రైల్వే హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్స

విజయవంతంగా 93సం. వృద్ధురాలికి బై పోలార్ హెమియార్త్రో ప్లాస్టి

విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ హాస్పిటల్, విజయవాడ లో బైపోలార్ హెమియార్త్రోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించిరు. వైద్యశాలలో తొలిసారిగా 93 ఏళ్ల వయసున్న వృద్ధురాలికి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళి మరియు అనస్థీషియాలజిస్ట్ మరియు డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వర ప్రసాద్ ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.

వైద్యశాల చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సౌరిబాల సమాచారం మేరకు హెమియార్త్రో ప్లాస్టి అనేది ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సా ప్రక్రియ, ఇది తొడ ఎముక యొక్క మెడ పగుళ్లకు చికిత్స చేయడానికి సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో తొడ తలను తీసివేసి భర్తీ చేస్తారని వివరించారు. రైల్వే హాస్పిటల్ లో ఇలాంటి సక్సెస్ చేయడం తొలిసారిగా అది కూడా 93 సంవత్సరాల వయసు మహిళకు నిర్వహించడం చికిత్స విజయవంతమవడం జరిగిందని అన్నారు.

ఈ శస్త్రచికిత్స 27వ తేదీ బుధవారం జరిగిందని రోగి బాగా కోలుకున్నారని తెలిపారు. వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది కృషితో దక్షిణ మధ్య రైల్వే హాస్పిటల్ లో ఈ అరుదైన చికిత్స జరగడం విజయవంతం అవడం హర్షించదగ్గ విషయమని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వైద్య బృందాన్ని అభినందించారు.

Leave a Reply