Suryaa.co.in

Andhra Pradesh

ఇకమీదట డీజీపీ కార్యాలయానికి రాదలచుకోలేదు

– డీజీపీ అపాయింట్ మెంట్ ఇవ్వనందున రాను
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఇకమీదట డీజీపీ కార్యాలయానికి రాదలచుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తేల్చిచెప్పారు. టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి ఫిర్యాదు చేయబోతే.. డీజీపీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ సందర్బంగా ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…అనేకసార్లు టీడీపీ నాయకులు డీజీపీ అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదు. ముఖ్యంగా వర్ల రామయ్యకు మరీ ఇవ్వలేదు.

వైసీపీ ఎన్నిసార్లు అడిగినా నిరభ్యంతరంగా అపాయింట్ మెంట్ లు ఇస్తున్నారు. ముందుగానే అపాయింట్ మెంట్ కావాలని డీజీపీకి మెయిల్ పంపినా ఫలితం లేకుండా పోయింది. అయినా సరే ఫోన్ ట్యాప్ లపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళితే.. అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిరిగి పంపేశారు. కావున టీడీపీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేయడానికి రారు, ముఖ్యంగా తాను (వర్ల రామయ్య)రాను.

ఫిర్యాదు చేయడానికే వెళ్తున్నాంగానీ ఇతరవాటికి వెళ్లడంలేదుకదా? అటువంటప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ఏమైంది?మంత్రి పెద్దిరెడ్డి తానే ఫోన్ ట్యాప్ చేసి నిందితులను పట్టుకున్నామని స్వయంగా చెప్పడం ఫోన్లు ట్యాప్ జరుగుతున్నాయనేదానికి బలం చేకూరుతోంది. ఫోన్ ట్యాప్ లపై ఫిర్యాదు చేయడానికి వస్తే..డీజీపీ కెవి రాజేంద్రనాధరెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణం తెలుపగలరా? నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళితే డీజీపీకి అవమానంపాలు కాక మానదు.

అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి మరో న్యాయమా? డీజీపీగా కెవి రాజేంద్రనాధ్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుండి ఆయన ముఖారవింద భాగ్యం టీడీపీ నాయకులకు కలగటంలేదు. డీజీపీ.. ఎందుకో టీడీపీ నాయకులను చూడటానికి ఇష్టపడటంలేదు. వైసీపీ నాయకులకేమో నిరభ్యంతరంగా అపాయింట్ మెంట్లు ఇస్తున్నారు. టీడీపీ నాయకులు చేసుకున్న పాపమేమిటి? వైసీపీ వారు చేసుకున్న పుణ్యమేమిటో అర్థం కావడంలేదు.

డీజీపీ తన విద్యుక్త ధర్మాన్ని పాటించడంలేదనిపిస్తోంది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ అయినప్పటినుంచి సామాన్యులు మాట్లాడుకునే స్వచ్ఛ లేకుండా పోయింది. వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. భార్యా, భర్తల ఫోన్లనే ట్యాపింగ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నాయకుల మాట్లాడుకోవడాన్ని ట్యాపింగ్ చేస్తున్నారు. డేటా చోరీ యదేచ్ఛగా జరుగుతోంది.

కుటుంబ సభ్యులతో స్వచ్ఛగా మాట్లాడుకునే సౌలభ్యం కూడా లేకుండా పోయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేమే ఫోన్ ట్యాప్ చేసి నిందితుడిని పట్టుకున్నామని పత్రికా ముఖంగా తెలపడం ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనడానికి బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అప్రజాస్వామ్యంలో ఉన్నామనిపిస్తోంది. రాష్ట్ర మొదటి పౌరడు గవర్నర్ అపాయింట్ మెంట్ కావాలని కోరితే ఇస్తారు. మరి డీజీపీ ఎందుకివ్వరు?

డీజీపీ గవర్నర్ కంటే గొప్పవారా? సీఎం డీజీపీ వ్యవహార శైలి గురించి పట్టించుకోవాలి. లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకులకు కూడా డీజీపీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. సో.. ఇకమీదట ఏమున్నా టీడీపీ డీజీపీకి పంపాల్సిన లావాదేవీలు, వ్యవహారాలన్నీ మెయిల్ ద్వారానే చేస్తామని, డీజీపీ కార్యాలయానికి వెళ్లేది లేదని ఇప్పటికైనా డీజీపీ పక్షపాత వైఖరి మానాలని వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE