Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే దళితులు మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది

– ఒంగోలు దళిత ప్రతిఘటన సభలో ఎం.ఎస్ రాజు

తెలుగుదేశం పార్టీ యస్సీ సెల్ అధ్వర్యంలో దళిత ప్రతిఘటన సదస్సు ఓంగోలు జిల్లా కేంద్రం అంబేడ్కర్ భవన్ లో జరిగింది ….కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం యస్ రాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై భౌతిక దాడులు, బెదిరింపులు, హింస, వివక్ష లు పెరిగిపోయాయి.

తాజాగా తెనాలిలో దళిత లెక్చరర్ జక్రయ్య ఆత్మహత్య చేసుకోవడం దళితుల హృదయాల్ని కలిచివేసింది. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై 4950 నేరాలు జరిగాయి. అక్రమ ఇసుక, మధ్యం, జగన్ రెడ్డి లూటీపై ప్రశ్నించిన వారిని టార్గెట్ గా చేసుకుని వైసీపీ గూండాలు దాడులకు పాల్పడుతున్నారు. చీరాలలో కిరణ్ కుటుంబానికి ఇంకా న్యాయం జరగలేదు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే దళితులు మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది. జగన్ రెడ్డి దళిత వ్యతిరేక ప్రభుత్వం పై దళితులను చైతన్యం చేయడానికి ప్రతీ జిల్లాలలో ఈ సభలు నిర్వహిస్తాం.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్కొడేపి శాసన సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, యర్రగొండపాలెం ఇంచార్జీ ఏరిక్సన్ బాబు, దర్శి ఇంచార్జీ రమేష్, ఒంగోలు పార్లమెంట్ ఎస్సీ సెల్ నాయకులు వందలాది మంది దళితులు పాల్గొన్నారు.కార్యక్రమంలో వక్తలు జగన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలపై ప్రసంగించారు.

LEAVE A RESPONSE