ఆంజనేయ కుమార్ ఐపిఎస్.. ఇతను మామూలోడు కాదు సామీ!

– యుపీలో ఆజం ఖాన్ పీఛమణిచిన మొనగాడు

ఇది సినిమా కథ కాదు. సినిమాల్లో చూపిస్తున్నట్లే నిజంగా జరిగింది.

ఉత్తరప్రదేశ్ లో ఆజం ఖాన్ మరియు యోగి ఆదిత్యనాథ్ మధ్య పోటీ అందరికీ తెలిసిందే. యోగి అతన్ని జైలుకు పంపాడు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అజామ్‌ను మోకాళ్ల మీదకు తెచ్చింది ధైర్యమైన ఆఫీసర్ ఆంజనేయ కుమార్ అని. అతన్నే రాంపూర్ ప్రజలు సింగం అని పిలుస్తారు.

ఆంజనేయ కుమార్ యుపిలో మౌ లో జన్మించారు. అతని తండ్రి మహేంద్ర సింగ్ స్కూల్ టీచర్. అతను పాఠశాలలో టాపర్ మరియు 2005 లో సిక్కిం కేడర్ ద్వారా మొదటి ప్రయత్నంలో IAS లో ఎంపికయ్యాడు. నియమితుడైన అన్ని శాఖలలో నిజాయితీగా పనిచేశాడు, అతను 2015లో బులంద్ షహర్ DMగా UPకి పంపబడ్డాడు, అక్కడ శాంతిభద్రతలను లైన్ లో పెట్టాడు. 2017లో ఫెతాపూర్‌కు పంపబడ్డాడు. అతని ట్రాన్స్ఫర్ర్ పై బులాద్ షహర్ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుని అలాంటి ఆఫీసర్ ని ఎప్పుడూ చూడలేదు అని కితాబు ఇచ్చారు.
అప్పుడే యూపీలో యోగి ప్రభుత్వం వచ్చింది. ఈ ఆఫీసర్ ఫతేఫుర్ లో ల్యాండ్ మాఫియా ఆట కట్టించాడు. ల్యాండ్ మాఫియా అనధికార కట్టడాలను పూర్తిగా కూలదోయించాడు.

ఫతేపూర్ నుండి 424 కిమీ దూరంలో రాంపూర్ జిల్లా. ఇది పేరుకి రాంపూర్, కానీ UPలోని హిందూ మైనారిటీ జిల్లా, 50% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న రాంపూర్ నగరానికి సమాజ్‌వాదీ పార్టీ పెద్ద నాయకుడు ఆజం ఖాన్ ఈ ప్రాంత రాజు. ఇతను సమజ్వాదీ వ్యవస్థాపక సభ్యుడు. రాంపూర్ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మారిన జనాభా నిష్పత్తి వల్ల రాంపూర్‌లో ఆయనను ఎవరూ ఓడించలేరు. అఖిలేష్ పాలనలో 2012-2017 నిజానికి ఇతనే యూపీ సీఎం అని అందరూ అనుకునే వారు. అతనికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు ఎత్తలేరు. ఆయన ఎక్కడ వేలు పెడితే ఆ భూమి అతనిస్వంత భూమి అవుతుంది. అంత పవర్ఫుల్.

అతని కొడుకు అబ్దుల్లా అజం కూడా తక్కువ వాడు కాదు, 2012-2017 మధ్య అతను రాంపూర్‌లో జోహార్ యూనివర్శిటీ అనే ముస్లిం యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు, 27 మంది రైతులకు చెందిన 170 ఎకరాల భూమి వారిని బెదిరించి వారి భూమిని లాక్కున్నాడు. వారిని వ్యతిరేకిస్తే చచ్చిపోతామని ఆ రైతులకు తెలుసు.

యోగి సిఎం అయ్యాక ల్యాండ్ మాఫియా నుండి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కబ్జా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. కానీ అతనికి అత్యంత కఠినమైన సవాలు విసిరింది రాంపూర్‌లో ఆజం ఖాన్. ఎవరైనా అతనిని ఎదుర్కోగలరు అంటే ఒక్క ఆంజనేయ కుమార్ మాత్రమే అని అధికారులు సూచించారు. యోగి సూచన మేరకు ఆంజనేయ కుమార్‌ను 2019లో రాంపూర్‌కు బదిలీ చేశారు.

రాంపూర్‌లో సురక్షితమైన లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం ఆంజనేయ కుమార్ మొదటి సవాలు. అతను శాంతిభద్రతలను కంట్రొల్ చేయడం ప్రారంభించాడు. అతని గురించిన వార్త ఆజం ఖాన్‌కు చేరినప్పుడు అతను ఆంజనేయ కుమార్ వద్దకు వెళ్లి అతన్ని బెదిరించాడు అయితే ఆంజనేయ కుమార్ లక్ష్య పెట్టలేదు.

2019 లోక్ సభ ఎన్నికల పూర్తి అయిన తర్వాత ఆంజనేయ కుమార్‌ చేత మాయవతి షూస్‌ క్లీన్‌ చేయిస్తానని ఆజం ఖాన్‌ బహిరంగంగా బెదిరించాడు. ఆ వీడియోను అన్ని మీడియాల్లో చూపించారు. కానీ 2019 ఎన్నికల్లో BJP మళ్లీ గెలిచింది, మోడీ మళ్లీ ప్రధాని అయ్యారు, అక్కడ నుండి అజం ఖాన్ చెడ్డ కాలం ప్రారంభమైంది.

ఆంజనేయ కుమార్ ఆజం ఖాన్ యొక్క ముఖ్య వ్యక్తులను అరెస్టు చేయడం ప్రారంభించి అతనికి వ్యతిరేకంగా బహిరంగ యుద్ధం ప్రకటించాడు. అతనికి మద్దతుగా యోగి మరో సింగం అజయ్ పాల్ శర్మను రాంపూర్ ఎస్పీగా పంపారు. జూన్ 22, 2019న, నాజిల్ అనే వ్యక్తి (అజం అనుచరుడు) 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశాడు. అజయ్ పాల్ శర్మ అతను పారిపోతూ ఉంటే కాలికి కాల్చాడు.

మొదట్లో ప్రజలు ఆజం ఖాన్‌ను అంటే భయపడ్డారు, కానీ ఆంజనేయ కుమార్ ఎదురు కాల్పులు వగైరా చర్యలతో వారికి ధైర్యం వచ్చింది. తమ భూమిని లాక్కున్న 27 మంది రైతులు ఆజం ఖాన్ పై ఆంజనేయ కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కోసమే ఇతను ఎదురు చూస్తున్నాడు.

అతను అజయ్ పాల్ శర్మతో కలిసి వెళ్లి, అజం ఖాన్‌ను అరెస్టు చేశాడు. ఈ చర్యతో అజం ఖాన్ బాధితులు చాలా మంది బహిరంగంగా వచ్చి అతనిపై ఫిర్యాదులు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. ఆంజనేయ కుమార్ మొత్తం 90 ఎఫ్‌ఐఆర్‌లతో అజం ఖాన్‌ను ఊపిరి సలపనీయకుండా చేసాడు.
ఎమ్మెల్యేగా ఉన్న అజంఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజం కోపంతో ఆంజనేయకుమార్‌ను ప్రతీకారం తీర్చుకుంటాం అని బెదిరించాడు. 2017 ఎన్నికల్లో అతని వయసును ఎక్కువ చూపించి ఎన్నికల్లో పాల్గొన్నాడని ఆంజనేయ కుమార్‌కు తెలిసింది. అతని వయస్సు 24 సంవత్సరాలు కాగా, ఎన్నికల్లో పోరాడేందుకు కనీస వయస్సు 25 సంవత్సరాలు.

అతన్ని కూడా అరెస్టు చేసి, అతని తల్లితో (ఆమె మరొక ఫోర్జరీ కేసులో నిందితురాలు) పాటు జైలులో పడేశాడు. దీంతో అతని ఎమ్మెల్యే రద్దు అయిపోయింది. అతని వద్ద నుంచి 2 పాన్ కార్డులు స్వాధీనం చేసుకుని అతనిపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఆజం ఖాన్ భార్య 10 నెలలు, కొడుకు 23 నెలలు కుటుంబం జైలు జీవితం గడిపారు. 23 నెలల తర్వాత అబ్దుల్లాకు బెయిల్ వచ్చింది, అజం ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నాడు.

ఆంజనేయ కుమార్ ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియా లీడర్ గా డిక్లర్ చేసి అతని పేరును స్టేట్ యాంటీ ల్యాండ్ మాఫియా పోర్టల్ లో పెట్టేసాడు. అతను రాంపూర్లో ఆజం ఖాన్‌ మాఫియా రాజ్యం పూర్తిగా నాశనం చేశాడు.

ఆజం ఖాన్ ఇతనితో బూట్లు శుభ్రం చేయిస్తా అని శపథం చేస్తే అంజనేయకుమార్ వాడిని జైలులో పడేసాడు.

సింఘం ఆంజనేయ కుమార్ ప్రస్తుతం మురాదాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. అతని సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి అతనికి 2 సంవత్సరాల పొడిగింపు ఇచ్చింది. ప్రస్తుతం ఆంజనేయ కుమార్ మురాదాబాద్‌ను చూసుకుంటున్నాడు.

కొసమెరుపు:

అజం ఖాన్ పై 90 FIR లు నమోదు అయితే అతనికి 86 కేసుల్లో మన మహా గౌరవనీయ కోర్టులు అజం ఖాన్ జైలులో ఉండనక్కర లేదు, స్వేచ్ఛ గా బయట తిరగవచ్చు అని బెయిల్ మంజూరు చేశాయి.

అతను బయటకు వద్దామని అనుకుంటూ ఉంటే, కోర్టులు బెయిల్స్ ఇస్తూ ఉంటే యుపి ప్రభుత్వం కొత్త కేసులు పెడుతూ లోపల ఉంచుతోంది అని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బిఆర్ గవాయి మరియు ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తన సమాధానం దాఖలు చేయాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది, మళ్ళీ మంగళవారం దీనిపై విచారిస్తామని పేర్కొంది. ”ఇది ఏమిటి? అతన్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదు. రెండేళ్ల నుంచి జైలులో ఉన్నాడు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని కోర్టు పేర్కొంది
కోర్టులు ఇలా చక్కగా నేరస్తులకు వెసులుబాటు ఇస్తూ ఉంటే నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఎలా పనిచేయగలరు. బెయిల్ మీద బయటకు వచ్చి ఇటువంటి ఆఫీసర్లను వీళ్ళు చంపెయ్యరు అని కోర్టులు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? రు.89 ఫ్రాడ్ చేసాడు అని ఒక పోస్ట్ మాన్ ని 29 సం. లు జైలులో ఉంచారు. ఇటువంటి ఆజం ఖాన్ లాంటి వారికి బెయిల్స్ ఎన్ని కావలసినా దొరుకుతాయి. ఆజం ఖాన్ కేసు వాదిస్తున్నది కాంగ్రెస్ లాయర్ కపిల్ సిబల్.
అర్థం అవుతోందా ఇప్పుడు మీకు…? నేరస్తుల గురించి వారిని సమర్ధించే వారి గురించి ?

– వీరభద్రం

 

Leave a Reply