Suryaa.co.in

Andhra Pradesh

మరో చాన్సు ఇస్తే ఇళ్లకే వచ్చి దోపిడీ చేస్తారు

– కూల్చే పాలన కావాలా? నిర్మించే ప్రభుత్వం కావాలా?
– సత్తెనపల్లి లో కన్నా భారీ ర్యాలీ

సత్తెనపల్లి: పట్టణంలో టీడీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ-జనసేన కార్యకర్తలు మాదల గ్రామం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో సత్తెనపల్లి లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓపెన్‌టాప్ వాహనాలలో ఎంపి అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక టీడీపీ-బీజేపీ నేతలతో భారీ ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం అంతరించి, రామరాజ్యం రావాలన్నారు. దానికోసం టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు సంకీర్ణ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ సైకో సర్కారును గద్దెదింపకపోతే ప్రజలు బతికి బట్టకట్టడం కష్టం. ఒక్కచాన్సుకే దోపిడీ చేస్తున్నారు. మరో చాన్సు ఇస్తే ఇళ్లకే వచ్చి దోపిడీ చేస్తే అడిగే దిక్కుండదు. మీకు కూల్చే పాలన కావాలా? నిర్మించే ప్రభుత్వం కావాలా? ఈ రోడ్లు చూస్తేనే జగన్ దిక్కుమాలిన పాలన ఎలా ఉందో అర్ధమవుతుంది’ అన్నారు.

ఎంపి అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కిపోయిందని, మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు, కన్నా లాంటి సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అని స్పష్టం చేశారు. తొలుత మాదల వరకూ జరిగిన భారీ ర్యాలీని కన్నా, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు.

 

LEAVE A RESPONSE