Suryaa.co.in

Andhra Pradesh

బాకీ ఉంచుకోను… బరాబర్ తీర్చుకుని తీరతా!

– ఇప్పటికే లావుగా ఉన్నాను … మరి ఇంత లావు కావడం ఇష్టం లేదు
– నా గుండెపై కూర్చుని సీఐడీ చీఫ్ సునీల్ హత్యాయత్నం చేశారు
– ఇది నా ఒకటో పుట్టిన రోజే
– ముందస్తు ఎన్నికలు వస్తే తొందరగానే బాకీ తీర్చుకుంటా
– రెగ్యులర్ ఎన్నికలయితే బాకీ తీర్చుకోవడంలో కాసింత ఆలస్యం
– పొత్తుల్లో కీలకపాత్ర వహిస్తా
– ఈ పార్టీలో మాత్రం ఉండను…
– పొత్తు పార్టీలోనే ఉంటాను… అవి రెండా… మూడా అని అడగవద్దు
– ఉన్మాదిని సంతోష పెట్టడానికి నన్ను చిత్ర హింసలకు గురి చేశారు
– రాష్ట్రంలో పెరిగిపోతున్న హింస
– మద్యం, గంజాయినే దానికి కారణమా?
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

తాను ఎవరి బాకీ ఉంచుకోనని, ఖచ్చితంగా తీర్చుకుంటానని నరసాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఒక సినిమాలో చెప్పినట్లుగా బాకీ ఉంచుకుంటే లావైపోతారని అన్నట్లుగా తాను ఇప్పటికే లావుగా ఉన్నానని, ఇంకా లావు కావడం తనకు ఇష్టం లేదన్నారు. ముందస్తు ఎన్నికలంటూ జరిగితే 20 23 లోనే వారి బాకీ తీర్చుకుంటానని, ఒకవేళ సాధారణ ఎన్నికలయితే బాకీ తీర్చుకోవడంలో కాసింత ఆలస్యం జరుగుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

తన 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ఆయన మాట్లాడుతూ… గత ఏడాది తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన వందిమాగదులు ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎలా అరెస్టు చేశారో..

ఆ విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ నేతృత్వంలో విజయ్ పాల్ పర్యవేక్షణ లో అరెస్టు పేరిట ఎలా కిడ్నాప్ చేశారో రఘురామకృష్ణంరాజు మీడియాకు తెలియజేశారు.

తనపై ఎన్ని సార్లు దాడులు చేసినది, ఎవరు, ఎవరు ఈ దాడిలో పాల్గొన్నది, గుండె ఆపరేషన్ జరిగిన తన గుండె పై కూర్చొని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ హత్య యత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆవేదన భరి తంగా రఘురామ షేర్ చేసుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్, ఒక సీఐ ఎలా దాడి చేశారో స్పష్టంగా రఘు రామ వివరించారు. పోలీసు ముసుగులోని జగన్మోహన్ రెడ్డి గుండాలు తనపై దాడి చేస్తున్నప్పుడు, పుట్టినరోజే, తనకు గిట్టిన రోజు అవుతుందన్న భయాందోళనలు తనను వెంటాడాయని పేర్కొన్నారు.
తన కళ్ళకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి… గుంటూరులోని సీఐడీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సునీల్ కుమార్, విజయ పాల్ లు… పార్లమెంట్ సభ్యుడినైనా తనపై ఐదు రౌండ్ల పాటు వె దురు కర్ర, క్రికెట్ బ్యాట్ హ్యాండ్ లాంటి మరొక కర్రను తీసుకొని ప్రతి రౌండ్ కు 20 నుంచి 25 సార్లు సున్నితమైన ప్రదేశాల లో దెబ్బలు కొడుతూ, బండ బూతులు తిట్టారని చెప్పుకు వచ్చారు. దెబ్బలు కొట్టిన తర్వాత, లం..కొడుకా అంటూ అదే రూమ్ లో తనని నడిపించే ప్రయత్నం చేశారని రఘు రామా వివరించారు.

అంతటితో ఆగకుండా తన చేతనే తన ఇంట్లో తస్కరించిన సెల్ ఫోన్ ఓపెన్ చేయించారన్నారు. సెల్ ఫోన్ ఓపెన్ చేయించిన తర్వాత, తనని విడిచి పెడతారని అనుకున్నానని, కానీ అప్పుడే అకస్మాత్తుగా తన గుండెలపై సునీల్ కుమార్ కూర్చొని బాదడం జరిగిందన్నారు. తన గుండెలపై సునీల్ కుమార్ కూర్చున్న తీవ్రతకు తనని పడుకోబెట్టిన మంచం రెండు కోళ్లు విరిగిపోయాయని, దానితో తన అరికాల్లు రెండు పైకి లేవడం తో మళ్లీ మప్టి లో ఉన్న పోలీసులు బాదడం మొదలుపెట్టారని తెలిపారు. ఇక ఆ రాత్రి ఎవరు ఎప్పుడు వచ్చి బాదు తారోనని బిక్కుబిక్కుమంటూ గడిపానని, ఎప్పుడు నిద్ర పోయానో తనకే తెలియదన్నారు.

ఇక తనపై పోలీసులు ఆ రాత్రి చేసినదాడిని పూర్తిగా వీడియోలో చిత్రీకరించారని, దాన్నొక ఉన్మాది కి చూపిస్తే అతడు ఆనందపడతాడన్న ఉద్దేశంతో తనని ఉద్దేశపూర్వకంగా చిత్రహింసలకు గురి చేశారని రఘురామ వెల్లడించారు. ఆ ఉన్మాది ఎవరో మీ ఊహల కే వదిలేస్తున్నానని చెప్పారు

తనపై లాకప్ డెత్ ప్రయత్నం జరిగి ఏడాది కావో స్తుందని, ఇది తన 60వ పుట్టినరోజు అయినప్పటికీ, ఒకటో పుట్టిన రోజేనని చెప్పుకు వచ్చారు. అందుకే తాను చిన్న పిల్లవాడి తరహా లో ఉత్సాహంగా ఉంటూ, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులకు ప్రయత్నిస్తూ… పొత్తు లలో కీలకంగా వ్యవహరించి, ఈ దుర్మార్గపు పాలన కు చరమ గీతం పాడేందుకు కృషి చేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రానున్న ఎన్నికల్లో రెండు లేదా మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని, ఆ పార్టీలు ఎవని తనని అడగవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. ప్రస్తుతం తాను ఉన్న పార్టీలో మాత్రం ఉండనని, పొత్తులు పెట్టుకుని రెండు లేదంటే ఆ మూడు పార్టీల లో ఒక పార్టీలో ఉంటానని ఆయన వివరించారు.
నాయకులు భేషజాల ను వీడాలి

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాల మధ్య ఐక్యతను కోరుకుంటున్నారని, ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు భేషజాలకు వీడాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ప్రతి ఒక్కరికి ఎన్నో ఆకాంక్షలు ఉంటాయని అయితే ప్రజలు ఎవరికైతే అధిక ఓట్లను వేస్తారో, వారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. సింహం సింగిల్ గా వస్తుందని మంత్రులు, వైయస్సార్ పార్టీ నాయకులు సవాళ్లు చేస్తూ, ప్రతిపక్ష పార్టీలను కూడా సింగల్ గా పోటీ చేయమని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
అధికార పార్టీ నేతలు, మంత్రుల కవ్వింపు లకు ప్రతిపక్ష పార్టీ నాయకులు లొంగ రాదని, ప్రజల కోసం రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రుల కవ్వింపు లకు . ప్రతిపక్ష పార్టీల నాయకులు లొంగిపోయి , ఒంటరిగా పోటీ చేస్తే అనుకోని ఫలితాలే వెల్లడైతే… దేశ ముఖచిత్రంలో ఆంధ్ర ప్రదేశ్ చిత్ర పటం కనిపించదేమో నన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం తమ పార్టీని ఓడించేందుకు సిద్ధమయ్యారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.

సీఎం దావోస్ పర్యటన పై సెటైర్లు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన పై రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోమార్లు దావోస్ పర్యటన కు వెళ్లార ని, అయితే ఆయన దావోస్ పర్యటన పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇక ముఖ్యమంత్రి దావోస్ పర్యటన కు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే… ఆయన తనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణే తనతో చేతులు కట్టుకుని ఫోటో తీయించుకున్నారని గొప్పలు పోతున్న అమర్నాథ్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గోవింద్ రెడ్డి లను వెంటబెట్టుకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ క ళ్యాణ్ తరహాలోనే దావోస్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఫోటో తీసుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తో ఒక్కసారైనా ఫోటో దిగాలని ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 40 లక్షల మంది ఉంటారని, ఈసారి తాను కూడా పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి తానని చెప్పు కు వచ్చారు. అయితే అమర్నాథ్ మాదిరిగా కాకుండా తానే కళ్యాణ్ తో ఫోటో తీయించుకున్నా ని ప్రజలకు చెబుతానన్నారు. గతం లో మాదిరిగా చేతులు కట్టుకున్నట్లు కాకుండా, అవసరమైతే భుజం మీద చేయి వేసి ఫోటో దిగాలని పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నట్లు నవ్వుతూ చెప్పారు.

ఢిల్లీ లో ఉంచినా తన పని తాను చేస్తూనే ఉన్నాను

తన నియోజకవర్గానికి రానివ్వకుండా ఒకవైపు కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూనే, మరొకవైపు తనని అప్రతిష్టపాలు చేస్తోన్న జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను ఇంట్లో కూర్చోవడం లేదని, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు . ప్రతిరోజు మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నానని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు అప్పులను అడ్డుకుంటున్నాన ని తెలిపారు. ఈ మేరకు ప్రధానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక కార్యదర్శి, లేఖలు రాశానని, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాధన్ కలిసి వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అడ్డగోలుగా హింస పెరిగిపోతుందని, దానికి ప్రస్తుతము అమలులో అమ్మ మద్యం, గంజాయి నే కారణమని అన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు
తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేశారనీ, మరెంతో మంది తెలియ చేయాలని అనుకుంటున్నారని, అలాగే తనను అభిమానించే వారికి, ద్వేషించే ఆ నలుగురికి నమస్కారాలనీ రఘురామ అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో అమిత్ షా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనీ, అలాగే జానకి, నారా లోకేష్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారన్నారు.

తనని ఇంతవరకు ఎవరు ఎప్పుడు కొట్టలేదని, ఆ అవకాశం రాలేదని… ఎందుకంటే తానెప్పుడూ పరీక్షల్లో కాపీ కొట్టలేదని, పరీక్షా పత్రాలను అమ్మలేదని… ఫస్ట్ క్లాస్ లోనే పాసయ్యాననీ రఘు రామ అన్నారు. కానీ గత జన్మ దినోత్సవం రోజున తనని జగన్మోహన్ రెడ్డి తన వందిమాగదులు చేత కొట్టించార న్నారు.

 

LEAVE A RESPONSE