Suryaa.co.in

Andhra Pradesh

బాబు, కొడుకు దళితులను అవమానిస్తే రామోజీ ఎందుకు రాయలేదు?

– దళితుల మీద ఎల్లో బ్యాచ్ కున్నది పగే కానీ ప్రేమ కాదు
– దళితులకు ఇన్ని పదవులు చరిత్రలో ఎప్పుడైనా దక్కాయా?
– ఈ నిజాలు రామోజీ, రాధాకృష్ణ కళ్ళకు కనిపించవా?
– టీడీపీ ఆరోపణలపై సమీక్షిస్తే.. మాపై తప్పుడు రాతలా?
– బాబు హయాంలో జరిగిన అరాచకాలు పచ్చ పత్రికలకు కనిపించవా..?
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

దళితుల మీద వీళ్ళకు ప్రేమ ఉందా?
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవముందని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు వచ్చి దళితుల మీద తన పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పాడు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పైన, మా పార్టీకి చెందిన దళిత కార్యకర్తలపైన రాళ్లదాడి చేయించాడు. పైగా మా దళితులే రౌడీలు, గూండాలు అంటూ మాపైన చంద్రబాబు, ఆయన ఎల్లో బ్యాచ్ నిందలు మోపుతుంది. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని చంద్రబాబు అన్నాడు.
బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. ఇప్పుడు మళ్లీ తన స్వార్థ రాజకీయ అవసరాలకు దళితులు, బీసీలు అంటున్నాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం, అవసరమైతే వాడుకోవడం.. అవసరం లేదంటే ఎగిరి తన్నడమే చంద్రబాబు సిద్ధాంతం. నయవంచన రాజకీయం చేయడమే చంద్రబాబు నైజం.
– అటువంటి వీళ్ళకు దళితులపైన ప్రేమ ఉందా..?
– దళితుల మీద రామోజీరావుకు ప్రేమ ఉందా..?
– దళితుల మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా..?
– దళితుల మీద లోకేశ్ కు ప్రేమ ఉందా..?
– చంద్రబాబు గతంలో ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా.. ? అని అడిగినప్పుడు, ఆ స్టేట్ మెంటును ఎల్లో మీడియాలో ఒక్క పత్రికలోగానీ, ఒక్క టీవీలో గానీ వేశారా?
– మొన్న లోకేశ్- ఏకంగా దళితులను అవమానిస్తూ స్టేట్ మెంటు ఇస్తే… ఎల్లో మీడియాలోని ఏ ఒక్కరైనా కనీసం ఆ స్టేట్ మెంటును తమ న్యూస్ లో టెలీకాస్ట్ చేశారా.. ? పేపర్లో వేశారా..?
– ఎందుకు వేయలేదు..?

దళితులకు ఇన్ని పదవులు ఎప్పుడైనా దక్కాయా?
– అలాంటి ఈ ఎల్లో బ్యాచ్ అంతా ఇప్పుడు, నిన్న జరిగిన మా ఎస్సీ సెల్ మీటింగు గురించి నిజాలు రాస్తారా..? లేక అబద్ధాలు రాస్తారా..? అని ప్రశ్నిస్తున్నాను.
– ఇంతవరకూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ దళితులకు దక్కనన్ని పదవులు మాకు దక్కింది ఈ నాలుగేళ్ళలోనే.
– మంత్రి మండలి కానివ్వండీ, నామినేటెడ్ పదవులు కానివ్వండీ.. ఆలయ బోర్డుల్లోనూ, ఏఎంసీల్లో పదవులు కానివ్వండీ.. ఉప ముఖ్యమంత్రి పదవులు కానివ్వండీ.. ఇన్ని పదవులు దళితులకు దక్కిన సందర్భం చరిత్రలోనే లేదు.
– 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వటం వల్ల, మా బిడ్డలకు ఈ నాలుగేళ్ళలో వచ్చినన్ని ఉద్యోగాలు, చంద్రబాబు 14 ఏళ్ళ పరిపాలనలో కూడా మాకు ఇవ్వలేదు.
– ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేయడమే తప్ప, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనేలేదు.
– రూ. 2.08 లక్షల కోట్ల డీబీటీలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు దక్కిన వాటా ఎంత అంటే- ఏకంగా 76 శాతం.

ఈ నిజాలు రామోజీ, రాధాకృష్ణలకు కనిపించవా?
– 2014-19 మధ్య ఎస్సీ సబ్ ప్లాన్ గా చేసిన ఖర్చు కేవలం రూ. 33 వేల కోట్లు అయితే.. ఇప్పటికే ఈ నాలుగేళ్ళ కాలంలోనే జగనన్న ప్రభుత్వం పెట్టిన ఖర్చు, అదీ ఎస్సీ సబ్ ప్లాన్ గా పెట్టిన ఖర్చుః రూ. 53 వేల కోట్లు.
– మరి ఇలాంటి నిజాలు రామోజీ కళ్ళకు, రాధాకృష్ణ కళ్ళకు, టీవీ5 కళ్ళకు కనిపించవా?
– 2014-19 మధ్య ఇళ్ళ స్థలాలే మా దళితులకు ఇవ్వలేదు కదా.. ?
– అలాంటిది 30 లక్షల ఇళ్ళ స్థలాల్లో దాదాపు 20 శాతానికి పైగా మాకే దక్కాయి అన్న నిజాన్ని ఏరోజూ ఎందుకు మాట్లాడరు..?

మా జాతితో మీకున్నది తగాదానేకానీ, స్నేహం కాదుః
– ఇంగ్లీషు మీడియం వద్దన్న వారికి మా జాతితో ఉన్నది తగాదానే తప్ప స్నేహం కాదు కదా…?
– అమరావతి భూముల్లో దళితుడు ఇల్లు కట్టకూడదన్న పార్టీలో, పేదలకు ఇళ్ళ స్థలాలు వీల్లేదన్న పార్టీతో మాకున్నది యుద్ధమే తప్ప, స్నేహం కాదు కదా..?
– ఈనాడు పత్రికలో చూస్తే దళితులపై తప్పుడు కథనాలు రాశారు. మేమే రామోజీరావుకు అంత తేలికగా కనిపిస్తూ ఉన్నామా..? చంద్రబాబును ఎత్తుకోవాలి. దళితుల్ని తక్కువగా హీనంగా చూపించాలనే దారుణ ప్రయత్నానికి రామోజీరావు ఒడిగడుతున్నాడు.
– చంద్రబాబు తాను అధికారం వెలగబెట్టిన 14 ఏళ్ల కాలంలో దళితుల పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. మా కులప్రస్తావన తెచ్చాడు. దళితుల హక్కుల్ని కాలరాశాడు.
– దళితులపై అఘాయిత్యాలు, దాడులు చేయించాడు. మాకు కేటాయించిన అసైన్డ్‌భూముల్ని లాక్కొన్నాడు. మేం నిలువ నీడలేక అలో లక్ష్మణా.. అంటూ కిరాతక టీడీపీ ఎప్పుడు అధికారంలో నుంచి దిగిపోతుందా..? అని మా జాతి అంతా ఏకమై టీడీపీకి రాజకీయంగా పాడె కట్టింది.

టీడీపీ ఆరోపణలపై సమీక్షిస్తే.. మాపై తప్పుడు రాతలా?
– నిన్న మా ఎస్సీ సెల్ మీటింగ్ లో టీడీపీ ఏం ఆరోపణలు చేస్తుందన్నది- మేం సమీక్షించుకుంటే, ఆ ఆరోపణలన్నీ మా మాటలుగా రాసిన రామోజీరావుకు, ఎవరి మీద ప్రేమతో ఈ దుర్మార్గం చేశాడో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది.
-ఇవన్నీ కుట్రలో భాగమే తప్ప.. ప్రేమలో భాగం కావు.
– నిన్న జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సమావేశంలో మేమంతా కలిసి రాష్ట్రంలో పరిపాలన ఏవిధంగా సాగుతుంది..? షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల తరగతులకు సంబంధించి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం మేరకు ఏ విధంగా ముందుకెళ్లాం.? ఏ ప్రభుత్వం హయాంలో దళితులకు మేలు, సాయం జరిగింది..? ప్రత్యేకంగా ఆనాడు చంద్రబాబు ఏం చేశాడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాకు ఏవిధమైన సంక్షేమాన్ని అందజేస్తున్నారనే విషయంపై చర్చిస్తే.. వాటి గురించి రాయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతికి చేతులు కదల్లేదు.

రామోజీకి రాజకీయాలెందుకు?
ఒక ముసలి నక్కలా ఉన్న రామోజీరావు ఈనాడు పత్రికను నడుపుతూ కుట్ర రాజకీయాలు చేయడమేంటి..? ప్రజాస్వామ్యంలో జర్నలిజమన్నా.. జర్నలిస్టులన్నా మాకు చాలా గౌరవం ఉంది. జర్నలిస్టులను గౌరవ మర్యాదలతో చూస్తాం. ఎందుకంటే, మేము పేదవాళ్లకు అండగా ఉండే వాళ్లం కనుక మాకు అందరూ సహాయం చేస్తారనే ఆలోచనతో మేముంటాం. పత్రికలు, పత్రికల్ని నడిపే అధిపతులు రాజకీయాలు నడుపుతారని మేమెప్పుడూ అనుకోలేదు. అయితే, నేడు ఈనాడు అధిపతి రామోజీరావు మాత్రం తన పత్రికను అడ్డంపెట్టుకుని పూర్తిగా రాజకీయమే నడుపుతున్నాడు. ‘దళితులు పీకిందేమీలేదు..’అని లోకేశ్‌ అంటే ఈ రామోజీరావుకు, మిగతా ఎల్లోమీడియాకు కనిపించలేదా..? అని అడుగుతున్నాను. దీనికి ఎల్లోమీడియా అధిపతులంతా సమాధానం చెప్పాలి.

బాబు అరాచకాలు పచ్చ పత్రికలకు కనిపించవా..?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దళితులపై జరిగిన అరాచకాలు, దారుణాలు ఒకటీ రెండు కాదు. అనేకం చోటు చేసుకున్నాయి. ఏ ఒక్క ఘటనపైన కూడా చంద్రబాబు స్పందించలేదు. ఈ పచ్చమీడియా రాయలేదు. శ్రీకాకుళం జిల్లాలోనైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బహిరంగంగా ఒక మహిళా అధికారిని మోకాలితో తంతే ఈ పచ్చ పత్రికలు రాయవు. జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారు. అమలాపురంలో మా దళిత కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. గగరపర్రులో 400 దళిత కుటుంబాల్ని వెలి వేశారు. ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌ దగ్గర్నే మా వాళ్లను చంపారు.
గుంటూరు జిల్లాలో రవికుమార్‌ను దారుణంగా హత్య చేశారు. ప్రకాశం జిల్లా దేవరాపల్లెలో వందల ఎకరాలు దళితులు సాగుచేసుకుంటున్న భూముల్ని లాక్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో మా దళితులపై బహిరంగ దాడులు చేశారు. కర్నూలు జిల్లాలో వసంతరావు అనే దళితుడ్ని బహిరంగంగా చంపించారు. చిత్తూరు జిల్లాలోనూ, కుప్పంలోనూ రెండు గ్లాసుల విధానం పెట్టి దేవాలయాల ప్రవేశం కల్పించకపోతే ఏనాడూ చంద్రబాబు నోరుతెరిచి మాట్లాడలేదు. ఈ పచ్చపత్రికలు ఒక్క వార్తకూడా రాయలేదు. కడప జిల్లాలో మీ పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి దళితుల్ని నీచంగా మాట్లాడితే బాబు నోరు మూగబోయింది. ఈనాడు రామోజీరావు కూడా కళ్లులేని కబోధిలా మారాడు.

రామోజీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు గురించి రాశావా?
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇప్పటికీ దళితుల భూములున్నాయి. నేను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు కోకొల్లలుగా ఫిర్యాదులొస్తే ఎంక్వైరీ చేశాను. ఆ విషయాన్ని ఈనాడు ఎందుకు రాసుకోలేదు. ఇప్పుడు అయినా రాసే దమ్మూ ధైర్యం ఉందా..? అని ప్రశ్నిస్తున్నాను. రాజధాని ప్రాంతంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారికే భూములుండాలని, దళితులకు ఇళ్ళ పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇం బ్యాలెన్స్‌ వస్తుందని మాట్లాడుతుంటే.. రామోజీరావు ఎందుకు రాయలేకపోతున్నాడు..? మేం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో చదివితే మీకెందుకు అంత కడుపు మంట..?
– రామోజీ, రాధాకృష్ణ మనువళ్లు ప్రయివేటు స్కూళ్లల్లో ఇంగ్లీషు చదువుకోవచ్చా.. పేదల పిల్లలకు ఇంగ్లీషు వద్దా..?
– ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి – పంచుకోవడానికి, చంద్రబాబుకు వత్తాసు పలకడానికి మాత్రమే ఎల్లోమీడియా పనిచేస్తుందనేది ప్రజలు గుర్తించారు.
– చంద్రబాబును భుజానికెత్తుకుని, రామోజీరావు, రాధాకృష్ణలు పెద్ద గజదొంగలుగా వ్యవహరించడం ఇప్పటికైనా మానుకోవాలని .. దళితులను చిన్నచూపుతో తేలికగా తీసుకుంటే మీకు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరిస్తున్నాను.

దళితుల ఆరాధ్యదైవం జగన్‌
ఆనాడు మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకు బ్రహ్మండమైన సాయం అందిస్తే.. ఈరోజు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పేద, బడుగు బలహీనవర్గాల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి మంత్రిమండలిలో గానీ, కార్పొరేషన్ల ఛైర్మన్‌ల పదవుల్లో గానీ మా భాగస్వామ్యం అధికంగా ఉంది. దేవాలయాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేసి మాకు రాజ్యాంగ భరోసానిచ్చి సామాజిక విప్లవానికి తెరదీసిన నాయకుడు ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .
– చంద్రబాబు దళితులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతుంటే, రామోజీరావు మాత్రం దొంగ రాతలు రాయిస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నారు. కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడించి నమ్మించాలని ప్రయత్నిస్తే అవన్నీ ప్రజలకు తెలియదా..? అని అడుతున్నాను.
– మా నాయకుడు జగన్‌గారు అధికారంలో వచ్చాక, ఎస్సీ, ఎస్టీలకు ఒక్క పెన్‌స్ట్రోక్‌తో దాదాపు 3 లక్షల 2వేలకు పైగా ఉద్యోగాలిచ్చారు. అదే బాబు ఉన్నప్పుడు ఏ ఒక్క ఉద్యోగమైనా ఇవ్వకపోతే రామోజీరావు, రాధాకృష్ణలు ఎందుకు వాళ్ల పత్రికల్లో రాయలేకపోయారు..? అని నిలదీస్తున్నాను.

LEAVE A RESPONSE