భారత జాతి ముద్దుబిడ్డ అద్వానీకి భారతరత్న రావటం సంతోషం

– నందమూరి బాలకృష్ణ

భారతజాతి ముద్దుబిడ్డ ఎల్.కె.అద్వానీకి భారతరత్న రావటం సంతోషంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు మారు పేరు అద్వానీ. కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అద్వానీ దేశ ప్రజలకు విశేష సేవలందించారు. ఆయన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వటం సంతోషంగా ఉంది. అద్వానీ ఆయుఆరోగ్యాలతో జీవిస్తూ తన సలహాలు, సూచనలు దేశ ప్రజలకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

Leave a Reply