తోంది.

మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, పీఎం స్వనిధి కింద ఆర్థికంగా సాధికారిత కల్పిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వమే.మహిళలకు అన్నింటా అండగా నిలుస్తూ, నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తున్న నరేంద్ర మోదీ కి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

పదేళ్ల యూపీఏ పాలనలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలు జరిగాయి.గత తొమ్మిదేళ్లుగా అవినీతి మరకలేకుండా, నీతివంతమైన పాలన అందిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే.పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మోదీ గారి తండ్రి గారు రైల్వేస్టేషన్ లో టీ వ్యాపారం చేసి తన కొడుకును చదివించి ప్రధానమంత్రిగా తీర్చిదిద్దారు.

పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం. దేశంలోని ఆడబిడ్డలు ప్రశాంతంగా జీవించాలంటే, అన్ని రకాల హక్కులు అమలు కావాలంటే నరేంద్ర మోదీ ని ఆశీర్వదించి, అండగా ఉండాలని కోరుతున్నా.మహిళా రిజర్వేషన్లు కల్పించడంపై అన్ని రంగాల్లోని మహిళలు, ఆడబిడ్డలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE