Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్

పొత్తును చెడగొట్టేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నం చేశాడు…ఇప్పుడూ కుట్రలు చేస్తున్నాడు
ఉత్తరాంధ్ర ద్రోహి జగన్-అబద్ధాలు చెప్పడంలో పీహెచ్.డీ చేశాడు
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని పట్టించుకోడు…కోట్ల ఖర్చుచేసి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నాడు
పేదల పథకాలు రద్దు చేసి…వేలకోట్లు దోచేసిన జగన్ పేదల సీఎం అంటే జనం నమ్మాలా.?
– శ్రీకాకుళం రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఆదరిస్తున్న మీరు మళ్లీ ఆదరిస్తారని నమ్ముతున్నా. ఈ జిల్లా నా మనసుకు ఎంతో దగ్గర. నేను ఎప్పుడూ అభిమానించే జిల్లా. రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఇది. నా మిత్రుడు, ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రన్నాయుడు సొంత జిల్లా ఇది. బీసీ సింహం ఎర్రన్నను స్మరించుకుంటూ సభను మొదలుపెడదాం.

అరాచక పాలనను ఇంటికి పంపేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే. నేనూ బాధితుడినే. అచ్చెన్నాయుడిని ఎలా అరెస్ట్ చేశారో చూశాం. కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. విభజనతో రాష్ట్రం నష్టపోయింది. అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారుచేసుకున్నాను. అమరావతి, పోలవరం, పరిశ్రమలకు పెద్దపీట వేశా. విభజన కంటే జగన్ రెడ్డి విధ్వంసపాలన వల్లే ఏపీ ఎక్కువ నష్టపోయింది. జగన్ పని అయిపోయింది. రాజకీయ తుపానుకు నాంది పడింది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడుతుంది.

జగన్ పాలనలో పేదలు…నిరుపేదలయ్యారు
జగన్ రెడ్డి పాలనలో ఒక్కరి జీవితాల్లోనైనా మార్పు వచ్చిందా? జగన్ పాలనలో పేదలు మరింత నిరుపేదలయ్యారు. వైసీపీ నేతలు ధనవంతులయ్యారు. రూ.10 రూ.100 దోచుకునే దొంగ జగన్ రెడ్డి. యువతకు ఉద్యోగాల్లేవు..నిత్యావసర ధరలు పెరిగాయి. మహిళలకు రక్షణ లేదు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కు పోయింది. నేను పేదల మనిషి అని జగన్ కొత్త డ్రామా చేస్తున్నాడు జగన్ రెడ్డి. నువ్వు ఏవిధంగా పేదవాడివో చెప్పాలని సవాల్ చేస్తున్నా. ఇప్పుడు మీరంతా సిద్ధమా…మీ ఓటుతో కలియుగ భస్మాసురుడిని ఓడించేందుకు సిద్ధమా?

9 సార్లు కరెంటు చార్జీలు పెంచిన నువ్వు పేదల ప్రతినిధివా? రూ.200 వచ్చే బిల్లు రూ.800 రావడానికి నువ్వు కాదా కారణం? 3 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచిన వ్యక్తి పేదవాడా? ఆర్టీసీ నష్టాల్లో ఉంటే పట్టించుకోడు. కోట్ల ఖర్చు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు పెట్టుకుంటున్నాడు. నువ్వా పేద వాడివి? అన్నా క్యాంటీన్లు మూసేశాడు. పేదవాడికి అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదల ప్రతినిధా? మద్యం రేట్లు పెంచేశాడు. రూ.500 సంపాదిస్తే రూ. 300 తాగుడికే పోతోంది. మరి మా ఆడబిడ్డలు ఇల్లు ఎలా నడిపేది? నాశిరకం మద్యంతో మహిళల మాంగళ్యాలు తెంచుతున్నాడు. పేదల రక్తం తాగే వ్యక్తి పేదల ప్రతినిధి అవుతాడా?

జగన్ నాటకాల ముందు సురభినాటకాలూ పనిచేయవు
చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు తమ్ముళ్లూ…జగన్ ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం వేశాడు. జగన్ రెడ్డి నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పనిచేయవు. రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టాడు. నువ్వా పేదవాడివి? పేదలకు టిడ్కో ఇళ్లు కట్టివ్వకుండా హైదరాబాద్, బెంగుళూరు సహా అన్ని చోట్ల ప్యాలెస్ లు కట్టుకున్నాడు. సాక్షి పత్రికకు వెయ్యి కోట్ల ప్రకటనలు ఇచ్చాడు. ఇతని సాక్షి కోసమే ప్రభుత్వం ఉందనుకుంటున్నాడు. చెత్త సలహాదారుల కోసం రూ.680 కోట్ల ప్రజాధనం దోచిపెట్టాడు. మీకు ఉద్యోగం రావాలన్నా…మీ భవిష్యత్ బాగుండాలన్నా టీడీపీ –జనసేన ప్రభుత్వం రావాలి. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకూ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. యువత రోడ్డు మీదకు వచ్చి సైకిల్ ఎక్కి టీడీపీ-జనసేన జెండాలు పట్టుకోండి. కొత్త ఓటర్లు మీ భవిష్యత్ ను బంగారు బాటవైపు వేయండి. ఇంట్లో కూర్చోకుండా బాధ్యతగా ఓటు వేయండి. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువుంది. ఐదేళ్లు కష్టపడి 35 శాతం నుంచి 27 శాతానికి ఆ వ్యత్యాసం తగ్గించాం.

తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే మన పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది. జగన్ రెడ్డి అరాచ పాలన వల్ల ఏపీ-తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో 44 శాతం తలసరి తేడా వచ్చింది. దీని వల్ల ఏడాదికి ప్రతి వ్యక్తి రూ.80 వేలు పోగొట్టుకుంటున్నాడు. ప్రభుత్వం అంటే సంపదను సృష్టించాలి. ఆ సంపదను పేద ప్రజలకు ఇవ్వాలి. అప్పులు చేసి బటన్ నొక్కి, సహజవనరులను మింగేస్తే ప్రజలు నష్టపోతారు. సంపద సృష్టించడం తెలిసిన టీడీపీ.

పేదరికం లేని సమాజమే లక్ష్యం
పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కల. అందుకే ఆనాడు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాడు. స్థానికి సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాడు. నేను వచ్చాక ఆడబిడ్డల కోసం డ్వాక్రా సంఘాలు తెచ్చాను. సూపర్-6 లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చాను. దీపం పథకాన్ని అమలు చేస్తే దుర్మార్గుడు ఆపేశాడు. మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ప్రజల ఇంట్లో మరలా దీపాన్ని వెలిగిస్తాం. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

రైతులను రాజులు చేసే బాధ్యతతో పాటు వాణిజ్య పంటలకు సహకరిస్తాం. అన్నదాత పథకం ద్వారా రూ.20 వేలు అందిస్తాం. బీసీలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి ఒక డిక్లరేషన్ ను త్వరలోనే ప్రకటిస్తాము. చెత్త పన్ను రద్దు చేస్తాం. మద్యంపై దోపిడీ అరికడతాం. ఉచితంగా ఇసుకను ఇస్తాం. రైతులకు సబ్సీడీలను తిరిగి అమలు చేస్తాం..కరెంటు బాదుడు నివారిస్తాం. పెట్రోల్ ధరలు నియంత్రణ చేసి పేదవాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

ఉత్తరాంధ్ర ద్రోహి జగన్
ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ రెడ్డి. అబద్ధాలు చెప్పడంలో జగన్ రెడ్డి పీహెచ్‌డీ చేశాడు. ఉత్తరాంధ్రను ఉద్దరిస్తామని చెప్పి నాశనం చేశాడు. ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి ద్వారా గోదావరి నీళ్ళు వంశధారకు అనుసంధానమైతే శ్రీకాకుళం జిల్లాకు నీటి ఎద్దడి ఉండదు. అందుకని రూ.2 వేల కోట్లు గతంలో నేను మంజూరు చేస్తే ఐదేళ్ళో జగన్ రెడ్డి చేసిన ఖర్చు రూ.5 కోట్లు మాత్రమే. స్పీకర్‌కు, మంత్రికి సిగ్గు ఉందా? తారక రామ తీర్థ సాగర్ కోసం ఐదేళ్ళో నాడు రూ.284 కోట్లు నేను ఖర్చు చేస్తే నేడు జగన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో రూ.76 కోట్లు ఖర్చు చేశాడు.

మహేంద్ర తనయ కోసం రూ.553 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి రూ.26 కోట్లు ఖర్చు చేశాడు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.237 కోట్లు మేము ఖర్చు చేస్తే జగన్ రెడ్డి రూ.68 కోట్లు ఖర్చు చేశాడు. వంశధార ఫేజ్-2కి రూ.420 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. వంశధార-నాగావళి లింక్ కెనాల్ కోసం రూ.145 కోట్లు ఖర్చు చేశాం. జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రూ.1,600 కోట్లు 2014-2019 వరకు నేను ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ఖర్చు చేసింది కేవలం రూ.594 కోట్లు మాత్రమే. మళ్లీ మేము అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం.

టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్
టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్. వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచాయి. ఎక్కడికెక్కడ భయం పట్టుకుంది. కనీసం అభ్యర్ధులు కూడా వైసీపీకి దొరకడం లేదు. ఇంఛార్జులు అంటూ జాబితాలను విడుదల చేశారు…ఇప్పుడేమో వారు అభ్యర్ధలు కాదని చెప్తున్నారు. ఇక నువ్వు దేనికి సిద్ధం జగన్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా 99 మంది అభ్యర్ధులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ జగన్ రెడ్డి మాత్రం యుద్ధానికి రాకుండా ప్రారంభానికి ముందే పారిపోతున్నాడు.

టీడీపీ-జనసేన పొత్తు మా కోసం కాదు…5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నాం. వైసీపీ విముక్తి రాష్ట్రాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని ప్రజలు ఆమొదించారు. ప్రజలకు లేని బాధ వైసీపీకి ఎందుకు? దేనికి అంటే వారికి మా కూటమి అంటే భయం. అందుకే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు, విద్వేషాలు పెట్టి రెచ్చగొడుతున్నాడు. ఇటువంటి నీచ, చవట రాజకీయాలకు స్వస్తి పలుకుదాం.

నేను ఎంపిక చేసిన అభ్యర్ధులు ప్రజాభిప్రాయం ద్వారా ఎంపిక చేసినవారే. ప్రజలు ఆమోదించిన వారికే సీట్లు ఇవ్వాలనే కొత్త విధానానికి నేను శ్రీకారం చుట్టాను. కోటి 30 లక్షల మందికి ఫోన్లు ద్వారా వారి అభిప్రాయాలను తెలసుకొని మంచి అభ్యర్ధులను ప్రకటించాను. వారిని ప్రజలు ఆశీర్వదించాలి. మన ధ్యేయం వైసీపీని ఇంటికి పంపించాలి. రాజకీయాలకు పనికి రాని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.

ఉత్తరాంధ్రలో జగన్ ముఠా దోపిడీ
ఎవడో సుబ్బారెడ్డి అనేవాడు కడప నుంచి వచ్చి ఇక్కడ భూములను కొట్టేస్తాడని, నేను కొట్టలేక పోతున్నాని రెవెన్యూ మంత్రి అధర్మన బాధపడుతున్నాడు. ఆ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టివుంటే నేను శభాష్ అనేవాడిని. కానీ అలా చేయడు ఈ అధర్మన. బందిపోటు దొంగలు జగన్ రెడ్డి గ్యాంగ్. ఎక్కడ భూములుంటే, ఎక్కడ గనులుంటే అక్కడ వాళ్ళు వాలిపోతారు. వాళ్ళను చూస్తే స్పీకర్‌కు, మంత్రలు వణికి పోతున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖ చేద్దామనుకుంటే గంజాయి, నేరాల రాజధానిగా విశాఖను జగన్ రెడ్డి మార్చాడు.

ఇక్కడున్న భూములు, వ్యాపారాలు, ఖనిజ సంపద మీద తప్ప ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డికి ప్రేమ లేదు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను కొట్టేశారు. రివర్స్ పాలన వల్ల నిరుద్యోగం పెరిగిపోయింది. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే భోగాపురం, భావనపాడు పోర్టును పూర్తయ్యేది. భావనపాడుకి రెండోసారి శంకుస్థాపన చేసి మూలపాడని పేరు మార్చాడు. విశాఖ నుంచి లూలూ వంటి అన్ని కంపెనీలు, మెట్రో ప్రాజెక్టు పారిపోయాయి. రైల్వే జోన్ కు భూములు ఇవ్వలేదు. నేను శంఖుస్థాపన చేసిన ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేయలేకపోయారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. వీటన్నిటి వల్ల ఉత్తరాంధ్రలకు ఉద్యోగాలు రాకుండా చేశారు.

మానసిక రోగి జగన్
రాష్ట్రంలో మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. వాస్తవాలను చూపిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ సభలో నాది, పవన్ కళ్యణ్ ఫోటోలతో కట్ అవుట్ లు పెట్టంచి వాటిపై దాడులు చేయించిన సైకో, మానిసక రోగి జగన్ మోహన్ రెడ్డి. మా సభలో జగన్ రెడ్డి బొమ్మ పెట్టించి కొట్టించలేమా.? అది సభ్యత కాదు. మానసిక రోగులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. చొక్కా చేతులు మడతపెట్టమని అంటున్నాడు. జగన్ రెడ్డి! మీరు చొక్కా మడతపెడితే మా తమ్ముళ్లు కుర్చీలు మడతపెడతారు. నీ కుర్చీ ఖాళీ అవుతుంది.

మిడిసి పడితే బట్టలు ఇప్పించి తరిమి తరిమి కొట్టే ధైర్యం మా తమ్ముళ్లకు ఉంది. ఆడబిడ్డలు వీర వనితలుగా పసుపు జెండా పట్టుకొని, ఝాన్సి లక్ష్మీ భాయ్, రాణిరుద్రమ దేవిలా తయారవ్వాలి. అప్పుడే రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోగలం. జగన్ రెడ్డి అర్జునుడు కాదు..పంచభూతాలు, రాష్ట్రాన్ని మింగేసిన అక్రమార్జునుడు..జగన్ రెడ్డి పురాణ పురుఫుడు కాదు..కలియుగంలో పుట్టిన భస్మాసురుడు. పరదాలు పెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని తిరుగుతున్నాడు. పోలీసులు లేకపోతే బయటికి కూడా రాలేడు. భస్మాసురుడిని వదించడానికి మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. సిగ్గు లేకుండా మీరే నా స్టార్ క్యాంపెయినర్ లని వాలంటీర్లను బతిమిలాడుకుంటున్నాడు. 5 కోట్ల మంది ప్రజలు జగన్ రెడ్డి బాధితులమే. టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేయండి.

శ్రీకాకుళాన్ని దోచేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు
మంత్రి ధర్మన ప్రసాదరావు…ప్రసాదంలా శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నాడు. విశాఖ భూకుంభకోణంలో ఆయన సూత్రధారని అప్పుడే సిట్ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇసుక రాంప్ వ్యవహారాలను కొడుకు చేతిలో పెట్టి ఆర్జన చేస్తున్నాడు. సావిత్రిపురంలో 67 ఎకరాల్లో భారీ లే అవుట్లు వేశాడు. అందులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు. సెంటు పట్టాల్లో కూడా అవినీతికి పాల్పడ్డాడు. ప్రభుత్వ భూమిని బినామీ పేర్ల మీద రాయించుకొని తిరిగి ఆ భూమినే ప్రభుత్వానికి అప్పగించి కోట్లు కాజేశాడు. శ్రీకాకుళం-ఆముదాలవలస రోడ్డు గుంతల మయంగా ఉంది.

ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. సంపాదనపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. అరాచకానికి కేరాఫ్ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్…అసెంబ్లీకి రావడానికి అర్హత లేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. వ్యపారాల నుంచి కమీషన్లు, పోర్టులో ఉద్యోగాలని డబ్బులు గుంజుతాడు. నీకంటే నీ భార్యే బెటర్ అని పొమ్మన్నాడు జగన్ రెడ్డి. ఇన్ని అరాచకాలు చేసి అచ్చెన్నాయుడు ఓడిస్తాననే పగటి కలలు కంటున్నాడు. ఆముదాలవలసలో ప్రజల ఖర్మ కొద్దీ గెలిచి స్పీకర్ అయ్యాడు తమ్మినేని సీతారామ్. అక్రమార్జన కోసం జనంపైకి కొడుకుని, భార్యను వదిలాడు. కప్పం కట్టందే ఏ పనీ చేయడు. నాగావళి-వంశధార నుండి వచ్చే ఇసుక లారీకి రూ.6,000 వసూలు చేస్తున్నాడు.

ఆయన సొంత కాలేజీ కోసం 4 ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీలను మూయించాడు. రూ.4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు. దాని కోసం కూన రవికుమార్ పోరాడుతున్నాడు. పలాసలో నియోజకవర్గాన్ని అడ్డంగా మింగేస్తున్నాడు మంత్రి అప్పలరాజు. వన్ టైమ్ ఎమ్మెల్యే…ఏది దొరికితే దానిని అర్జన చేస్తున్నాడు. నెమలి కొండ, నల్ల బొడ్డూరు కండ, సూది కొండలను తవ్వేశాడు. మరోసారి గెలిస్తే పలాసలో కొండలే ఉండవు. అక్రమాలను ప్రశ్నించిన ఆడబిడ్డ శిరీషపై కేసు పెట్టి వేదిస్తున్నాడు.

పాతపట్నం నియోజకవర్గానికి పట్టిన అశాంతి ఎమ్మెల్యే రెడ్డి శాంతి. వసూలు బాధ్యతలను పీఏలకు అప్పగించి అక్రమార్జనకు అడ్డులేకుండా పోయింది. నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్…జగన్ కు భజన దాసు. నియోజకర్గాన్ని కుటుంబానికి పంచాడు. ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి కబ్జా చేశాడు. తోటాడులో స్టోన్ క్రషర్ పేరుతో 10 ఎకరాల భూమిని కొట్టేశాడు.

వేగవంతంగా వంశధార-నాగావళి నదుల అనుసంధానం
వంశధార-నాగావళి నధులను అనుసంధానం చేస్తాం. జీడిపిక్క రైతుకు గిట్టు బాటు ధర కల్పింస్తాం. పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుడతాం. నర్సన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రైతుల కలైన లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తి చేస్తాం. వంశధార-బాహుదా నదులను అనుసంధానం చేసి ఆరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. పలాస-కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తాం.ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం చూపించాం.

రూ.19 వందల కోట్లతో సురక్షిత తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టాం. తొలివిడతలో భాగంగా రూ.468 కోట్లు ఖర్చు చేశాం. పలాసలో రూ.50 కోట్లు వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి 4 ఎకరాల భూమినిచ్చాం. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేస్తాం. పలాస, ఇచ్చాపురం, పాలకొండలో 5 డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కిడ్నీ బాధితులకు రూ.2,500 ఫించను ఇచ్చిన తొలి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇచ్చాపురం, పలాసలో 167 మినీ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. భావనపాడు పోర్టును పెద్ద పోర్టుగా చేసి ఉద్యోగాలు కల్పిస్తాం.

విశాఖ నుంచి భావనపాడు వరకు సముద్రం పక్కన రోడ్లను నిర్మిస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటై పర్యటన రంగాభివృద్ధి చెందుతుంది. టెక్కలిలో మెడికల్ కాలేజీని నిర్మిస్తాం. బుడదిగట్ట పాలెంలో మత్య్సకారుల కోసం జెట్టీ నిర్మిస్తాం. కళింగ వైశ్యులను బీసీ-డీలుగా నేను చేశాను. ఓబీసీలుగా గుర్తించాలని కోరుతున్నారు..ఓబీసీలుగా మార్చే బాధ్యత నాది

 

LEAVE A RESPONSE