– జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఎమ్మెల్యేలు గ్రామాలను కబళిస్తున్నారు
– పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కొత్తబోధన గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా
– కొత్తబోధన గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కన్నా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరిస్తూ , తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు
కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు.ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రేమ అభిమానాలు చూపిన కొత్త పోతన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా రాష్ట్రాల మీద నియోజకవర్గాల మీద గ్రామాల మీద పడిందని, దానికి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపద మొత్తాన్ని దోచుకుంటుంటే దొంగల ముఠా నియోజకవర్గాల మీద గ్రామాల మీద పడి ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఈ ఐదు సంవత్సరాలు చూస్తున్నామని ధ్వజమెత్తారు.
దోపిడి తప్ప ఇంకో కార్యక్రమం ఈ రాష్ట్రంలో లేదని, కానీ నవరత్నాలు పేరుతో సంక్షేమం చేస్తానని చెబుతున్నారు. కానీ చేసావని నవ మోసాలని విమర్శించారు. పల్నాడు ప్రాంతానికి అసలేం అభివృద్ధి చేశాడో చూపిస్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి యంత్రాలను కొనుగోలు చేస్తే, మూలన పడేసాడని ప్రజల ధనం వ్యర్థం చేస్తున్నాడని రైతన్నల కన్నీరుకు కారణం అవుతున్నాడని ధ్వజమెత్తారు.
ప్రజలు మోయలేనంత భారం వేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడని నిజంగానే అభివృద్ధి జరిగి ఉంటే, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం- జనసేన కూటమి ప్రభుత్వం రాగానే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు.