స్విడ్జర్‌లాండ్‌నూ తాకిన బాబు అరెస్టు సెగ

Spread the love

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు సెగ స్విడ్జర్‌లాండ్‌నూ తాకింది. అక్కడి తెలుగువారు బాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. స్విడ్జర్‌లాండ్‌ లోని తెలుగు వారు చంద్రబాబు కి సంఘీభావం గా మేము సైతం బాబు గారి కోసం అని నినదించారు. ఈ కార్యక్రమము లో పలువురు మాట్లాడుతూ .. తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు గారి సేవ వెలకట్టలేనిది. అయన వాళ్ళ ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున దేశవిదేశాలలో సెటిల్ అవ్వటమే కాకుండా, మరల అయన ఇచ్చిన జన్మభూమి కోసం మేము సైతం అనే నినాదం లో ,సొంత ఊళ్ళకి బూరి విరాళాలు ఇచ్చారు అని కొనియాడారు.

ఒక్కటి మాత్రం చెప్పగలం అంతిమ విజయం ధర్మానిదే..బాబు ఎప్పటికి నిజాయితీకి నిలువుటద్దం అని అందరు నినదించారు. ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతలు కానీ ..పెట్టుబడులు కానీ ఈ సైకో జగన్ పాలనా లో ఎప్పటికి రావు చేతకాని దద్దమ్మ కి అధికారం ఇస్తే గంజాయి , మందు పేకాట ఇవే తాను తెచ్చే గొప్ప పనులు యువత కి అదే చంద్రబాబు వస్తే పెట్టుబడులు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి అని ముక్త కంఠం తో సైకో పోవాలి బాబు రావాలి ఆంధ్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పారు

Leave a Reply