Suryaa.co.in

Andhra Pradesh

ఇదేం ‘పంచాయతీ’ స్వామీ

మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే….

అసలే గ్రామ పంచాయితీలు ఆర్ధిక సమస్యలతో సతమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అన్ని పంచాయితీలకు ఒక్కో సచివాలయానికి 2 కంప్యూటర్లు 2 ప్రింటర్లు పంపారు. సచివాలయం ఉద్యోగులు ఆనంద పడ్డారు.

రెండు రోజులక్రితం ఒక జివో ఇస్తూ ఇచ్చిన కంప్యూటర్లకి ప్రింటర్లకు గ్రామ పంచాయితీ నిధుల నుంచి ఒక్కో కంప్యూటర్ కు రూ. 38,965/- ప్రింటరుకు ఒక్కోదానికి రూ. 10,943/- అంటే దాదాపు 50,000/- అనగా రెండింటికి కలిపి రూ. 1,00,000/- (ఒక లక్ష) చెల్లించండి అనగానే…పంచాయితీ కార్యదర్శులకు కళ్ళు తిరిగాయి.

అసలే పంచాయితీలు నిధులు లేక డీలా పడుతున్నాయి.ఫైనాన్స్ నిధులు ప్రభుత్వం దారి మళ్ళించింది. గతంలో పంచాయితీ వేరు సచివాలయం వేరు అంటూ ఒక జివో తెచ్చారు.జీతాలు ప్రభుత్వం ఇచ్చి సచివాలయాల్లో మౌలిక సదుపాయాలకు పంచాయితీల నుంచి నిధులు కేటాయించడమేంటి? పరిపాలన రాని వారు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ ప్రభుత్వంలో!

-శ్రీధర్

LEAVE A RESPONSE