కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పూజలు

– జనసేన ఆఫీసును సందర్శించిన బాబు

కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు. అనంతరం తన చాంబర్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబును సత్కరించారు. కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు కుప్పం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. జనసేన పార్టీ కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు 21వ వార్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు చంద్రబాబుకు శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి సత్కరించారు.

కుప్పం పీఏ మనోహర్‌కు బాబు పరామర్శ
కుప్పం నియోజకవర్గంలో తన పిఎ గా పని చేస్తున్న మనోహర్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న మనోహర్ కొద్ది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply