కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం వద్ద శనివారం నాడు జరిగిన తొక్కిసలాట సంఘటన పై భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా ఒక రాజకీయ పార్టీ కి చెందిన వ్యక్తులు ప్రచారం చేయడం దురదృష్టకరం.
ఆ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదు. అంత పెద్దఎత్తున భక్తులను సమీకరిస్తున్నట్లు ఆ దేవాలయ యాజమాన్యం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రతి ఏడాది కూడా భక్తులు ఇదే విధంగా 25,000 మంది వరకు వస్తారని ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు, అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవం ఏంటంటే ఈ దేవాలయాన్ని హరిముకుంద్పండా అనే ఒక వ్యక్తి తన సొంతంగా నిర్మించుకున్నాడు. అందుకని ఆ ప్రైవేటు దేవాలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు. ప్రతి ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నది అబద్దం. దేవాలయం ప్రారంభమై 4 నెలలు మాత్రమే అయ్యింది.
దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉంది. కానీ ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు రావడం జరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను ఆ వ్యక్తి చేయపోవడమే ఘటనకు కారణం. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే భక్తులు నియంత్రణలో ఉండేలా చూసేవారు.