తొలి జాబితాలోనే ఎస్సీలకు టీడీపీ అగ్ర తాంబూలం

-తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా సంచలనం రేపుతోంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో ఎస్సీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. మొదటి జాబితాలోనే 20 సీట్లు ఎస్సీలైన మాల, మాదిగలకు కేటాయించడం చరిత్రాత్మకం. ఇది ప్రతీ దళితుడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ అని మరోసారి రుజువయ్యింది.

జగన్ రెడ్డి గత ఐదేళ్లుగా ఎస్సీలను అణిచివేశారు. జగన్ రెడ్డి ఎస్సీలను కేవలం ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుంటూ వారికి రావాల్సిన రాజ్యాంగబద్ద హక్కులను కాలరాస్తున్నారు. తన స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం దళితులను బలిపెడుతున్నాడు. జగన్ చేసే దళిత వ్యతిరేక చర్యలపై, అక్రమాలపై పోరాడేందుకు రాబోయే ఎన్నికల్లో దళితులంతా సిద్ధంగా ఉండాలి. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ..మొదటి జాబితాలో ఎస్సీలకు అగ్ర తాంబూలం వేసిన టీడీపీకి దళితులంతా మద్దత్తు తెలిపి, రాబోయే ఎన్నికలల్లో అఖండ మెజారిటీ గెలిపించాలని కోరుతున్నా.

Leave a Reply