Suryaa.co.in

Andhra Pradesh

మా నాయకుడు స్కిల్ కేసులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నేను నిరూపిస్తా

– నిరూపించగలరా? అని సజ్జల విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నా
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మా నాయకుడు స్కిల్ కేసులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాను నిరూపిస్తానని, చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎవరైనా నిరూపించగలరా? అని సజ్జల విసిరిన సవాల్ ను తాను నిరభ్యంతరంగా స్వీకరిస్తున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడిన మాటలు ..

చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు. ‘‘చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎవరైనా నిరూపిస్తారా’’? అని సజ్జల రామకృష్ణారెడ్డి విసిరిన ఛాలెంజ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను స్వీకరిస్తున్నాను. బహిరంగ చర్చ ఎప్పుడు పెడతారో సజ్జల వెంటనే ప్రకటించాలి. ‘‘చంద్రబాబను ఎత్తేసిన సంగతి నాకు తెలియదు, నేను లండన్ లో ఉన్నా’’నని జగన్ చెప్పడం పెద్ద అబద్ధం. ఆరోజు లండన్ నుండి డీఐజీ రఘురామిరెడ్డి, సీఐడీ ఛీఫ్ సంజయ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడింది నిజంకాదా?

ఈరకంగా చంద్రబాబును అరెస్టు చేస్తే.. జగన్ 43 వేల కోట్ల దోపిడీని వైఎస్ సహకరించినందుకు ఆయనకు ఎంతకాలం శిక్ష పడాలి? 17ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబుపై కేసే ఉండదంటే.. ఇంక కేసును రూపించాల్సిన అవసరమేముంది? చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారు. 11 ఏళ్ల నుండి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుండి తప్పించుకు తిరుగుతున్న జగన్.. కోర్టు విచారణ చేస్తే తన శేష జీవితమంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది. అవినీతి రహితుడైన చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారు.

వైసీపీ నాయకుడి అవినీతి ఎప్పుడో బట్టబయలైంది. మీ నాయకుడు మా నాయకుడిపై కక్ష పూరితంగా తప్పుడు కేసులు పెట్టారు. సజ్జల విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నాం. టైమ్, డేట్, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, లేదంటే మీ ఆఫీసులోనైనా సరే నేను సిద్ధం. చర్చకు నాతోపాటు పట్టాభి వస్తారు, మీరు ఎంతమందినైనా తెచ్చుకోండి. మాకెలాంటి అభ్యంతరం లేదు. అంబటి రాంబాబును తెస్తారా? తెచ్చుకోండి, లేక రోజా ను తెస్తారా తెచ్చుకోండి. ఇంకా ఎవరినైనా తెచ్చుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

న్యాయ నిర్ణేతలుగా సీనియర్ పాత్రికేయులు, నిష్ణాతులైన అడ్వకేట్ లను పెడదాం. బార్ అసోసియేషన్ ను కలిసి ఇద్దరు సీనియర్ న్యాయవాదులను ఇమ్మని కోరుదాం. నా సవాల్ విని సజ్జల పారిపోయి ఉంటాడు. రెండు రోజులు ప్రెస్ మీట్ లకు కూడా రారు. లండన్ నుండి రఘురామిరెడ్డి, సంజయ్, సజ్జలలను వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి కూడా నాకు ఏమీ తెలియదు, నేను అమాయకుడిని అనడం దెయ్యాలు వేదాలు వల్చించినట్లుంది. లండన్ లో ఉన్నాను, నాకు తెలియదని జగన్ ఆత్మసాక్షిగా చెప్పగలరా? సీఐడీ ఛీఫ్ సంజయ్ జగన్మోహన్ రెడ్డికి బాంఛన్ దొర.. నీ కాల్మొక్తా అనేలా ప్రవర్తిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుపై జగన్ పబ్లిక్ మీటింగ్ లో ఎగతాళిగా మాట్లాడటం తగునా? జగన్ ప్రభుత్వ కక్షలు, కార్పణ్యాలకు అంతే లేదా? జగన్ గురివింద గింజ సామెతను మరచిపోయి పతీవ్రతలా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ల నుండి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుండి తప్పించుకు తిరుగుతున్న మాట వాస్తవంకాదా? చంద్రబాబును అరెస్టు చేసిన విధానం కరెక్టు కాదని ప్రపంచమంతా కోడై కూస్తోంది.

సజ్జల చెప్పినట్లు చర్చకు రండి మేం సిద్ధం. జగన్ తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ స్కిల్ కేసును తెరపైకి తెచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను వదలం, ప్రస్తుతం చంద్రబాబు ను ఉంచిన బ్యారెక్ లోనే జగన్ ను పెడతామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE