Suryaa.co.in

Features National

నాకు అలాంటి మతం వద్దు

చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో పాతిపెట్టాలనుకుంది. ఆమె రోమన్ క్యాథలిక్ (ఆర్‌సి) చ‌ర్చిని సంప్ర‌దించింది. అయితే, చ‌ర్చి సంబంధీకులు ఇందుకు నిరాకరించారు. అంతేకాదు… ప్రార్థన సమావేశాన్నీ నిర్వహించనివ్వలేదు.

బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, “నేను క్రిస్టియన్‌ని, నా భర్త హిందువు. నా కొడుకు రెండు మతాలను ఇష్టపడతాడు. కానీ అతను యేసును ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి నేను అతనిని క్రైస్తవ ఆచారాల ప్రకారం పాతిపెట్టాలని కోరుకున్నాను. దీనికి సమీపంలోని ఆర్‌సి చర్చిని సంప్రదించాను. కానీ, మేము చందా చెల్లించడం లేదని వారి శ్మ‌శానవాటికలో స్థలాన్ని నిరాకరించారు అని ఆమె బోరుమంది. అప్పుడు ఆమె చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వంటి చ‌ర్చల‌ను సంప్ర‌దించింది. కార‌ణాలుఏవైనా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆమె దుఃఖంతో కుమిలిపోయింది.

బాధిత తల్లి ఇలా అన్నారు: “సర్టిఫికేట్ పొందడానికి నేను నా బిడ్డ నిర్జీవ దేహంతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి వెళ్లాలా? అటువంటి పరిస్థితిలో చర్చిలు సహాయాన్ని నిరాకరించడం బాధాకరం. నాకు అలాంటి మతం వద్దు.” “మీరు ఖననం చేయడానికి కూడా స్థలం ఇవ్వకపోతే మీరు ఎలాంటి క్రైస్తవులు?”, ఆమె తన తోటి క్రైస్తవులను ప్రశ్నించింది.
( vskandhra.org)

LEAVE A RESPONSE