– జగన్ ది ‘మొబైల్ సిద్ధాంతం
– రాజధాని అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు.. అదొక రాష్ట్ర భవిష్యత్తు
సజ్జలగారూ.. మీరు మంచి ప్రశ్న అడిగారు!
//అమరావతి రాజధాని చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చట్టబద్ధత కల్పించాలంటే మండలి ఆమోదం కూడా ఉండాలి – వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి//
అమరావతి ‘రాజముద్ర’ అనేది మీ వైకాపా నేతల నాలుకలపై కర్రు కాల్చి వేస్తున్న వాత!
రాష్ట్ర కేబినెట్ అమరావతికి పార్లమెంటరీ చట్టబద్ధత కల్పించే దిశగా చారిత్రాత్మక అడుగు వేస్తుంటే, కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవని నువ్వు వింత లాజిక్కులతో వినోదాన్ని పంచుతున్నావు.
ఇటీవలే ఓ కాన్క్లేవ్లో పాల్గొన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారూ.. మీరేమని సెలవిచ్చారు? “జగన్ అమరావతిలోనే ఉంటారు.. ఎక్కడికీ వెళ్లరు” అని అన్నారా లేదా?
కానీ, ఆ తరువాత మిమ్మల్ని కనీసం ఒక పూచికపుల్లలా కూడా చూడకుండా జగన్ ఏమన్నారు? “సీఎంగా నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని” అని అన్నారా లేదా?
అంటే మీ జగన్ ది ‘మొబైల్ సిద్ధాంతం’. రాజధాని అనేది ఒక ప్రాంతం కాదు, అది కేవలం ఒక ‘కుర్చీ’ అన్నమాట. ముఖ్యమంత్రి గారు బస్సులో ఉంటే బస్సే రాజధాని, హెలికాప్టర్లో ఉంటే ఆకాశమే సెక్రటేరియట్! ఈ లెక్కన ప్రజలు తమ పనుల కోసం మ్యాపులు పక్కన పెట్టి, సార్ కుర్చీ ఎక్కడ ఉందో వెతుక్కోవాలన్నమాట.
అమరావతికి దేశంలోనే ఏకైక చట్టబద్ధత గల రాజధానిగా గుర్తింపు రాబోతుంటే, “మండలిలో ఎందుకు పెట్టలేదు?” అని అడగడం హాస్యాస్పదం. మండలిని రద్దు చేయాలని గతంలో మీరే తీర్మానం చేసి, ఇప్పుడు అదే మండలి గొడుగును వెతుక్కోవడం అంటే.. ‘అవకాశవాదం’ అనే పదానికి మీరే నిలువెత్తు సాక్ష్యం.
ఇక రాజధానుల సంఖ్య పెంచడంలో మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్టైలే వేరు. “మూడు కాదు.. ముప్పై రెండు రాజధానులు చేస్తాం” అని అప్పట్లో హుంకరించారు. మీరు అధికారంలో ఉంటే అహంకారం ఏ స్థాయిలో ఉంటుందో ఆ మాట చెబుతుంది. అవేమైనా రేషన్ షాపులా లేక గ్రామ సచివాలయాలా? ఊరికో రాజధాని పేరుతో రాష్ట్రమంతా బోర్డులు తగిలిద్దామని ప్లాన్ చేశారు. తీరా చూస్తే, ప్రజలు మాత్రం కౌంటింగ్ రోజు కేవలం ’11’ సీట్లే ఇచ్చి మీ రాజధాని లెక్కలను సరిచేశారు!
ఆ బొత్స సత్తిబాబుతో ఏమో రాజధానిని ‘శ్మశానం’ అని వాగించారు. మీది ఎంతటి వికృత ఆలోచనో ఆ మాటను బట్టే అర్థం చేసుకోవచ్చు.
రాజధాని అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు.. అదొక రాష్ట్ర భవిష్యత్తు. రాజధాని అనేది “మ్యూజికల్ చైర్” ఆట అంతకంటే కాదు. దేశ పార్లమెంట్ ఆమోదంతో అమరావతికి రాజముద్ర పడుతుంటే, ఇప్పుడు మీ నోర్లు లేస్తున్నాయి.
అసెంబ్లీకి వచ్చి దమ్ముంటే మాట్లాడమని జగన్ రెడ్డికి చెప్పు. ఒక్కసారి పార్లమెంటు ద్వారా రాజముద్ర పడితే మీ నాలుకలపై అవి కర్రు కాల్చి పెట్టిన వాతలు అవుతాయి. మన దేశంలో ఇలాంటి అసాధారణ పరిస్థితి రావడానికి కారణం జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలే.
పార్లమెంట్లో మీ ఎంపీల ద్వారా దీనిపై చర్చకు పట్టుబట్టండి. అప్పుడు దేశం మొత్తం మీ తీరును చూసి ఈసడించుకుంటుంది. అప్పటి వరకు వైకాపాకు ఇలాంటి సచ్చు సలహాలే ఇస్తూ ఉండు. పాత విషయాలన్నీ జనానికి మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నువ్వు నాకు సజ్జల!