Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్ పాత్ర ఉంటే ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వదిలేవాడా?

– కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో వార్తలు ఇస్తున్నాయి
– వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు.కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో వార్తలు ఇస్తున్నాయి. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు.సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకాక పోవడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏదో జరిగిపోతుందని కొందరు హడావుడి చేస్తున్నారు. తల్లికి సీరియస్‌గా ఉందనే సీబీఐ విచారణకు అవినాష్ హాజరు కాలేదు. మీడియా వెంట పడటం ఏంటో నాకు అర్థం కావడం లేదు.రామోజీ, రాధాకృష్ణలపై సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం.

వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉంటే ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వదిలేవాడా..? 5 సార్లు సీబీఐ ముందు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు తప్పించుకోవాలని అనుకుంటాడు..? సీబీఐ ఎదుటకు రేపయినా వెళ్లాల్సిందేగా.అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు.ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారు. ఒక వేళ ఎక్స్‌ ట్రీమ్‌గా వ్యవహరించినా ఫేస్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.

LEAVE A RESPONSE