చదువురాని ఎమ్మెల్యేకు చదువుకోమని చెప్పడం తప్పా?

-చదువుకోమని సలహా ఇస్తే దళిత మహిళ అని కూడా చూడకుండా అట్రాసిటీ కేసు పెడుతారా?
-అనంతపురం డీఎస్సీ చైతన్య అరాచకాలకు ఇది పరాకాష్ట
– కింజారపు అచ్చెన్నాయుడు

వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, డీఎస్పీ చైతన్యలు కలిసి ఒక దళిత మహిళపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. చదువురాని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని చదువుకోమని చెబితే ఏ మంత నామోషా?

కేతిరెడ్డి మనసు మార్చుకుని చదువుకోడానికి ముందుకొస్తే ఎల్.కే.జీ నుంచి చదివించేందుకు మేం సిద్దంగా ఉన్నాం. అనంపురం జిల్లాలోని ఏ స్కూల్లో చేరిన ఫీజు మేమే కడుతాం. చదువుకోమని సలహా ఇస్తే దళిత మహిళ కమలమ్మపై అట్రాసిటీ కేసు పెడుతారా? పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయి. అందుకే దళిత మహిళ అని కూడా చూడకుండా అక్రమ కేసు పెట్టి రిమాండ్ కు తరలించాలని చూశారు.

చదువులేని వాడు వింత పశువు అనడానికి పెద్దారెడ్డే నిదర్శనం. వైసీపీ నాయకుల ఎలా ఆడమంటే అలా ఆడుతూ.. డీఎస్పీ చైతన్య చట్టాన్ని తుంగలో త్రొక్కుతున్నాడు. చైతన్య గతంలోనూ అనేక మంది టిడిపి కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించాడు. ఇప్పటి వరకు డీఎస్పీ చైతన్య వైసీపీ కార్యకర్తలా సామాన్యులను అరెస్టు చేసి చేసిన లాకప్ హింసల చిట్టా మా వద్ద ఉంది. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

చట్టాలను తుంగలో తొక్కి వైసీపీ నాయకులకు ఊడిగం చేస్తున్న డీఎస్పీ చైతన్యకు మా ప్రభుత్వం వచ్చాకా చట్టాలను ఎలా అమలు చేయాలో నేర్పుతాం. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని కేతిరెడ్డి పెద్దారెడ్డి గుర్తుంచుకోవాలి. ఇకనైనా కేతిరెడ్డి సామాన్యులపై తన ప్రతాపం చూపడం మానిబుద్దిగా నడుచుకోకపోతే భవిష్యత్తులో తగిన శాస్తి చేస్తారు.

Leave a Reply