” విస్కీ ” రెండు అక్షరాలు
” బ్రాందీ ” రెండు అక్షరాలు
” రమ్ ” రెండు అక్షరాలు
” జిన్ ” రెండు అక్షరాలు
” వోడ్కా ” రెండు అక్షరాలు
” బీర్ ” రెండు అక్షరాలు
” స్కాచ్ ” రెండు అక్షరాలు
తాగడానికి వాడే ” గ్లాసు ” రెండు అక్షరాలు
కలుపుకునే ” నీళ్లు ” , ” సోడా ” రెండు అక్షరాలు
అవి అమ్మే ” బార్ ” రెండు అక్షరాలు
కొలత చూసే ” పెగ్ ” రెండు అక్షరాలు
తాగాక ఎక్కే ” మత్తు ” రెండు అక్షరాలు
మత్తెకువైతే కక్కే ” వాంతి ” రెండు అక్షరాలు
దారిలో తూలిపడే ” రోడ్డు” రెండు అక్షరాలు
పడ్డాక మోసుకుపోయే ” జనం ” రెండు అక్షరాలు
జనం దృష్టిలో పోయే ” మానం ” రెండు అక్షరాలు
అది చూసి కన్నీళ్లు పెట్టే ” భార్య ” రెండు అక్షరాలు
వ్యసనమయితే వచ్చే ” రోగం ” రెండు అక్షరాలు
ఆసుపత్రిలో పెట్టె ” ఖర్చు ” రెండు అక్షరాలు
దానికోసం చేసే ” అప్పు ” రెండు అక్షరాలు
అప్పుకోసం అమ్మే ” ఆస్తి ” రెండు అక్షరాలు
తేడా వస్తే వచ్చే ” చావు ” రెండు అక్షరాలు
చస్తే చివర్లో మోసే ” పాడే ” రెండు అక్షరాలు
పూడ్చే ” గుంత”, కాల్చే ” అగ్ని ” రెండు అక్షరాలు
చివరికి చేసే ” తిథి ” రెండు అక్షరాలు
గోడకి తగిలించే ” ఫోటో ” రెండు అక్షరాలు
అందుకే జీవితంలో ఈ విషయం గుర్తించుకో. మద్యం తాగి- వాహనాలు నడపరాదు.
– ప్రసాద్