విత్తనాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత మోదీది

– సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ విజయసంకల్పయాత్ర కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

గజ్వేల్: గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల భూములు లాక్కునేందుకు నోటీసులు జారీ చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల భూములను తిరిగి అప్పగించాలి. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బిజెపికి ఓటు వేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించి ఆడపిల్లల ఆత్మగౌరవం కాపాడారు.

 

Leave a Reply