దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా జగన్ రెడ్డి?
• అత్యాధునిక టెక్నాలజీతో టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలను తక్కువధరకే ప్రజలకు చేరువ చేయడమే జగన్ దృష్టిలో చంద్రబాబు చేసిన తప్పు
• ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తక్కువ ఖర్చుతో ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలు చేయడమే జగన్ రెడ్డి, సీఐడీ దృష్టిలో చంద్రబాబు చేసిన నేరం
• భారత్ నెట్ ఫేజ్-1 లోభాగంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను ఎలా అమలు చేసిందనే వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ జూలై18, 2019న వెల్లడించారు
• చంద్రబాబు ప్రభుత్వం ఫేజ్-1లో భాగంగా రాష్ట్రంలో 24వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసి, అందుకోసం కేవలం రూ.280 కోట్లు వెచ్చించి, ఒక్కో కిలోమీటర్ కు రూ.1,16,666ల ఖర్చు మాత్రమే పెట్టింది
• అదే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయడానికి దేశంలో అనేక రాష్ట్రాలు ఏపీ కంటే 100, నుంచి 250 శాతం అధికంగా ఖర్చుపెట్టాయి
• తక్కువ ఖర్చుతో కేబుల్ వేయడమే గాక, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ DWDMను చంద్రబాబు ప్రవేశపెట్టారు
• దేశంలోనే మొదటిసారి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక రాష్ట్రానికి టెలికం లైసెన్స్ దక్కింది
• లక్షలాది యువత జీవితాలు బాగుచేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై ఏ విధంగా నేటి ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో బురద జల్లుతోందో అదే విధంగా చంద్రబాబు కోట్లాదిరూపాయలు అదా చేసిన ప్రాజెక్ట్ పై విషం కక్కుతున్నారు
• రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక పునాదిగా అతి తక్కువ ఖర్చుతో చంద్రబాబు పూర్తి చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫలితాలు ఇప్పటికే మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
“ చంద్రబాబునాయుడిపై జగన్ రెడ్డి, అతని జేబు సంస్థ సీఐడీ పెట్టిన కేసులు తప్పని నిరూపించడానికి టీడీపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం చూస్తే అతనికి కళ్లు చెవులతో పాటు మెదడు కూడా పనిచేయడం లేదని అర్థమైందని, నెలరోజులకు పైగా ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ పై చేస్తున్న నిరాధార ఆరోపణ లకు సంబంధించి కట్టలకొద్దీ పత్రాలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, apskill devolopmenttruth.com వంటి వెబ్ సైట్ ను ప్రజల ముందు ఉంచామని అయిన ప్పటికీ ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయడం కూడా తెలియక, దానిలోని సమాచారాన్ని గ్రహించే జ్ఞానంలేకనే టీడీపీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సజ్జల పిచ్చికూతలు కూస్తున్నాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్లు, కొన్ని వందల డాక్యుమెంట్లు, ప్రజంటేషన్ల ద్వారా ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, మరియు ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాలకు సంబంధించిన పూర్తి వాస్తవాలను ప్రజల ముందు ఉంచింది. సజ్జలకు వెబ్ సైట్లు కూడా ఓపెన్ చేసి, వాస్తవాలను పరిశీలించే కనీసపరిజ్ఞానం లేకపోతే, తమ కార్యాలయానికి వస్తే పెద్ద డిజిటల్ స్క్రీన్ పై ఆధారాలు ప్రదర్శించి మరీ ఆయన నోరు మూయిస్తాం. తెలుగుదేశం పార్టీ బయటపెట్టే వాటికి సమాధానం చెప్పడం చేతగాక.. చేతిలో నీలిమీడియా ఉందని, తామేం చెప్పినా ప్రజలు నమ్ముతారని తాడేపల్లి ప్రధాన జీతగాడు సజ్జల, ముఖ్యమంత్రి అనుకుంటే కుదరదు.
ఏపీ సీఐడీ కొత్తగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై విచారణ నిమిత్తం, చంద్రబాబుని కస్టడీకి కోరడం చూస్తే విచిత్రంగా ఉంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా అమలుచేసి, ప్రజలకు ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ సౌకర్యం అందించడమే చంద్రబాబు చేసిన నేరమన్నట్టు జగన్ రెడ్డికి ఊడిగం చేసే సీఐడీ వాదిస్తోంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువఖర్చుతో ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడమే జగన్ రెడ్డి, సీఐడీ దృష్టిలో చంద్రబాబు చేసిన నేరం. ఇతర రాష్ట్ట్రాల్లా ప్రజల సొమ్ము వృథా చేయకపోవడ మే ఆయన చేసిన పెద్ద తప్పు?
భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఫేజ్-1 లో ఏఏ రాష్ట్రాలు ఎంతఖర్చుపెట్టి, ఎంతదూరం కేబుల్ వేశాయో కేంద్రమంత్రే పార్లమెంట్లో చెప్పారు
ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం తీసుకెళ్లాలనే సదుద్దేశంతో భారత ప్రభుత్వం భారత్ నెట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ ను ఫేజ్ -1, ఫేజ్-2 అని రెండుదశల్లో అమలుచేసింది. భారత్ నెట్ ఫేజ్ -1ను వివిధ రాష్ట్రాలు దేశంలో ఎలా అమలుపరుస్తున్నాయో సంబంధిత శాఖ మంత్రి మనోజ్ సిన్హా మార్చి15, 2017న ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే భారత్ నెట్ ప్రాజెక్ట్ ను తమకు తాముగా ఆచరణలో పెడతామని ముందుకొచ్చిందని మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. అలానే తక్కువ ఖర్చుతో కరెంట్ స్తంభాలద్వారా ఏరియల్ పద్ధతిలో ఆప్టిక్ ఫైబర్ నెట్ కేబుల్ వేస్తామని కూడా ఆ రాష్ట్రం చెప్పినట్టు చెప్పారు.
జూలై18, 2019న కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ లోక్ సభ సభ్యుడు నదీముల్ హక్ అడిగి న ప్రశ్నకు (అన్ స్టార్డ్ కొశ్చన్ నెం:2855) సమాధానంగా భారత్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1లో ఏఏ రాష్ట్రాలు, ఎన్నెన్ని కిలోమీటర్ల కేబుల్ వేశాయో, అందుకోసం ఎంతెంత ఖర్చు చేశాయో అంకెలతో సహా వివరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను తామే ఆచరణలో పెడతామని చెప్పకముందే, భారత్ నెట్ ప్రాజెక్ట్ పనుల్ని ఏపీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు అప్పగించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం అనేక కేంద్రప్రభుత్వ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అలా ఏపీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తెరపైకి తెచ్చింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం తమకు తాముగా వినూత్నంగా కరెంట్ పోల్స్ ద్వారా ఏరియల్ పద్ధతిలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ ను అతి తక్కువఖర్చుతో పూర్తిచేస్తా మని ముందుకొచ్చిందో అప్పుడు కేంద్రప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ను కేవలం విశాఖ, చిత్తూరు జిల్లాల్లోని కొంత భాగానికే పరిమితం చేసి, మిగతా రాష్ట్రమంతా తమ కు ప్రతిపాదించిన విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలుపరిచేలా అనుమతి నిచ్చింది.
ఆ విధంగా రాష్ట్రంలో దిగ్విజయంగా చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పూర్తై, అప్పటి గౌరవ రాష్ట్రప్రతి రామ్ నాథ్ కోవింద్ చేతులుమీదుగా డిసెంబర్ 2017లో ఆవిష్కరింపబడింది. దేశవ్యాప్తంగా కూడా భారత్ నెట్ ఫేజ్-1 ప్రాజెక్ట్ ని డిసెంబర్ 2017కి వివిధ రాష్ట్రాల్లో పూర్తి చేయడం జరిగింది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నివేల కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ భారత్ నెట్ ఫేజ్-1లో పూర్తిచేశారో, దానికి ఆయా రాష్ట్రాలుఎంతెంత ఖర్చు చేశాయో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్లో వెల్లడించారు.
దేశంలోని 15 రాష్ట్రాల్లో భారత్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1 అమలైన తీరు.. అందుకయిన ఖర్చు ఏపీతో పోలిస్తే దేశంలోనే అనేక పెద్దరాష్ట్రాలు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కు పెట్టిన ఖర్చు 100 నుంచి 250శాతం అధికం
పార్లమెంట్లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఏఏ రాష్ట్రాలు ఎంతదూరం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేశాయి .. అందుకు ఎంతెంత ఖర్చుపెట్టాయ నే వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1 లో భాగంగా ఏపీ ప్రభుత్వం (నాటి చంద్రబాబు ప్రభుత్వం) తన సొంత నిధులు రూ.280కోట్లు వెచ్చించి, 24వేలకిలోమీటర్ల కేబుల్ మరియు నెట్ వర్క్ నిర్వహణకు అవసరమైన POP’s వంటి ఇతర అత్యాధునిక సాంకేతిక పరికరాలు అమర్చడం జరిగింది. వాటన్నింటినీ కలిపి ఒక్కో కిలోమీటర్ కు కేవలం రూ.1,16,666ల ఖర్చు పెట్టింది.
అదే కర్ణాటక రాష్ట్రం 14,010 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మరియు ఇతర సాంకేతిక పరికరాలతో కూడిన వ్యవస్థకోసం, రూ.561 కోట్ల 57లక్షల 82వేల273లు ఖర్చుచేసింది. అంటే ఆ రాష్ట్రం ఒక్కోకిలోమీటర్ కు పెట్టిన ఖర్చు రూ.4,00,804 లు. ఏపీ కంటే కర్ణాటక ప్రతి కిలోమీటర్ కు 243.5శాతం ఎక్కువ ఖర్చుపెట్టింది.
చత్తీస్ ఘడ్ ప్రభుత్వం 13,189 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయడంకోసం రూ.514కోట్ల30లక్షల87వేల513లు ఖర్చుపెట్టింది. ఒక్కో కిలోమీటర్ కు ఆ రాష్ట్రం రూ.3,89,952లు ఖర్చుచేసింది. ఏపీతో పోలిస్తే 234.2శాతం ప్రతి కిలోమీటర్ కు అధికంగా చత్తీస్ ఘడ్ ప్రజలసొమ్ము దుబారాచేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 8,297 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.310కోట్ల40 లక్షల04వేల373లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.3,74,111లు వెచ్చించింది.
ఏపీతో పోలిస్తే బెంగాల్ కూడా ప్రతి కిలోమీటర్ కు 220.6 శాతం ఎక్కువ ఖర్చు పెట్టింది. మహారాష్ట్ర 33,530 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు, రూ.1238,85,28,424కోట్లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.3,69,475లు వెచ్చించింది. ఏపీతో పోలిస్తే ప్రతి కిలోమీటర్ కు మహారాష్ట్ర రూ.216.6 శాతం అధికంగా ఖర్చుపెట్టింది. మన పొరుగున ఉన్న తెలంగాణ 5,369 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థకోసం, 186,73,34,073 కోట్లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.3,47,799లు వెచ్చించింది.
ఏపీతో పోలిస్తే ప్రతి కిలోమీటర్ కు తెలంగాణ 198.1 శాతం అదనంగా ఖర్చుపెట్టింది. ప్రతిదానికి రోల్ మోడల్ గా చెప్పుకునే గుజరాత్ 15,708 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కోసం, రూ.367,60,07, 666కోట్లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.2,34,021లు వెచ్చించింది. ఆ విధంగా గుజరాత్ ఏపీ కంటే అదనంగా ప్రతి కిలోమీటర్ కు 100.5శాతం ఎక్కువ ఖర్చుపెట్టింది. మధ్యప్రదేశ్ 39,519 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేసినందు కు రూ.1357,67,89,575కోట్లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.3,43,550లు వెచ్చించింది.
ఏపీతో పోలిస్తే ఒక్కో కిలోమీటర్ కు 194.4శాతం అధికంగా మధ్యప్రదేశ్ ఖర్చుచేసింది. ఒడిశా 12,103 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ కోసం రూ.358,56 ,00,014 కోట్లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.2,96,257లు వెచ్చించింది. ఏపీతో పోలిస్తే ప్రతి కిలోమీటర్ కు 153.93శాతం అధికంగా ఖర్చుచేసింది . దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా 60,558 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థ కోసం, రూ.1437,67,56,686లు ఖర్చుపెట్టి, ఒక్కో కిలోమీటర్ కు రూ.2,37,404లు వెచ్చించింది.
ఏపీతో పోలిస్తే ఒక్కో కిలోమీటర్ కు రూ.103.4శాతం అధికంగా ఖర్చుపెట్టింది. ఈ విధంగా ఇప్పుడు మేంచెప్పిన వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడిం చిన సమాచారమే. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్టిన ఖర్చుకంటే చాలా తక్కువగా దాదాపు 1/4 శాతం వ్యయంతోనే చంద్రబాబు ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలుచేసి కేంద్రప్రభుత్వమే ముక్కున వేలేసుకునేలా చేశారు. తక్కువ ఖర్చుతో ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే గాక, ఏపీ ప్రభుత్వం దేశంలో తొలిసారి బీ.ఎస్.ఎన్.ఎల్ తర్వాత టెలికం లైసెన్స్ సాధించిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించి ‘797’ తో మొదలయ్యే ప్రత్యేక సిరిస్ తో టెలిఫోన్ సేవల్ని స్వయంగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని ఆనాడు నేషనల్ మీడియాలో కూడా పెద్దఎత్తున ప్రశంసాపూర్వకమైన కథనాలు వచ్చాయి.
ఈ విధంగా దేశం మెచ్చేలా, మిగతా రాష్ట్రాలు సిగ్గుపడేలా ప్రజలసొమ్ము పైసాపైసా ఆదాచేసి, ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు ఈ అవినీతి ముఖ్యమంత్రి దృష్టిలో నేరగాడు. కేవలం తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తిచేయడమే గాక, దేశంలోనే మొదటిసారి చంద్రబాబు DWDM (Dense Wavelength Division Multiplexing) అనే అడ్వాన్స్డ్ టెక్నాల జీ ఉపయోగించి, 24వేల కిలోమీటర్ల ఫైబర్ నెట్ ఆప్టిక్ కేబుల్ పూర్తిచేశారు. ఈ DWDM టెక్నాలజీని అప్పటివరకు మరే రాష్ట్రంలో వినియోగించలేదు.
కానీ తమ రాష్ట్రంలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు తలచి, సాధారణంగా ఇతర రాష్ట్రాలు వాడే IPMPLS, G-PON సాంకేతిక పరిజ్ఞానానికి అదనంగా హై లెవల్ టెక్నాలజీ అయిన DWDMసాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తీసుకొచ్చారు. తద్వారా ఎక్కువ బ్యాండ్ విడ్త్ తో కూడిన ఇంటర్నెట్ సేవల్ని రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలకే కాక గ్రామాలకు కూడా చేరవేశారు. ఆ విధంగా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా మిగతా రాష్ట్రాలకంటే అతి తక్కువ ఖర్చుతో అమలు చేయడమే గాక, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది.
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో చంద్రబాబునాయుడి దూరదృష్టి, ఆలోచనల్ని ప్రధాని మోదీనే మెచ్చుకున్నారు
చంద్రబాబునాయుడి దూరదృష్టి, ఆలోచనను మెచ్చుకొని, స్వయంగా దేశ ప్రధాని మోదీనే భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలు ఎలా చేయాలో, ఫేజ్-2లో ఇంకా తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఏపీని చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. విద్యుత్ స్తంభాలద్వారా కేబుల్ తీసుకెళ్లిన ఏపీ విధానంపై మిగతా రాష్ట్రాలు స్టడీ చేయాలని కూడా ప్రధాని మోదీ, నాటి కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి జే.ఎస్.దీపక్ చెప్పారు. దేశం గర్వించేలా చంద్రబాబు అమలు చేసిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందని బురద జల్లుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, అతని అవినీతి ప్రభుత్వం తాము వెల్లడించిన సమాచారంపై ఏం సమాధానం చెబుతారు?
పార్లమెంట్ సాక్షిగా అప్పటి కమ్యూనికేషన్ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పిన అంశాలపై జగన్ సర్కార్ ఏం సమాధానం చెబుతుంది? జగన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబు చేసిన నేరం ఏమిటంటే… దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో పూర్తిచేసి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడమే. విభజనానంతరం రాష్ట్రంపై ఆర్ధికభారం పడకూడదనే గొప్ప ఆలోచనతో తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడం బాబు చేసిన తప్పా?
లక్షలాది యువత జీవితాలు బాగుచేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై ఏ విధంగా నేటి ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో బురద జల్లుతోందో అదే బాటలో చంద్రబాబు కోట్లాది రూపాయలు ఆదాచేసి కార్యరూపం దాల్చేలా చేసిన గొప్పప్రాజెక్ట్ పై కూడా విషం కక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికే ఒక పునాదిగా చంద్రబాబు అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫలితాలు ఇప్పటికే ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
తనలాగా ప్రజల సొమ్ము తింటే జగన్ కు నచ్చుతారుగానీ… ప్రజల కోసం తక్కువ ఖర్చుపెట్టి, ఎక్కువ ప్రయోజనాలు అందించే చంద్రబాబునాయుడి లాంటి వాళ్లు ఎలా నచ్చుతారు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబునాయుడు చేసిన మంచేమిటో, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అయినా, మరోటైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా రాష్ట్రానికి ఎలా మేలు చేశారో తెలుసుకోవాలి” అని పట్టాభి రామ్ కోరారు.