– వ్యవసాయాన్ని జగన్ అన్న ఎందుకు దండగ చేశారు
– 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ ను జగన్ అన్న పూర్తి చేయలేదు
– జగన్ ఆన్న హయాంలో హంద్రీనీవా ,గాలేరు నగరి కూడా పూర్తి కాలేదు
– కనీసం ఈ అనంతపురం జిల్లా కు కావాల్సిన ప్రాజెక్ట్ అనంత కూడా పట్టించు కోలేదు
అనంతపురం పట్టణంలో ఏపీసీసీ భారీ బహిరంగ సభ
– ఈ ఎన్నికల్లో మొదటి గ్యారెంటీ ప్రకటన
– ఇందిరమ్మ అభయం పేరుతో మొదటి గ్యారెంటీ
– వైఎస్సార్ ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకి
– ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 వేలు ఇచ్చేలా గ్యారెంటీ
– మహిళ పేరు మీదనే చెక్కు పంపిణీ
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక గ్యారెంటీ ఇస్తుంది. ఇది ఇందిరమ్మ అభయం..ఇంటింటికీ 5 వేలు. పేద కుటుంబాలు నిర్భయంగా బ్రతుకే పథకం. పేదరికం నిర్మూలన కోసం ఇందిరమ్మ అభయం. అసమానతలు తొలగింపు కోసం ఈ నూతన ఆలోచన.
ప్రతి ఇంటికి అండగా నిలబడేది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి మహిళ పేరుమీదే ఈ 5 వేలు ఇస్తాం. ఇంటికి దైవం ఇల్లాలు.అందుకే మహిళలకు ఈ గ్యారెంటీ. మహిళ పేరు మీదనే చెక్కు ఇస్తాం. కాంగ్రెస్ లో వైఎస్సార్ ఎన్నో అద్భుతమైన అమలు చేశాడు. మళ్ళీ రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యం. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదు. బాబు,జగన్ పాలనలో 25 ఏళ్లు వెనక్కి వెళ్ళింది.
ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు రాలేదు. పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదు. ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి లో దూసుకు పోతున్నాయి. రాష్ట్రం అభివృద్ది వెనక్కు నెట్టిన ఘనత చంద్రబాబు,జగన్ ది. జగన్ అన్న 5 ఏళ్లు మోసం చేశాడు. తిరుపతి లో నిలబడి మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పాడు.
ఆనాడు జగన్ అన్న ప్రతిపక్షంలో ఉండి ఎన్నో దీక్షలు చేశాడు. నాకు 25 మంది ఎంపిలు ఇస్తే ఎందుకు హోదా రాదో చూద్దాం అన్నాడు.ఎంపీలు అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అని చెప్పాడు. హోదా జగన్ తో సాధ్యం అని నమ్మితే…అధికారం అనుభవిస్తూ ఒక్క ఉద్యమం చేయలేదు. రాజీనామాలు చేయలేదు.ఢిల్లీలో దీక్షలు చేయలేదు.కనీసం కేంద్రాన్ని ఏనాడూ బెదిరించలేదు. ఇద్దరు హోదాను విస్మరించారు. హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి… పరిశ్రమలు వచ్చేవి.
హోదా కోసం నిజమైన ఉద్యమాలు లేనే లేవు. ఇద్దరు కలిసి బీజేపీ మెడలు వంచి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. హోదా తో పాటు పోలవరం,రాజధాని,కడప స్టీల్,రైల్వే జోన్…అన్ని పెండింగ్. ఒక్క హామిపై మోడీని ఇద్దరు నిలదీయలేదు. బీజేపీ పై పోరాటాలు పక్కన పెడితే .రాష్ట్ర ప్రయోజనాలు మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.
జగన్ ఆన్న మూడు రాజధానులు అన్నాడు. మూడు కాదు కాదా..ఇవ్వాళ ఒక్క రాజధాని కూడా లేదు. బీజేపీ తో ప్రత్యక్ష పొత్తులకు ఎందుకు సిద్ధం అయ్యారు ? ఎందుకు బీజేపీ తో పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీజేపీ తో పొత్తు ఎందుకు చెప్పి ఓట్లు అడగాలి చంద్రబాబు. ప్రజల ప్రయోజనాలు బాబు,జగన్ లు తాకట్టు పెట్టారు. వైఎస్సార్ ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకి.
అలాంటి బీజేపీ తో జగన్ ఆన్న ఎందుకు బానిస అయ్యారు సమాధానం చెప్పాలి. వైఎస్సార్ వారసుడు అయితే వైఎస్సార్ పథకాలను ఎందుకు అమలు చేయలేదు ? వ్యవసాయాన్ని జగన్ అన్న ఎందుకు దండగ చేశారు. 3 వేల కోట్లతో పంట నష్టం జరిగితే స్థిరీకరణ నిధి అన్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేస్తున్నారు.
2.30లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పి జగన్ అన్న మోసం చేశాడు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ వేశాడు. ఎన్నికల ముందు 6 వేలతో దగా డీఎస్సీ వేశారు. కాంగ్రెస్ పక్షాన ఆందోళన చేస్తుంటే… నన్ను స్టేషన్ లో ఈడ్చి పడేశాడు. వైఎస్సార్ జలయజ్ఞం ప్రాజెక్ట్ లో 54 ప్రాజెక్ట్ లు కట్టాడు. ఇందులో 42 ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంటే..జగన్ అన్న మ్యానిఫెస్టోలో పెట్టాడు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ ను జగన్ అన్న పూర్తి చేయలేదు. జగన్ ఆన్న హయాంలో హంద్రీనీవా ,గాలేరు నగరి కూడా పూర్తి కాలేదు.
కనీసం ఈ అనంతపురం జిల్లా కు కావాల్సిన ప్రాజెక్ట్ అనంత కూడా పట్టించు కోలేదు. మద్యపాన నిషేదం అని మోసం చేశారు. మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వమే పూర్తి మద్యం అమ్ముతున్నారు. పూర్తిగా నాసిరకం మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారు. రాష్ట్రంలో 25 శాతం మరణాలు పెరిగాయి. మద్యం అమ్మకాలు ఒక మాఫియా..లెక్క పత్రాలు లేవు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.
నా పుట్టింటి హక్కుల కోసమే నేను కాంగ్రెస్ లో చేరా. నేను చెల్లెలు అని చూడకుండా నా మీద దాడులు చేస్తున్నారు. డబ్బులు పోసి సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారు. నాకు ఏ పార్టీలో చేరడానికి అయినా హక్కు ఉంది. ఒకప్పుడు ఇదే చెల్లెలు…3200 km పాదయాత్ర చేసింది. రాష్ట్ర హక్కుల కోసం ఇదే చెల్లులు ఉద్యమం చేసింది. బాయ్ బాయ్ బాబు అంటూ ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు.
మీకోసం ఇదే చెల్లెలు ఇంత కష్టం చేస్తే…నా మీద,నా భర్త మీద నిందలు వేస్తున్నారు. ఎన్ని నిందలు వేసినా వైఎస్సార్ బిడ్డ భయపడదు. ఆంధ్ర రాష్ట్ర హక్కులు సాధించే వరకు వైఎస్సార్ బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. వైఎస్సార్ హయాంలో సంక్షేమం ఒకవైపు,అభివృద్ధి రెండో వైపు. సంక్షేమం ఇస్తూనే…అభివృద్ధి చేశారు. అది వైఎస్సార్ మార్క్..అది ఇందిరమ్మ మార్క్. జగన్ ఆన్న రేషన్ దుకాణాల ద్వారా 11 వస్తువులు ఇస్తా అన్నాడు. బియ్యం తప్పా ఒక్కటి లేదు.