– జనం బాట పూర్తైన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం
– జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు ఎలాంటి స్టాండ్ లేదు
– ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ ని
– జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కరీంనగర్: రాష్ట్రంలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. మా ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చటమే. మేము ప్రజల గొంతుకగా మారుతాం. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికలో బిజీగా ఉన్నారు. మొంథా తుపానుతో రైతులు నష్టపోయిన పట్టించుకుంట లేరు. వరంగల్ నగరమంతా నీటిలో మునిగితే పోరాటం చేయాల్సి పార్టీలు పట్టించుకుంట లేవు.
జాగృతి రాజకీయ వేదికే. మేము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడాం. జాగృతి ది తెలంగాణ లైన్. మేము ప్రజలకోసమే పోరాడుతాం. మోడీ కార్మికుల హక్కులను కాలరాస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేయాల్సినంత పోరాటం చేయలేదు. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ, లేబర్ చట్టాల గురించి మాట్లాడలేదు. మోడీ కారణంగా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇంకా రెండు నెలల సమయం కోరుతున్నారు. అంటే వాళ్లు ఈ విషయాన్నిఇంకా సాగదీసే ప్రయత్నంలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు ఎలాంటి స్టాండ్ లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి మండలిలో లో నేను మాట్లాడితేనే సీఎం 700 కోట్లు ఇచ్చారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని చెప్పి చేయటం లేదు.
ఏపీకి 23 మంది సీఎంలు అయితే ఒక్క బీసీ గానీ, మహిళ గానీ ఎందుకు సీఎం కాలేదు? నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని నేను కోరాను. నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఆరు నెలల లోపు ఎమ్మెల్సీని చేయాలి అనేది వారి ఆలోచన కావొచ్చు. ఛైర్మన్ నా రాజీనామా పై నాతో కాకుండా చిట్ చాట్ లో మాట్లాడుతున్నారు. మరొక సారి ఆయనతో మాట్లాడి రాజీనామా యాక్సెప్ట్ చేయమని కోరుతా.
నన్ను వారి బాణం, వీరి బాణం అని అంటున్నారు. కానీ నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. వీలైనంత తొందరగా సామాజిక తెలంగాణ, బీసీ రిజర్వేషన్లు పూర్తి కావాలని కోరుకుంటున్నా. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో 69 మంది మహిళ ఎమ్మెల్యేలు అవుతారు.
ఇంకా ఎన్నాళ్లు ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం వెళ్తాం. అమెరికా, దుబాయ్ వాళ్లు మనల్ని వెళ్లగొడుతున్నారు. మనం ఉన్నచోట ఉద్యోగాలు లేవు. ఇప్పుడు విప్లవాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. నేను, హరికృష్ణ అనే అధికారి కృషి చేస్తే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది. తెలుగుకు ప్రాచీన హోదా కోసం కొట్లాడినం, ఆరాట పడ్డం. గతంలో నేను ఏమీ అనలేని బంధనాలు ఉండేవి. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ ని.
ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ టవర్ లో కంపెనీలు పారిపోయాయి. మంత్రి శ్రీధర్ బాబు దీనిపై దృష్టి పెట్టాలి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏమీ పట్టించుకోవటం లేదు. ఆర్టీసీ లో చిన్న చిన్న కారణాలకే 11 వందల మందిని తీసేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ 3 వందల మంది కార్మికులను తీసేశారు. వారంతా రోడ్డున పడ్డారు. వారిని మళ్లీ రిక్రూట్ చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఎన్నిక రావటంతో ఎమర్జెన్సీగా మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు. అదే ఎమర్జెన్సీ లో మైనార్టీ ల కోసం ఏటా 2 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంతే ఎమర్జెన్సీగా మైనార్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి.