చంద్రబాబు రాష్ట్రమంతా వెలుగులునింపితే.. జగన్ రెడ్డి వాటిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని చీకట్ల పాలు చేయనున్నాడు
• జగన్ నిర్వాకంతో వీధిదీపాల ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కి, రేపట్నుంచి రాష్ట్రం చీకట్లపాలు కానుంది
– నాడు 24లక్షల ఎల్.ఈ.డీ వీధిదీపాలతో రాష్ట్రంలో కాంతులు విరజిమ్మిన చంద్రబాబు సర్కార్. నేడు కేంద్రసంస్థ ఈ.ఈ.ఎస్.ఎల్ కు.651.55కోట్లు బకాయిపెట్టి, ఆ వీధి దీపాలను ఆర్పేస్తున్న జగన్ రెడ్డి.
• జగన్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రంలో మరోగొప్ప ప్రాజెక్ట్ అటకెక్కింది.
• ఎల్.ఈ.డీ లైట్లతో నాడు చంద్రబాబు రాష్ట్రమంతా వెలుగులునింపితే, నేడు జగన్ రెడ్డి వాటిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని చీకట్లపాలు చేయనున్నాడు.
• జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ.ఈ.ఎస్.ఎల్ (ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సంస్థ తమకు రావాల్సిన బకాయిలకోసం పోరాడుతూనేఉంది.
• నేటికి ఈ.ఈ.ఎస్.ఎల్ కు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము అసలు రూ. 522.74కోట్లుఅయితే, మరో 128.81కోట్లుసకాలంలో కట్టనందుకు పడిన జరిమానా. మొత్తంకలిపి రూ.651.55 కోట్లు చెల్లించాల్సి ఉంది.
• బకాయిలు తక్షణమేచెల్లించాలని, లేకపోతే వీధిదీపాల నిర్వహణ ఒప్పందాలను రద్దుచేసుకుంటామని ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ జగన్ సర్కార్ కి జూన్ 9న సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా నోటీసులిచ్చింది.
• దాదాపు 24లక్షల ఎల్.ఈ.డీ వీధిదీపాల ఏర్పాటు నిర్వహణకు జగన్ సర్కార్ కేంద్రసంస్థ ఈ.ఈ.ఎస్.ఎల్ కు సకాలంలో డబ్బు చెల్లించనందున భవిష్యత్ లో అవి ఆరిపోనున్నాయి.
• లక్షలకోట్ల అప్పులుతెస్తున్న జగన్ సర్కార్, ఈ.ఈ.ఎస్.ఎల్ కు చెల్లించాల్సిన రూ.651.55 కోట్లు 4ఏళ్లుగా ఎందుకు చెల్లించలేదు?
• వైసీపీసర్కార్ కు దోచుకోవడం దాచుకోవడంతప్ప, ఇలాంటిప్రాజెక్ట్ లకు నిధులు చెల్లించాలనే ఇంగితంలేకపోవడంతో, మొత్తంగా రాష్ట్రమే చీకట్లపాలు కానుంది.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్వాకంతో, చంద్రబాబునాయుడు రాష్ట్రహితంకోసం చేపట్టిన అనేకప్రాజెక్ట్ లను అటకెక్కాయని, ఆ కోవలో తాజాగా ఎల్.ఈ.డీ వీధి దీపాలప్రాజెక్ట్ చేరిందని, టీడీపీప్రభుత్వం గతంలో దేశంలో మరేరాష్ట్రం అమలుచేయని విధంగా ఏపీలో వీధిదీపాలప్రాజెక్ట్ దిగ్విజయంచేసిందని, అలాంటిప్రాజెక్ట్ ను నిర్వీర్యంచేసిన జగన్, రాష్ట్రాన్ని చీకట్లపాలుచేశాడని టీడీపీ జాతీయఅధికారప్రతి నిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే…
“ ఎల్.ఈ.డీ వీధిదీపాలు ఏర్పాటుచేయడంవల్ల గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో మంచికాంతి ఉండటంతోపాటు, విద్యుత్ వినియోగం కూడా ఆదాఅవుతుంది.
సాధారణ లైట్లతోపోలిస్తే, ఎల్.ఈ.డీ విద్యుత్ దీపాలు విద్యుత్ వాడకాన్ని తక్కువ తీసుకుంటాయి. వీధిదీపాలఏర్పాటుకు పంచాయతీలు, కార్పొరేషన్లు,మున్సిపాలి టీలకు తక్కువఖర్చు అవుతుంది. ఆ విధంగా మిగిలినసొమ్ముని ఇతరప్రజప యోగ కార్యక్రమాలకు ఖర్చుపెట్టడానికి వీలుంది. ఏ గ్రామ, పట్టణ, నగరాభివృద్ధికి అయినా వీధిదీపాలు సంకేతంగా నిలుస్తాయని చెప్పడం అతిశయోక్తికాదు.
చంద్రబాబు హాయాంలో లోకేశ్ పంచాయతీరాజ్ శాఖమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో దాదాపు 24లక్షల ఎల్.ఈ.డీ వీధిదీపాలు ఏర్పాటుచేశారు. దేశంలోనే మూడోవంతు ఎల్.ఈ.డీ లైట్ల ఏర్పాటుతో చంద్రబాబుప్రభుత్వం ఆనాడు సరికొత్త రికార్డులుసృష్టించింది.
కేంద్రప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబునాయుడు, వీధిదీపాలప్రాజెక్ట్ ను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలుచేశారు. అప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రిగా ఉన్న టీడీపీజాతీయప్రధాన కార్యదర్శి లోకే శ్ కూడా వీధిదీపాలప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన నిర్దేశక త్వంలో వీధిదీపాలుఏర్పాటుచేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా అమ లైంది. అటువంటి గొప్పప్రాజెక్ట్ కేంద్రప్రభుత్వసంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈ.ఈ.ఎస్.ఎల్) ను నాలుగు పీ.ఎస్.యూ.లు కలిపి ఏర్పాటుచేశాయి.
ఆ నాలుగు పీ.ఎస్.యూ.లు ఏమిటంటే ఎన్.టీ.పీ.సీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొ రేషన్ లిమిటెడ్ లు. ఈ నాలుగుసంస్థలుకలిసి దేశవ్యాప్తంగా వీధిదీపాలుఏర్పాటు చేయడంకోసం ఈ.ఈ.ఎస్.ఎల్ ను ఏర్పాటుచేశాయి. గౌరవ ప్రధాని మోదీ ప్రారంభించిన ఎన్.ఎమ్.ఈ.ఈ.ఈ (నేషనల్ మిషన్ ఆఫ్ ఎన్ హాన్స్ ఎనర్జీ అఫీషియ న్సీ) మిషన్లో స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ చాలాకీలకమైందిగా నిలిచింది. స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ పర్యవేక్షణకోసం నోడల్ ఏజెన్సీగా ఈ.ఈ.ఎస్.ఎల్ ను ఏర్పాటు చేయడంజరిగింది.
దానిద్వారా చంద్రబాబు రాష్ట్రంలో 23,69,000 ఎల్.ఈ.డీ వీధిదీపాలు ఏర్పాటుచేయడం జరిగింది. దానికి సంబం ధించి రెండుఒప్పందాలు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 10లక్షలవీధిదీపాలు అమర్చేలా 17-07-2017న ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థతో మొదటి ట్రైపాట్ ఒప్పందం చేసుకున్నారు. తరువాత 27-12-2018న మరో 11,90,000 వీధిదీపాలు ఏర్పా టుకు ఒప్పందం చేసుకున్నారు. రెండుఒప్పందాల ద్వారామొత్తం రాష్ట్రంలో 21,90,000 వీధిదీపాలు ఏర్పాటుచేయడం జరిగింది. తరువాత అవిసరిపోలేదని మరో 1,79,000 వీధిదీపాల ఏర్పాటుకు మరోఒప్పందం ఈ.ఈ.ఎస్.ఎల్ తో చేసుకున్నారు.
మొత్తంగా 23,69,000 వీధిదీపాలను అమర్చారు. ఇదిదేశంలోనే రికార్డ్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా అమర్చిన ఎల్.ఈ.డీ దీపాల్లో మూడోవంతు ఏపీలోనే అమర్చారు. తద్వారా సంవత్సరానికి 300మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాతోపాటు, రూ.180కోట్ల విద్యుత్ ఖర్చుకూడా తగ్గనున్నట్టు ఆనాడు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగాఉన్న నేటి ప్రభుత్వప్రధానకార్యదర్శి జవహర్ రెడ్డి నాడు తెలియచేశారు.
అంతేకాకుండా నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాఉన్న నారాలోకేశ్ గారి కృషి ఈప్రాజెక్ట్ అమల్లో ఎంతగానో ఉందని కొనియాడారు. ఆరోజున జవహర్ రెడ్డి తోపాటు, రాష్ట్రఇంధనశాఖకార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ కూడా ఈ ప్రాజెక్ట్ ను కీర్తించారు. అలాంటి గొప్పప్రాజెక్ట్ జగన్ ప్రభుత్వంలో పూర్తిగా అటకెక్కింది.
వీధిదీపాలఏర్పాటుకు ఈ.ఈ.ఎస్.ఎల్ విభాగంపెట్టినఖర్చుని రాష్ట్రప్రభుత్వం ఏటా కొంత మొత్తంచొప్పున తిరిగి చెల్లించాలి. ఎల్.ఈ.డీ విద్యుత్ దీపాలఏర్పాటుతో ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలరూపంలో మిగిలినసొమ్ములో 80శాతం సొమ్ముని ఈ.ఈ.ఎస్.ఎల్ కు ప్రతిఏటా చెల్లించాలి.
ఈ విధంగా టీడీపీప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 23,69,000వీధిదీపాలు అయినఖర్చుని రాష్ట్రప్రభుత్వం ఏటా కొంతచొప్పున ఈ.ఈ.ఎస్.ఎల్ కు వారుపెట్టిన పెట్టుబడికింద చెల్లించాలి. కానీ దురదృష్టవశాత్తూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్, ఈ.ఈ.ఎస్.ఎల్ కు నగదుచెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది.
జగన్ సర్కార్ తమకుఇవ్వాల్సిన రూ.651.55కోట్లు చెల్లించాలని ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ ఎన్నిసార్లు కోరినా ముఖ్యమంత్రి, సంబంధితశాఖ మంత్రి స్పందించలేదు. దాంతో చివరకు సదరు సంస్థ లీగల్ నోటీసులు జారీచేసింది. తక్షణమే బకాయిలుచెల్లించకపోతే గతంలో రాష్ట్రప్రభుత్వంతో చేసుకున్న ఎల్.ఈ.డీ వీధిదీపాల ఒప్పందాలు రద్దుచేస్తామని హెచ్చరించింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పైసాకూడా ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థకు చెల్లించలేదు. ఆ విధంగా ఏపీప్రభుత్వం చెల్లించాల్సిన రూ.651.55కోట్లకు సంబంధించి, ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ జగన్ ప్రభుత్వానికి కొత్తగా నోటీసులిచ్చింది. గతంలో ఏపీప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 24లక్షల వీధిదీపాల ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను రద్దుచేస్తామని, జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ జగన్ సర్కార్ కు లీగల్ నోటీసులు ఇచ్చింది. తమకురావాల్సిన బకాయిలు ప్రభుత్వాన్ని అడిగిఅడిగి అలిసి పోయామని వాపోయిన ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేతగానితనాన్ని ఎత్తిచూపుతూ లీగల్ నోటీసులు పంపింది.
చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్.ఈ.డీ వీధిదీపాలప్రాజెక్ట్ ను నీరుగార్చిన ఘనత ఈముఖ్య మంత్రికే దక్కింది. జగన్ నిర్వాకంతో రేపట్నుంచి రాష్ట్రంలోని 24లక్షల వీధిదీపాలు ఆరిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. గ్రామ, పట్టణ, నగరా ల్లోని వీధులు చీకటిమయం కావడానికే జగన్ ఈ విధంగా వ్యవహరించాడు.
ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసు కుంటామంటూ ఏపీప్రభుత్వానికి ఇచ్చిననోటీసులో చాలాస్పష్టంగా తమకు రూ.651.55కోట్లు రావాల్సి ఉందనిచెప్పింది.
వీటిలో 522.74కోట్లు అసలు ఇన్ వాయిస్ కిందఅయితే, మరో128.81కోట్లు ఆలస్యం చేసినందుకు వేసిన జరిమానాగా సదరుసంస్థ నోటీసులో పేర్కొంది. ఈమొత్తం సొమ్ము తమకు సకాలంలోచెల్లించకపోతే, ఏపీలో వీధిదీపాలనిర్వహణ ప్రాజెక్ట్ ను పక్కన పెడతా మని, గతంలో చేసుకున్నఒప్పందాలు రద్దుచేసుకుంటామని తేల్చిచెప్పింది.
జగన్ ప్రభుత్వం ఎంతకీ తమబకాయిలు చెల్లించకపోవడంతో చివరకు గత్యం తరం లేకనే ఈ.ఈ.ఎస్.ఎల్ విభాగం ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సందర్షి సంజయ్ ద్వారా జూన్9న వైసీపీసర్కార్ కి లీగల్ నోటీసులు జారీచేసింది. ఈ.ఈ.ఎస్.ఎల్ విభాగంవారు తమకురావాల్సిన బకాయిలకోసం గతంలో పంచాయతీ రాజ్ శాఖమంత్రిగా ఉన్న పెద్దిరెడ్డితో అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. జూన్30, 2020న మంత్రిపెద్దిరెడ్డితో సమావేశమైన ఈ.ఈ.ఎస్.ఎల్ అప్పటివరకు తమకు రావాల్సిన రూ.164కోట్లు తక్షణమే చెల్లించాలని కోరితే, జూలై ఆఖరులో చెల్లిస్తామని మంత్రి హామీఇచ్చారు.
31-03-2021న మరోసారి సమావేశమైనప్పుడు రూ.316కోట్లు చెల్లించాల్సి ఉంటే, దానికి సంబంధించి ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ మరలా లేఖరాసింది. జూన్ 2021నాటికి ఆ బాకీ కాస్త రూ.340కోట్లకు చేరితే, మరలా ప్రభుత్వానికితక్షణమే తమబాకీచెల్లించాలని డిమాండ్ చేస్తూ లేఖరాశారు. అయినాకూడా ఏపీప్రభుత్వం స్పందించలేదు. గతంలో చెల్లిస్తామన్న తేదీలు వేటికీ జగన్ ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోగా, దుర్మార్గంగా తిరిగి ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థనే తప్పుపడుతూ, వీధిదీపాలు సరిగా పెట్టలేదని ఎదురు నోటీసులిచ్చింది.
దానిపై ఈ.ఈ.ఎస్.ఎల్ పూర్తివాస్తవాలతో వివరణఇవ్వడంతో జగన్ సర్కార్ నోరుమూతపడింది. ఇలా ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థకు, ఏపీప్రభుత్వానికి మధ్య అనేకసార్లు జరిగినచర్చలు, లేఖల సంప్రదింపులు విఫలమైనతర్వాతే విసిగిపోయి, సదరుసంస్థ ఈ సంవత్సరం జూన్ 9న లీగల్ నోటీసులిచ్చింది.
ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థకు ఏపీప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై అప్పటి పంచాయతీరాజ్ మంత్రిపెద్దిరెడ్డి, ఇప్పటిమంత్రి బూడిముత్యాలనాయుడు ఏం సమాధానంచెబుతారు?
రాష్ట్రంలో ఎక్కడవీధిదీపం వెలగకపోయినా ప్రభుత్వానికి తెలిసేలా చంద్రబాబు ఎలర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటుచేసి, రాష్ట్రమంతా వెలుగులునింపారు. రాష్ట్రంలో ఏసమయానికి ఎన్నిఎల్.ఈ.డీ వీధిలైట్లు ఆన్ అయ్యాయి.. ఏ టైమ్ కి వాటిని ఆపేశారనే వివరాలు తెలిసేలా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాంటిప్రాజెక్ట్ ను గతంలో పంచాయతీరాజ్ శాఖమంత్రిగాఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూకుమ్మడిగా నాశనంచేశారు.
జగన్ నిర్వాకంతో వీధిదీపాల ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కి, రేపట్నుంచి రాష్ట్రం చీకట్లపాలు కానుంది. లక్షలకోట్ల అప్పులుతెస్తున్న జగన్ సర్కార్, ఈ.ఈ. ఎస్. ఎల్ కు చెల్లించాల్సిన రూ.651.55కోట్లు 4ఏళ్లుగా ఎందుకు చెల్లించలేదు ఈ.ఈ.ఎస్.ఎల్ నోటీసులపై అప్పటి పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి, ఇప్పటి మంత్రి, ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలనాయుడు ఏంసమాధానంచెబుతారు?
కేంద్రప్రభుత్వ సంస్థ ఈ.ఈ.ఎస్.ఎల్ బకాయిలకోసం ఏపీప్రభుత్వానికి నోటీసులి వ్వడం, ముఖ్యమంత్రికి సిగ్గుచేటుకాదా? రాష్ట్రప్రతిష్టను ఇలాదిగజారుస్తే భవిష్యత్ లో ఏ కేంద్రప్రభుత్వ సంస్థలుఅయినా రాష్ట్రానికి నిధులు ఇస్తాయా?
ఎల్.ఈ.డీవీధిదీపాల ప్రాజెక్ట్ టీడీపీప్రభుత్వం ఎంతసమర్థవంతగా అమలు చేసిందో అప్పటి పంచాయతీరాజ్ శాఖకార్యదర్శి, ఇప్పటిరాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి బాగాతెలుసుకదా! వీధిదీపాలఏర్పాటుతో ప్రతిసంవత్సరం ప్రభుత్వానికి రూ.180కోట్లు ఆదాఅవుతాయని, 300మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని ఆయనేగతంలో చెప్పారుకదా! అన్నితెలిసినవ్యక్తి, మరిప్పుడు ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థకు బకాయిలు చెల్లించమని ముఖ్యమంత్రికి ఎందుకుచెప్పడు?
ప్రజలసొమ్ముని, ప్రభుత్వఆస్తుల్ని మింగేయడమేతప్ప, ఇలాంటి మంచిపనులకు డబ్బులు కట్టరా? ఇలాచేస్తే భవిష్యత్ లో ఏకేంద్రప్రభుత్వ సంస్థ అయినా రాష్ట్రంలో ఏప్రాజెక్ట్ అయినాచేపడుతుందా? రాష్ట్రప్రభుత్వానికి నిధులిస్తుందా? జగన్ నిర్వాకంతో రాష్ట్ర పరువుప్రతిష్టలు పూర్తిగా మంటగ లుస్తున్నాయి.
ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థకు ఏపీప్రభుత్వం తక్షణమేకట్టాల్సిన బకాయిలు కట్టకపోతే, రాష్ట్రమే చీకటిమయం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాధనంలూఠీలో పెడుతున్నశ్రద్ధను ఇలాంటి మంచిపనులపై చూపడంలేదు. కేంద్రప్రభుత్వసంస్థ బకాయిలకోసం ఏపీ ప్రభుత్వానికి లీగల్ నోటీసులుఇవ్వడం, ప్రజలకు, ముఖ్యమంత్రికి సిగ్గుచేటు కాదా?
రాష్ట్ర ప్రతిష్టను ఇలా దిగజార్చుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు పెద్దపెద్ద ఉపన్యాసాలిస్తున్నాడు. విచ్చల విడిగాఅప్పులుచేయడం, ప్రజల్ని లూఠీచేయడం ఆసొమ్మంతా మింగేయడం తప్ప జగన్ చేసిందిశూన్యం.
మున్ముందు రాష్ట్రంలో ఒక్కఎల్.ఈ.డీ వీధిదీపం ఆరిపోయినా అందుకు ముఖ్యమంత్రే బాధ్యతవహించాలి. అలాజరక్కుండా ఉండా లంటే ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థకు చెల్లించాల్సినసొమ్ముని తక్షణమే చెల్లించి, చంద్ర బాబునాయుడుగారు, లోకేశ్ గారు రాష్ట్రంలో వెలుగులునింపిన ప్రాజెక్ట్ ను కొనసాగించాలి” అని పట్టాభి డిమాండ్ చేశారు.