Suryaa.co.in

Telangana

నేను అరెస్ట్ కాలేదు: పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు : తనను దుబాయిలో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోందని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ‘నేను, నా ఇంట్లో హైదారాబాద్ మణికొండలో ఉన్నాను. తప్పుడు ప్రచారం నమ్మకండి. ప్రజలందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నా తాండూర్ ప్రజలకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు’ అని రోహిత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.

LEAVE A RESPONSE