10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ టిడిపి
.హైదరాబాద్ లోనే హజ్ హౌస్ కట్టా
హైదరాబాద్ లో మత కలహాలు లేకుండా చేశాం
ఒకరి మీద దాడి జరిగిన్పపుడు స్పందించకపోతే….చివరికి మీపైనా దాడికి వస్తారు
మనం కూడా స్పందించకపోతే….మన మీద దాడి జరిగితే చెప్పుకోవడానికి కూడా ఎవరూ ఉండరు
– తన కుమారుడికి విదేశీ విద్య పథకం కింద నాటి టిడిపి ప్రభుత్వం, రూ.10 లక్షలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సలాం అనే వ్యక్తి…ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేశారని చెప్పిన సలాం.
– తన రేషన్ కార్డు తీసేశారని రోదిస్తూ చెప్పిన వడ్లమూడికి చెందిన పర్వీన్ అనే మహిళ
– ఉచిత ఇసుక విధానం తీసేయ్యడం వల్ల తాము ఎలా నష్టపోయిందీ వివరించిన పలువరు ముస్లిం సోదరులు
-ట్యాక్సులతో ఆటోమొబైల్ రంగాన్ని జగన్ సర్కారు సర్వనాశనం చేసిందని వాపోయిన ముస్లింలు
– గుంటూరు జిల్లా, పొన్నూరులో మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం ఏం మాట్లాడారంటే..
1983లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే…..1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ పెట్టాం.
• ఉర్థూను రెండో అధికారక భాషగా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశంపార్టీ. నేను సిఎంగా ఉండగానే నాడు ఆ నిర్ణయం తీసుకున్నాను.
• ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం…..హైదరాబాద్ లోనే హజ్ హౌస్ కట్టాను.
• నేరుగా హైదరాబాద్ నుంచే యాత్రకు వెళ్లే అవకాశం కల్పించాం…ముస్లింల మనో భావాలు గౌరవించాం. హజ్ యాత్రకు ఆర్థిక సాయం కూడా చేశాం.
• హైదరాబాద్ లో ఉర్థూ యూనిరవర్సిటీ పెట్టాం….విభజన తరువాత కర్నూలులో ఉర్థూ యూనివర్సిటీ కట్టాం.
• 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ టిడిపి.
• సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుక కూడా ముస్లింలకు వర్తింపజేశాం.
• తెలుగుదేశం వచ్చిన తరువాత హైదరాబాద్ లో మత కలహాలు లేకుండా చేశాం.
• 2014 తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకువచ్చాం. వాటన్నింటిని ఈ సిఎం వచ్చిన తరువాత రద్దు చేశాడు.
• పెళ్లి కానుక కింద లక్ష ఇస్తాను అని చెప్పి…నిలిపివేశాడు.
• మంత్రి పదవులకు 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదు….సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదు…దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలంట.
• టిడిపి వచ్చిన తరువాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకువస్తా.
• జగన్ రెడ్డిలా మోసం చెయ్యను…..దుల్హన్ పథకం కింద లక్ష చెల్లిస్తా.
• మైనారిటీ పిల్లల్లో ఉన్నత చదువులు అవసరం అని విదేశీ విద్య పథకం పెట్టాను.
• విద్యతోనే మార్పు అని గుర్తించి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చాను.• ఐటితో జీవితాలు మారుతాయని ఐటి కంపెనీలను ప్రోత్సహించాను.
• ఇంజనీరింగ్ కాలేజ్ లు తీసుకువచ్చాను…దీంతో దేశ విదేశాల్లో మన పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
• అడబిడ్డలకు విద్యలో ఇచ్చిన 33 శాతం రిజర్వేషన్లు అద్భుత ఫలితాలను ఇస్తోంది.
• ముస్లింలకు విదేశీ విద్యతో మంచి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేశాను.
• ముస్లింలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చి అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి ముస్లిం వ్యాపారులకు అండగా నిలిచాం.
• ఇప్పుడు అన్నీ ఆపేశారు…అడిగితే కేసులు పెడతున్నారు.
• నంద్యాలలో అబ్దుల్ సలాంపై తప్పుడు కేసులు పెడితే మదనపడి, భయపడి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
• అధికార పార్టీ, పోలీసుల వేధింపుల కారణంగా భార్య పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
• ఒకరి మీద దాడి జరిగిన్పపుడు స్పందించకపోతే….చివరికి మీపైనా దాడికి వస్తారు.
• మనం కూడా స్పందించకపోతే….మన మీద దాడి జరిగితే చెప్పుకోవడానికి కూడా ఎవరూ ఉండరు.
• ఎక్కడో అబ్దుల్ సలాం చనిపోతే నాకేంటి అనుకుంటే ఎలా……రేపు నీకు కూడా కష్టం వస్తే ఎవరు ఉంటారు అనేది ఆలోచించాలి.
• రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు కేసులు చూశారా.?
• నిన్న మనం పొన్నూరులో సభ పెట్టుకుంటే కూడా 10 మంది వచ్చి గొడవ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి రాష్ట్రంలో ఉందా.?
• నాడు మనం మొదలు పెట్టిన మసీదులు, షాదిఖానాలు పూర్తి చెయ్యలేదు.
• వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.
• గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా…వక్ఫ్ బోర్డు ఆస్తులను కొట్టేస్తున్నారు.
• టిడిపి అధికారం లోకి వచ్చిన తరువాత వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షిస్తాం.
• రాష్ట్రంలో 43 మంది ముస్లింలపై భౌతిక దాడులు జరిగాయి.
• రంజాన్ తోఫాకు డబ్బులు లేవు…దుకాన్ మకాన్ కు డబ్బులు లేవు….విదేశీ విద్యకు డబ్బులు లేవు…కానీ సాక్షికి మాత్రం ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి.
• సభలో నాటి మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ ను కూడా దారుణంగా అవమానించారు.
• ముస్లింల రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. సుప్రీం కోర్టులో దీని కోసం మీ తరుపున పోరాడుతాను.
• రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి. ఒక్క నెలలోనే 50 వేల కోట్ల అప్పులు చేశాడు.
• ఈ అప్పులు అన్నీ ఎవరు కట్టాలి….మనమే కట్టాలి.
• మైనారిటీలకు ఏం కావాలో చర్చిస్తాం….వారికి మంచి చేసే విధానాలు రూపొందిస్తాను.
• మసీదులకు పట్టాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్న చోట సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.
• చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి అమలు పరచాలన్న ముస్లింలు…అధికారం లోకి వచ్చిన తరువాత అమలు చేస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.
• ఉచిత ఇసుక విధానం వల్ల నాడు ఎంతో లబ్ది పొందామని చెప్పిన పలువురు వ్యక్తులు.
• నేటి ప్రభుత్వ విధానం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..
• మన ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుంది….కానీ మన దగ్గర మాత్రం ఇసుక దొరకడం లేదు.
• ప్రభుత్వ ఇసుక విధానం వల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.
• ఆటోమొబైల్ రంగం జగన్ విధానాతో సంక్షోభంలోకి వెళ్ళింది.
• జగన్ బటన్ నొక్కి ఇసుక, మద్యం దందాల డబ్బులు ఇంటికి వస్తాయి.
• పేదల రక్తాన్ని జలగలా తాగేస్తున్నాడు…అందుకే జగన్ రెడ్డి అని కాకుండా…జలగ రెడ్డి అనిపెట్టుకుంటే బాగుంటుంది.
• లారీ ఓనర్లు ప్రభుత్వ ట్యాక్స్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయారు.
• ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ఆటోమొబైల్ రంగంలోని వారంతా సిద్దం కావాలి.
• ఉపాధిని దెబ్బతీసిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివెయ్యాలి.
• ప్రభుత్వం నిలిపివేసిన పెన్షన్ లు అన్నీ ఆ కాలానికి కూడా కలిపి టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి చెల్లిస్తాను.
• జగన్ రెడ్డి విధానాలకు, వేధింపులకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. కంపెనీలు వెళ్లిపోతున్నాయి.
• జగన్ ఒక అమూల్ బేబి. సంగం వద్దు, విజయ డైరీ వద్దు….అమూల్ మాత్రమే ముద్దు అంటున్నాడు.
• అన్ని కంపెనీలు తిరిగి తీసుకువస్తాం….యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యొగ అవకాశాలు కల్పిస్తాం.